GE
-
వాల్ స్ట్రీట్‌కు వైరస్ షాక్
పలు దేశాలలో మళ్లీ కోవిడ్-19 కేసులు విజృంభిస్తుండటంతో బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. డోజోన్స్ 943 పాయింట్లు(3.4 శాతం) పడిపోయి 26,520కు చేరగా.. ఎస్అండ్పీ 120 పాయింట్లు(3.5 శాతం) నష్టంతో 3,271 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 426 పాయింట్లు(3.75 శాతం) కోల్పోయి 11,005 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు నాలుగు నెలల కనిష్టాలకు అంటే జులై స్థాయికి చేరాయి. అమెరికా, రష్యాసహా యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ఒక్కసారిగా భారీ అమ్మకాలకు తెరతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్రిటన్ బాటలో జర్మనీ, ఫ్రాన్స్‌లో లాక్డవున్లు విధించడంతో అంతకుముందు యూరోపియన్ మార్కెట్లు సైతం 2.6-4 శాతం మధ్య కుప్పకూలినట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన భారీ ప్యాకేజీపై కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు వివరించారు. వచ్చే నెల మొదట్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలోగా ప్యాకేజీకి ఆమోదముద్ర పడుతుందని ఇన్వెస్టర్లు భావించినట్లు తెలియజేశారు. ఫాంగ్ స్టాక్స్ వీక్ ఫాంగ్ స్టాక్స్‌గా పేర్కొనే యాపిల్, అల్ఫాబెట్, ఫేస్బుక్ నేడు క్యూ3(జులై- సెప్టెంబర్) ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. బుధవారం అల్ఫాబెట్, ఫేస్బుక్ 5.5 శాతం, మైక్రోసాఫ్ట్, యాపిల్ 5 శాతం, అమెజాన్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 4.5 శాతం క్షీణించగా..ఎయిర్‌లైన్స్ కంపెనీలలో యునైటెడ్, సౌత్‌వెస్ట్, డెల్టా, అమెరికన్ 4.6 -2.5 శాతం మధ్య నష్టపోయాయి. క్రూయిజర్ కౌంటర్లలో కార్నివాల్ 11 శాతం, రాయల్ కరిబియన్ 7.5 శాతం చొప్పున కుప్పకూలాయి. ఫార్మా డౌన్ కోవిడ్-19కు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్న ఫార్మా దిగ్గజాలలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో నోవావాక్స్ 9 శాతం, మోడర్నా ఇంక్ 7 శాతం, ఫైజర్ 5.3 శాతం, జీఎస్కే 4 శాతం, మెక్‌డొనాల్డ్స్ 3.7 శాతం, నోవర్తిస్, ఇంటెల్ కార్ప్ 3 శాతం, సనోఫీ 2.7 శాతం చొప్పున డీలా పడ్డాయి. అయితే ఈ ఏడాది క్యూ3లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఈ షేరు పతన మార్కెట్లోనూ 5 శాతం దూసుకెళ్లింది. -
ఆ కంపెనీలో 12వేల ఉద్యోగాలు కట్
జనరల్ ఎలక్ట్రిటీ (జీఈ) కంపెనీ భారీగా ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా జీఈ పవర్ విభాగంలో వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు పథకాలు రచించింది. అమెరికా బయట సుమారు 12వేలమంది ఉద్వాసన పలకనుంది. గ్యాస్, పవర్ , కోల్ మార్కెట్ నష్టాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అతి పెద్ద గ్యాస్ టర్బైన్లు ఉత్పత్తిదారుగా ఉన్న జీఈ పవర్ గ్యాస్-టర్బైన్ తయారీదారు పునరుత్పాదక లాభాల క్షీణత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. పవర్బిజినెస్లో 12వేల ఉద్యోగాలను కట్ చేయాలని ప్రణాళిక వేసింది. ఈ క్రమంలో జీఈ పవర్ కార్పోరేషనులో 18 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించనున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ అండ్ ప్రొడక్ట్ రెండింటిలోనూ ఈ కోత ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కంపెనీ కొత్త సీఈవోగా ఎన్నికైన జాన్ ఫ్లాన్నెరీ సంస్థ ఖర్చులను తగ్గించడంతోపాటు, కష్టాల్లో ఉన్నసంస్థను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం బాధాకరమైనది. కానీ అవసరమైనదని డివిజన్ చీఫ్ రస్సెల్ స్టోక్స్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో సవాళ్లు కొనసాగినప్పటికీ 2018 లో జీఈ పవర్ పురోగతిని సాధిస్తుందని తాము భావిస్తున్నామన్నారు. మరోవైపు ఇప్పటికే కార్పొరేట్ జెట్లను ఉపయోగించడాన్ని కంపెనీ సీఈవో వదులుకున్నారు. అలాగే త్రైమాసిక డివిడెండ్ చెల్లింపును ఆలస్యం చేయడంతోపాటు కొన్ని వ్యాపారాలను విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా వచ్చే ఏడాది పవర్ డివిజన్లో నిర్మాణాత్మక ఖర్చులు 1 బిలియన్ డాలర్లు తగ్గుతుందని ఆశిస్తోంది. మొత్తంగా 2018 నాటికి సంస్థ అంతటా 3.5 బిలియన్ల డాలర్ల ఖర్చులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వార్తలతో న్యూయార్క్ రెగ్యులర్ ట్రేడింగ్‌లో బుధవారం దాదాపు ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. -
‘ఎస్బీఐ కార్డ్’లో కొత్త భాగస్వామి
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి వచ్చే మూడు నెలల్లో కొత్త భాగస్వామిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని బ్యాంకు తెలిపింది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) ఎస్బీఐ కార్డు వ్యాపార భాగస్వామిగా ఉండగా, తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త జాయింట్ వెంచర్ భాగస్వామిని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నట్టు ఎస్బీఐ ఎండీ దినేష్‌కుమార్ ఖరా వెల్లడించారు. జీఈ తప్పుకుంటే ఎస్బీఐ కార్డ్ వ్యాపారంలో ఎస్బీఐ వాటా 74 శాతానికి పెంచుకుంటుంది. -
జీఈతో ఆర్ఐఎల్ జట్టు
ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స కోసం న్యూఢిల్లీ: రిలయన్స ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), జీఈ కంపెనీలు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స(ఐఐఓటీ) వ్యాపారం కోసం ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారుు. ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స వ్యాపారం కోసం డిజిటల్ సొల్యూషన్స ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని రెండు కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారుు. ఆరుుల్, గ్యాస్, విద్యుత్తు, ఫార్మా, టెలికం ఇతర రంగాల్లో వినియోగదారులకు ఐఐఓటీ సొల్యూషన్స అందించడానికి రెండు దిగ్గజ సంస్థల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారని ఆ ప్రకటన పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా డేటా కనెక్టివిటీ ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్న ఉత్పత్తులను ఐఓటీ పరికరాలు ఆపరేట్ చేస్తారుు. ఉదాహరణకు మనం ఎక్కడ ఉన్నా, కారును లాక్ చేయవచ్చు. సీసీటీవీని నియంత్రించవచ్చు. రిలయన్స జియో అందిస్తున్న హై బ్యాండ్విడ్త కనెక్టివిటీ, క్లౌడ్ సర్వీసుల వల్ల భారత్‌లో ఐఐఓటీకి మంచి వృద్ధి అవకాశాలున్నాయని ఆర్ఐఎల్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. జీఈ సంస్థ ప్రిడిక్స్ క్లౌడ్‌ను, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ అప్లికేషన్‌సను, డేటా సైన్స నైపుణ్యాలను అందిస్తుందని, తాము ఒక ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ వెండార్‌గా ప్రిడిక్స్పై సొల్యూషన్స ఆఫర్ చేస్తామని వివరించారు. డిజిటల్ దిశగా భారత్ అడుగులు వేయడం హర్షించదగ్గ విషయమని జీఈ చైర్మన్, సీఈఓ జెఫ్ ఇమ్మెల్ట్ చెప్పారు. -
విదేశీ సంస్థలపై ‘రెట్రో పన్ను’ కత్తి!
అమెరికా దిగ్గజ కంపెనీల అభిప్రాయం న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారాలకు సంబంధించి రెట్రాస్పెక్టివ్ పన్ను (గత కాలం వ్యాపార లావాదేవీలపై వర్తించే విధంగా విధించే పన్ను) విదేశీ సంస్థలపై ‘వేలాడే కత్తి’ లాంటిదని అమెరికా ప్రముఖ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రముఖ యంత్ర పరికరాల సంస్థ జీఈ, అలాగే ఎయిరోస్పేస్, డిఫెన్స్ దిగ్గజ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ ఉన్నతాధికారులు ఇక్కడ జరిగిన భారత్-అమెరికా వాణిజ్య సదస్సులో ఈ మేరకు ‘రెట్రో ట్యాక్స్’పై తమ ఆందోళనలను వెలిబుచ్చారు. దేశంలో పెట్టుబడుల వృద్ధికి ‘రెట్రో’ తరహా అనిశ్చిత పన్ను వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ టెండరింగ్, బిడ్డింగ్ ప్రక్రియలో సామర్థ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని జీఈ, లాక్‌హీడ్ మార్టిన్ అధికారులు స్పష్టం చేశారు. డేటా సెక్యూరిటీ అంశాల్లో విశ్వాస రాహిత్య పరిస్థితి తొలగాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ మాట్లాడుతూ, ‘‘నీవు నా దగ్గరకు వచ్చి పన్నును 35 శాతం మేర పెంచుతున్నానంటే నాకేమీ ఇబ్బంది ఉండదు. అందుకు అనుగుణంగా నా వ్యాపార సరళిని మార్చుకుంటాను. గడచిన 10 సంవత్సరాల వ్యాపార కార్యకలాపాలపై ఇప్పుడు 35 శాతం పన్ను విధిస్తున్నాను అని అంటేనే సమస్య’’ అని అన్నారు. జీఈ దక్షిణాసియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ బన్మాలీ అగర్వాలా, లాక్‌హీడ్ మార్టిన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షాలు కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. -
భారత్‌లో అపార అవకాశాలు
- సంస్కరణల జోరు పెంచండి - జీఈ చైర్మన్ జెఫ్ ఇమెల్ట్ ముంబై: భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశంలో అవకాశాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయని అమెరికాకు చెందిన డైవర్సిఫైడ్ దిగ్గజ కంపెనీ జీఈ పేర్కొంది. భారత్‌లో వ్యాపారం మరింత సులభంగా చేయాలంటే మరిన్ని సంస్కరణలను వేగంగా అమలు చేయాలని జీఈ చైర్మన్, సీఈఓ జెఫ్ ఇమెల్ట్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణల వల్ల భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ సంస్కరణలను త్వరగా అమలు చేయాల్సి ఉందని చెప్పారు. సోమవారం ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. భారత్‌లో వాస్తవ మార్పుల ముద్రలను విదేశీ ఇన్వెస్టర్లు గమనిస్తున్నారని చెప్పారు. జీఈతో తనకు 33 ఏళ్ల అనుబంధమని, ఎన్నోసార్లు భారత్‌కు వచ్చానని, కానీ, ఇప్పుడు క్షేత్ర స్థాయిలో నిజంగా మార్పులు వస్తున్న విషయం ఇప్పుడు అవగతమవుతోందని వివరించారు. భారత రైల్వేల ఆధునికీకరణ వాస్తవ రూపం దాలుస్తోందని అనిపిస్తోందన్నారు. విద్యుత్తు రంగంలో మరిన్ని సంస్కరణలు... విద్యుత్తు రంగంలో మరిన్ని సంస్కరణలు రావాలని ఇమ్మెల్ట్ చెప్పా రు. విద్యుత్తు ధరలకు సంబంధించి సబ్సిడీలను తగ్గించాలని, ఈ ధరలను మార్కెట్ వర్గాలే నిర్ణయించే పరిస్థితులు ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.