జీఈతో ఆర్ఐఎల్ జట్టు
ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్‌స కోసం
న్యూఢిల్లీ: రిలయన్‌స ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), జీఈ కంపెనీలు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స(ఐఐఓటీ) వ్యాపారం కోసం ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారుు. ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స వ్యాపారం కోసం డిజిటల్ సొల్యూషన్‌స ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని రెండు కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారుు. ఆరుుల్, గ్యాస్, విద్యుత్తు, ఫార్మా, టెలికం ఇతర రంగాల్లో వినియోగదారులకు ఐఐఓటీ సొల్యూషన్‌స అందించడానికి రెండు దిగ్గజ సంస్థల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారని ఆ ప్రకటన పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా డేటా కనెక్టివిటీ ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్న ఉత్పత్తులను ఐఓటీ పరికరాలు ఆపరేట్ చేస్తారుు. ఉదాహరణకు మనం ఎక్కడ ఉన్నా, కారును లాక్ చేయవచ్చు. సీసీటీవీని నియంత్రించవచ్చు.
రిలయన్‌స జియో అందిస్తున్న హై బ్యాండ్‌విడ్‌త కనెక్టివిటీ, క్లౌడ్ సర్వీసుల వల్ల భారత్‌లో ఐఐఓటీకి మంచి వృద్ధి అవకాశాలున్నాయని ఆర్‌ఐఎల్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. జీఈ సంస్థ ప్రిడిక్స్ క్లౌడ్‌ను, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ అప్లికేషన్‌సను, డేటా సైన్‌స నైపుణ్యాలను అందిస్తుందని, తాము ఒక ఇండిపెండెంట్ సాఫ్ట్‌వేర్ వెండార్‌గా ప్రిడిక్స్‌పై సొల్యూషన్‌స ఆఫర్ చేస్తామని వివరించారు. డిజిటల్ దిశగా భారత్ అడుగులు వేయడం హర్షించదగ్గ విషయమని జీఈ చైర్మన్, సీఈఓ జెఫ్ ఇమ్మెల్ట్ చెప్పారు.