న్యూఢ్లిల్లీ: ఇటీవల సంచలనం రేపిన సెబీ వర్సస్ రిలయ్స్ ఇండస్ట్రీస్ కేసును శాట్ విచారణకు అంగీకరించింది. ఏడాదిపాటు ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ నుంచి సెబీ నిషేధించడాన్ని సవాల్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) దాఖలు చేసిన పిటిషన్‌ను సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్ విచారణకు) స్వీకరించింది. ఈమేరకు ఆర్‌ఐఎల్ శాట్ ముందు హాజరైంది. ఆర్‌ఐఎల్ అప్పీలుపై శాట్ తదుపరి విచారణను జూన్‌నెల చివరికి వాయిదా వేసింది.
దీనికి సంబంధించిన మ్యూచుఫల్ ఫండ్స్ ట్రేడ్ వివరాలను సెబీకి అందించాల్సింది శాట్ ఆర్‌ఐఎల్‌ను ఆదేశించింది. అలాగే తమ అభ‍్యంతరాలపై పూర్తి విరాలను సమర్పించాల్సింది సెబీని కోరింది. అనంతరం విచారణను ఎనిమిదివారాల పాటు వాయిదా వేసింది. దీంతో మార్కెట్లో రిలయన్స్ షేర్ 2 శాతం నష్టపోయింది.
పదేళ్ల క్రితం నాటి ఈ కేసుకు సంబంధించి.. రిలయన్స్ పెట్రోలియం ఎఫ్‌అండ్‌వో విభాగంలో(డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్) మోసపూరిత ట్రేడింగ్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్రమంగా లాభాలు ఆర్జించిందన్న ఆరోపణలతో సెబీ భారీ జరిమానా విధించింది. 2007 నవంబర్ 29 నుంచి 12 శాతం వడ్డీతో రూ. 447 కోట్లు కట్టాలని ఆర్‌ఐఎల్‌ను ఆదేశించింది. చట్టవిరుద్ధంగా లాభాల ఆర్జన ఆరోపణలపై రిలయన్స్‌తో పాటు 12 సంస్థలను ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా ఏడాది పాటు నిషేధం విధిస్తూ సెబీ మార్చి 24న ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.