రిలయన్స్కు కేంద్రం షాక్!
• ఓఎన్‌జీసీ గ్యాస్‌ను లాక్కున్న కేసులో
• 1.55 బిలియన్ డాలర్ల జరిమానా...
• రిలయన్స్, బీపీ, నికో రిసోర్సెస్‌కు నోటీసులు...
• ఆర్బిట్రేషన్‌కు దారితీసే అవకాశం...
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్‌స ఇండస్ట్రీస్‌కు (ఆర్‌ఐఎల్) కేంద్రం షాకిచ్చింది. కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ గ్యాస్ బ్లాక్ నుంచి అక్రమంగా సహజవాయువును లాగేసుకున్నట్టు రేగిన వివాదంలో 1.55 బిలియన్ డాలర్ల (ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు రూ.10,380 కోట్లు) భారీ జరిమానాను విధించింది. ఈ మేరకు రిలయన్‌సతో పాటు దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌కు కేంద్ర పెట్రోలియం శాఖ శుక్రవారం డిమాండ్ నోటీసులను జారీ చేసింది. అరుుతే, దీనిపై రిలయన్‌స న్యాయపోరాటం (ఆర్బిట్రేషన్) చేసే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నారుు.
ఏపీ షా కమిటీ నివేదిక మేరకే...
ఓఎన్‌జీసీకి కేజీ బేసిన్లో కేజీ-డీడబ్ల్యూఎన్-98/2(కేజీ-డీ5), గోదావరి పీఎంఎల్ పేరుతో చమురు-గ్యాస్ బ్లాక్‌లున్నారుు. ఇవి రిలయన్‌సకు చెందిన కేజీ-డీ6 బ్లాక్ పక్కనే ఉన్నారుు. తమ బ్లాక్‌ల నుంచి గ్యాస్‌ను రిలయన్‌స లాగేసుకుంటోందని ఓఎన్‌జీసీ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు కేంద్రం జస్టిస్ ఏపీ షా నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆగస్టు 29న ఇచ్చిన నివేదికలో రిలయన్‌స ఓఎన్‌జీసీ గ్యాస్‌ను అక్రమంగా తోడేసుకున్నది వాస్తవమేనని తేల్చిచెప్పింది.
ఓఎన్‌జీసీ బ్లాక్‌ల నుంచి గడిచిన ఏడేళ్లుగా (ఈ ఏడాది మార్చి వరకూ) రిలయన్‌స సుమారు 338.33 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల(ఎంబీటీయూ) గ్యాస్‌ను తన బావుల ద్వారా తోడేసుకుందని కేంద్రం లెక్కతేల్చింది. దీనికిగాను 1.47 బిలియన్ డాలర్లను రిలయన్‌స, బీపీ, నికోలు జరిమానాగా చెల్లించాలని ఈ నెల 3న పెట్రోలియం మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. సంబంధిత కాలానికి వడ్డీ కింద మరో 149.86 మిలియన్ డాలర్లను కూడా జత చేసింది. అరుుతే, ఈ గ్యాస్‌పై రిలయన్‌స చెల్లించిన 71.71 మిలియన్ డాలర్ల రాయల్టీని తీసేస్తే మొత్తం జరిమానా 1.55 బిలియన్ డాలర్లుగా నిర్ధారించింది.
ఓఎన్‌జీసీకి కాదు కేంద్రానికి...
రిలయన్‌స నుంచి రాబాట్టాల్సిన నష్టపరిహారం ఓఎన్‌జీసీకి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుందని షా కమిటీ సూచించడంతో దీనిపై ఓఎన్‌జీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. షా కమిటీ సూచనల నేపథ్యంలోనే నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్‌స(డీజీహెచ్) లెక్కమేరకు పెట్రోలియం శాఖ నోటీసులు పంపింది. ‘షా కమిటీ సిఫార్సులను ఆమోదించాం. కేజీ-డీ6 బ్లాక్ కాంట్రాక్టర్ (రిలయన్‌స) ఓఎన్‌జీసీ గ్యాస్ బ్లాక్‌ల నుంచి గ్యాస్‌ను తోడుకోవడం, అక్రమంగా దాన్ని అమ్ముకోవడం ద్వారా ప్రయోజనం పొందింది. దీన్ని రాబట్టుకోవడం కోసమే నోటీసులు జారీ చేశాం’ అని పెట్రోలియం శాఖ పేర్కొంది.
మరో 177 మిలియన్ డాలర్లు కూడా...
కాగా, కేజీ-డీ6లో ముందుగా పేర్కొన్న లక్ష్యాల మేరకు గ్యాస్‌ను ఉత్పత్తి చేయనందుకుగాను తాజాగా రిలయన్‌స, దాని భాగస్వామ్య పక్షాలకు 177 మిలియన్ డాలర్ల జరిమానాను విధిస్తూ (ఈ మొత్తాన్ని రిలయన్‌స కేజీ-డీ6 గ్యాస్ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి వ్యయాల రూపంలో మినహారుుంచుకోకూడదు) కూడా పెట్రోలియం శాఖ మరో డిమాండ్ నోటీసు పంపింది. గతంలో కూడా వ్యయాలను వెనక్కి తీసుకోకుండా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే రిలయన్‌స ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది కూడా.
మరోసారి ఆర్బిట్రేషన్...
షా కమిటీ సిఫార్సులు, రిలయన్‌స నుంచి రాబట్టే పరిహారం ఓఎన్‌జీసీకి కాకుండా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుందన్న వాదనల నేపథ్యంలో దీనిపై ఆర్బిట్రేషన్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారుు. మరోపక్క, తాము ఉద్దేశపూర్వకంగా పక్కనున్న ఓఎన్‌జీసీ బ్లాక్ నుంచి గ్యాస్‌ను తోడుకోలేదని.. తమ కేజీ-డీ6 బ్లాక్ పరిధిలోనే ప్రభుత్వంతో ఒప్పందం, అనుమతుల మేరకే బావులను తవ్వి గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నామని ఆర్‌ఐఎల్ వాదిస్తోంది.
పీఎస్‌సీ ప్రకారం ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య ఎవైనా వివాదాలు తలెత్తితే ఆర్బిట్రేషన్ ద్వారానే పరిష్కరించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్, భాగస్వామ్య సంస్థలు ఓఎన్‌జీసీ గ్యాస్ వివాదంలో కూడా ఆర్బిట్రేషన్‌ను మొదలుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ప్రభుత్వం జరిమానాపై ఆర్‌ఐఎల్ నుంచి తక్షణం ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. బీపీ అధికార ప్రతినిధి మాత్రం.. తమకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయని.. అరుుతే, ఇలాంటి భౌగోళికపరమైన సరిహద్దు వివాదాలను అంతర్జాతీయ పెట్రోలియం పరిశ్రమ విధానాలు, పీఎస్‌సీ నిబంధనల మేరకే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.