విదేశీ సంస్థలపై ‘రెట్రో పన్ను’ కత్తి! | Retrospective tax hangs like 'Sword of Damocles' in India: Microsoft | Sakshi
Sakshi News home page

విదేశీ సంస్థలపై ‘రెట్రో పన్ను’ కత్తి!

Published Thu, May 19 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

విదేశీ సంస్థలపై ‘రెట్రో పన్ను’ కత్తి!

విదేశీ సంస్థలపై ‘రెట్రో పన్ను’ కత్తి!

అమెరికా దిగ్గజ కంపెనీల అభిప్రాయం
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారాలకు సంబంధించి రెట్రాస్పెక్టివ్ పన్ను (గత కాలం వ్యాపార లావాదేవీలపై వర్తించే విధంగా విధించే పన్ను) విదేశీ సంస్థలపై ‘వేలాడే కత్తి’ లాంటిదని  అమెరికా ప్రముఖ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.  గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్,  ప్రముఖ యంత్ర పరికరాల సంస్థ జీఈ, అలాగే ఎయిరోస్పేస్, డిఫెన్స్ దిగ్గజ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ ఉన్నతాధికారులు ఇక్కడ జరిగిన భారత్-అమెరికా వాణిజ్య సదస్సులో ఈ మేరకు ‘రెట్రో ట్యాక్స్’పై తమ ఆందోళనలను వెలిబుచ్చారు.

దేశంలో పెట్టుబడుల వృద్ధికి ‘రెట్రో’ తరహా అనిశ్చిత పన్ను వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ టెండరింగ్, బిడ్డింగ్ ప్రక్రియలో సామర్థ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని జీఈ, లాక్‌హీడ్ మార్టిన్ అధికారులు స్పష్టం చేశారు. డేటా సెక్యూరిటీ అంశాల్లో విశ్వాస రాహిత్య పరిస్థితి తొలగాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ మాట్లాడుతూ, ‘‘నీవు నా దగ్గరకు వచ్చి పన్నును 35 శాతం మేర పెంచుతున్నానంటే నాకేమీ ఇబ్బంది ఉండదు.

అందుకు అనుగుణంగా నా వ్యాపార సరళిని మార్చుకుంటాను. గడచిన 10 సంవత్సరాల వ్యాపార కార్యకలాపాలపై ఇప్పుడు 35 శాతం పన్ను విధిస్తున్నాను అని అంటేనే సమస్య’’ అని అన్నారు. జీఈ దక్షిణాసియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ బన్‌మాలీ అగర్‌వాలా, లాక్‌హీడ్ మార్టిన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షాలు కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement