
ముంబై: మహారాష్ట్రలో భారీ పెట్టుబడుల ప్రణాళికను ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. మ్యాగ్నటిక్ మహారాష్ట్ర సదస్సు మొదటి రోజు ఇందుకు వేదికగా నిలిచింది. ‘‘ఆర్‌ఐఎల్ దాని అంతర్జాతీయ భాగస్వామ్య కంపెనీలు కలసి రానున్న పదేళ్లలో మహారాష్ట్రలో రూ.60,000 కోట్లను ఇన్వెస్ట్ చేస్తాయి. దేశంలో ఇదే తొలి సమగ్ర డిజిటల్ పారిశ్రామిక ప్రాంతం అవుతుంది’’ అని అంబానీ తెలిపారు. అయితే ఏర్పాటు చేసే స్థలం గురించి వెల్లడించలేదు.
ముంబైలో ఆదివారం ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించగా, ముకేశ్ అంబానీ, రతన్‌టాటా సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ‘‘ఆర్‌ఐఎల్‌తో కలసి పెట్టుబడులు పెట్టేందుకు 20కు పైగా అంతర్జాతీయ కంపెనీలు సంసిద్ధతను తెలియజేశాయి. వీటిలో సిస్కో, సీమెన్స్, హెచ్‌పీ, డెల్, నోకియా, ఎన్‌విడియా తదితర కంపెనీలు ఉన్నాయి’’ అని అంబానీ వెల్లడించారు. సేవల ఆధారిత ఈ నాలుగో పారిశ్రామిక విప్లవంతో చైనా తన తయారీ రంగంతో సాధించిన దాని కంటే భారత్ మరింత వేగంగా ప్రగతి సాధిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment