జనరల్ ఎలక్ట్రిటీ (జీఈ) కంపెనీ భారీగా ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా జీఈ పవర్ విభాగంలో వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు పథకాలు రచించింది. అమెరికా బయట సుమారు 12వేలమంది ఉద్వాసన పలకనుంది. గ్యాస్, పవర్ , కోల్ మార్కెట్ నష్టాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలోని అతి పెద్ద గ్యాస్ టర్బైన్లు ఉత్పత్తిదారుగా ఉన్న జీఈ పవర్ గ్యాస్-టర్బైన్ తయారీదారు పునరుత్పాదక లాభాల క్షీణత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. పవర్‌బిజినెస్‌లో 12వేల ఉద్యోగాలను కట్ చేయాలని ప్రణాళిక వేసింది. ఈ క్రమంలో జీఈ పవర్ కార్పోరేషనులో 18 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించనున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ అండ్ ప్రొడక్ట్ రెండింటిలోనూ ఈ కోత ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కంపెనీ కొత్త సీఈవోగా ఎన్నికైన జాన్ ఫ్లాన్నెరీ సంస్థ ఖర్చులను తగ్గించడంతోపాటు, కష్టాల్లో ఉన్నసంస్థను గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం బాధాకరమైనది. కానీ అవసరమైనదని డివిజన్ చీఫ్ రస్సెల్ స్టోక్స్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో సవాళ్లు కొనసాగినప్పటికీ 2018 లో జీఈ పవర్ పురోగతిని సాధిస్తుందని తాము భావిస్తున్నామన్నారు.
మరోవైపు ఇప్పటికే కార్పొరేట్ జెట్లను ఉపయోగించడాన్ని కంపెనీ సీఈవో వదులుకున్నారు. అలాగే త్రైమాసిక డివిడెండ్ చెల్లింపును ఆలస్యం చేయడంతోపాటు కొన్ని వ్యాపారాలను విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. తద్వారా వచ్చే ఏడాది పవర్ డివిజన్‌లో నిర్మాణాత్మక ఖర్చులు 1 బిలియన్ డాలర్లు తగ్గుతుందని ఆశిస్తోంది. మొత్తంగా 2018 నాటికి సంస్థ అంతటా 3.5 బిలియన్ల డాలర్ల ఖర్చులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వార్తలతో న్యూయార్క్ రెగ్యులర్ ట్రేడింగ్లో బుధవారం దాదాపు ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment