ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉత్సాహంతో మొదలైనా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 26,717 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 8,240 వద్ద మొదలైనా మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 17 పాయింట్లు,నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఒక్క ఆటో మినహా మిగిలిన అన్ని రంగాలు పాజిటివ్ గా ఉన్నా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫార్మా , అయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్‌ఐఐలు అమ్మకాలు రూ. 434 కోట్లుగా నమోదయ్యాయి ఓఎన్‌జీసీ, గెయిల్ ఆర్‌ఐఎల్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టాటా పవర్, గ్రాసిమ్, ఐషర్, ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, బీవోబీ లాభాల్లో టాటా మోటార్స్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ డీవీఆర్, పవర్‌గ్రిడ్, భారతీ, మారుత, ఐడియా నష్టాల్లోనూకొనసాగుతున్నాయి.
అటు డాలర్ మారకపు విలువలో దేశీయ కరెన్సీ 22 పైసలు బలపడి రూ.68,43 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం రూ.347 నష్టంతో రూ.28,415 వద్ద ఉంది.