న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో 2 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 16,400 కోట్లు) సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాయి. విదేశీ కరెన్సీలో తక్కువ వడ్డీ రేట్లకు ఈ నిధులను సమీకరించే యోచనలో కంపెనీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
(ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..)
ఈ రెండు సంస్థలు ఇటీవలే 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 24,600 కోట్లు) మొత్తాన్ని సిండికేట్ లోన్ ద్వారా సమీకరించాయి. రెండు డజన్ల తైవాన్ బ్యాంకులతో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ తదితర 55 దిగ్గజ సంస్థలు ఈ నిధులను అందించాయి. ఆ ఒప్పందాల ప్రాతిపదికనే కొత్తగా 2 బిలియన్ డాలర్లను రిలయన్స్, జియో సమీకరించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment