అమెరికాలోని షేల్‌ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్ జాయింట్ వెంచర్లో దేశీయ పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)కు వున్న
డీల్ విలువ రూ. 6,400 కోట్లు
న్యూఢిల్లీ : అమెరికాలోని షేల్‌ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్ జాయింట్ వెంచర్లో దేశీయ పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)కు వున్న మొత్తం 49.9 శాతం వాటాను విక్రయించింది. న్యూయార్క్‌లో లిస్టయిన కంపెనీ ఎంటర్‌ప్రైజ్ ప్రాడక్ట్స్ పార్టనర్స్ కు 1.07 బిలియన్ డాలర్లకు (సుమారు 6,400 కోట్లు) విక్రయించినట్లు ఆర్‌ఐఎల్ అమెరికా సబ్సిడరీ రిలయన్స్ హోల్డింగ్ యూఎస్‌ఏ ప్రకటించింది. రిలయన్స్‌తో కలిపి ఈ వెంచర్లో 50.1 శాతం వాటా కలిగిన నేచురల్ రిసోర్సెస్ కంపెనీ కూడా తన వాటాను అదే సంస్థకు విక్రయించడానికి గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది.