సాక్షి, ముంబై: మార్కెట్ క్యాప్‌పరంగా ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మళ్లీ టాప్‌కు దూసుకువచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మరో మైల్‌స్టోన్‌నుకు చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవలికాలంలో ఈ టాప్ ర్యాంక్‌కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మధ్య తీవ్రమైనపోటీ నెలకొంది. తాజాగా మార్కెట్ క్యాప్ పరంగా భారత్‌లో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని వెనక్కి నెట్టి ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.8 లక్షల కోట్లను అధిగమించింది.
రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీ షేర్లల కొనుగోళ్ల హవా నెలకొంది. ఈ ఏడాది ఇప్పటివరకు టిసిఎస్ స షేరు 54.6 శాతం పెరిగింది. ముఖ‍్యంగా సెప్టెంబరు 6 వ తేదీన జరగనున బై బ్యాక్ ఆఫర్ కారణంగా రోజువారీ లాభాలనే నమోదు చేస్తోంది. టీసీఎస్ షేరు మంగళవారం 2 శాతానికిపైగా లాభపడి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దీంతో సంస్థ రూ.8 లక్షల కోట్ల (రూ.8,00,478 కోట్లు) కంపెనీగా అవతరించింది. కాగా ఈ మార్క్‌ను తొలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిగమించింది. అయితే రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన రెండో కంపెనీగా టీసీఎస్ నిలిచింది. అలాగే ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ 3.05 శాతం, మైండ్‌ట్రీ 2.45 శాతం, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో లాంటి కంపెనీలు 1.85 శాతం లాభపడ్డాయి.
ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆగస్ట్ 23న రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను సాధించి భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డ్ సృష్టించింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన తొలి భారత కంపెనీగా కూడా రికార్డ్ సాధించింది. అయితే ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.7,86,943 కోట్లుగా ఉంది. ఇటీవలే 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,329ని తాకిన షేరు ప్రస్తుతం రూ.1,242 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.1,263 వద్ద ట్రేడవుతున్నప్పుడు కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment