ప్రముఖ మ్యూజిక్ యాప్ సావన్ మీడియా ఇపుడిక రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతమైంది. దక్షిణ ఆసియాలో అతిపెద్ద ప్రసార, వినోద, కళాకారుల వేదిక అయిన సావన్ మీడియా ఇకపై జియోసావన్‌గా అవతరించింది. ఈ మేరకు కంపెనీ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం జియో సావన్ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లపై లభిస్తుందనీ, జియో యాప్‌స్టోర్, జియోఫోన్, జియో, జియో సావన్ సహా ఇతర యాప్‌స్టోర్లలో అందుబాటులోకి వచ్చిందని తెలిపింది.
కొత్తగా అవతరించిన రిలయన్స్ జియో మ్యూజిక్ యాప్ జియో సావన్‌లో డార్క్ మోడ్, జియో ట్యూన్స్ సెటింగ్ లాంటి మరిన్ని హంగులను చేర్చింది. అంతేకాదు ఈ యాప్‌లో జియో కస్టమర్లకు ప్రస్తుతం 45 మిలియన్లకు పైగా పాటలు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు సావన్ ఒరిజినల్ ఆడియో షోలు, పర్సనలైజ్డ్ మ్యూజిక్ రికమెండేషన్స్ వంటి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను జియో సావన్ యాప్‌లో అందిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో ఎక్స్‌క్లూజివ్ వీడియో కంటెంట్‌ను కూడా అందించేందుకు సిద్ధమవుతోంది.
90రోజుల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితం
జియో యూజర్లు జియో సావన్ యాప్‌లో 90 రోజుల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చని జియో తెలిపింది. అందులో యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. అలాగే 320 కేబీపీఎస్ బిట్‌రేట్‌తో హై క్వాలిటీ ఆడియో లభిస్తుంది. 3 నెలల తరువాత సాధారణ సబ్‌స్క్రిప్షన్‌కు యూజర్లు మారుతారు. అయితే జియో సావన్ ప్రొ సబ్‌స్క్రిప్షన్‌లో కొనసాగాలంటే పీరియడ్ ముగిశాక నెలకు రూ.99 చెల్లించాలి. 3 నెలలకైతే రూ.285, 6 నెలలకు రూ.550 చెల్లించాలి. పేటీఎం వాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ మొత్తాన్ని గూగుల్ ప్లే ద్వారా చెల్లించాలి. దీంతో జియో సావన్ ప్రొ సేవలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు.
2018లో మార్చిలో సావన్ మ్యూజిక్‌ను రిలయన్స్ సొంతం చేసుకుంది. భారతదేశంలో మ్యూజిక్ స్ట్రీమింగ్ పరిశ్రమలో ఇదొక టర్నింగ్ పాయింట్ అని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ వ్యాఖ్యానించారు. సావన్ సహ వ్యవస్థాపకులు రిషి మల్హోత్ర, పరమదీప్ సింగ్, వినోద్ భట్ విలీన సంస్థలో కొనసాగుతారు. అలాగే అమెరికాలోని మౌంటెన్ వ్యూ , న్యూయార్క్, బెంగళూరు, గురుగ్రాం, ముంబైల ఐదు కార్యాలయాల్లోని 200 మంది ఉద్యోగుల బృందం కూడా యథావిధిగా కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment