gas pipeline
-
చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పైప్‌లైన్!
చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్ ప్రోగ్రాంపై ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది కూడా. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపోస్తోంది. దీన్ని ల్యూనార్ సౌత్‌పోల్ ఆక్సిజన్ పైప్‌లైన్ (ఎల్–ఎస్పీఓపీ)గా పిలుస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్కులను, ఖర్చులను భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఎందుకంటే చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్‌ను వెలికితీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నీటి అవసరాలను చంద్రునిపై అపారంగా పరుచుకున్న మంచుతో తీర్చుకోవాలని యోచిస్తోంది.ఎలా చేస్తారు?చంద్రునిపై ఆక్సిజన్‌ను కంప్రెస్డ్ గ్యాస్, లేదా ద్రవ రూపంలో ట్యాంకుల్లో బాట్లింగ్ చేయా లన్నది నాసా ప్రణాళిక. కాకపోతే వాటి రవాణా పెను సవాలుగా మారనుంది. ఆక్సిజన్‌ను దాని వెలికితీత ప్రాంతం నుంచి సుదూరంలో ఉండే మానవ ఆవాసాలకు తరలించేందుకు అత్యంత వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం తొలి దశలో కనీసం 5 కి.మీ. పొడవైన పైప్‌లైన్ నిర్మించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. దీన్ని చంద్రునిపై అందుబాటులో ఉండే అల్యుమి నియం తది తరాల సాయంతోనే పూర్తి చేయాలని నాసా భావిస్తోంది.→ ఈ పనుల్లో పూర్తిగా రోబోలనే వాడనున్నారు.→ మరమ్మతుల వంటివాటిని కూడా రోబోలే చూసుకుంటాయి→ పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ గంటకు రెండు కి.మీ. వేగంతో ప్రవహిస్తుంది→ ప్రాజెక్టు జీవితకాలం పదేళ్లని అంచనా – సాక్షి, నేషనల్ డెస్క్ -
మసీదు కిందుగా పైప్‌లైన్, భారీ పేలుడు
ఢాకా: మసీదు కిందుగా వెళ్తున్న గ్యాస్ పైప్‌లైన్ పేలిపోవడంతో బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్నవారిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బైటుస్ సలాట్ జేమ్ మసీదులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రార్థనలు ముగించుకుని ఇంటికి బయల్దేరుతున్న క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మసీదులోని 6 ఏసీలు కూడా మంటల తీవ్రతకు పేలిపోయాయి. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ ఉన్నతాధికారి జయేదుల్ ఆలాం చెప్పారు. ప్రమాద తీవ్రతలో చాలా మందికి 90 శాతానికి పైగా గాయాలయ్యాయని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. (చదవండి: నువ్వు నిజంగా దేవుడివి సామి) -
‘పుతిన్‌కు అర్ధమయ్యే భాషలోనే బదులిద్దాం’
బెర్లిన్ : రష్యా నుంచి జర్మనీకి గ్యాస్‌ను తరలించే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ ప్రాజెక్టును నిలిపివేయాలని జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నవాల్నీపై సోవియట్ స్టైల్లో విషపూరిత రసాయనాలు ఎక్కించి హత్యాయత్నం చేశారని ఆమె పేర్కొన్న అనంతరం పైప్‌లైన్ ప్రాజెక్టు రద్దుపై ఒత్తిళ్లు తీవ్రతరమయ్యాయి. బెర్లిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవాల్నీపై నోవిచోక్ రసాయనాన్ని ప్రయోగించి హత్యాయత్నం చేశారని, దీనిపై రష్యా వివరణ ఇవ్వాలని మెర్కెల్ బుధవారం డిమాండ్ చేశారు. అయితే జర్మనీ వాదనను మాస్కో తోసిపుచ్చుతూ ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని, ఆధారాలు లేకుండా జర్మనీ ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. నవాల్నీపై దాడిని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. జర్మన్ రాజకీయ నేతలు పలువురు ఈ ఘటనపై ప్రభుత్వం కఠినంగా స్పందించాలని కోరుతున్నారు. ‘మనం రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి..రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు తెలిసిన భాషలోనే మనం బదులివ్వాలి..ఆయనకు తెలిసింది గ్యాస్ విక్రయాలే’నని జర్మనీ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్ నాబర్ట్ రాట్‌జెన్ అన్నారు. నార్డ్‌స్ర్టీమ్ 2 పైప్‌లైన్ ఇప్పుడు పూర్తయితే పుతిన్ ఈ తరహా రాజకీయాలను కొనసాగించేందుకు ప్రోత్సహించినట్టేనని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి నేరుగా గ్యాస్‌ను తీసుకువచ్చే ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తవగా 2021 ఆరంభంలో ప్రారంభం కానుంది. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని జర్మనీపై ఒత్తిడి పెరుగుతోంది. చదవండి : ‘నమస్తే’తో మనసులు గెలుచుకున్న రాజ్‌నాథ్ -
పైప్ గ్యాస్ 400 జిల్లాల్లో
న్యూఢిల్లీ: రాబోయే 2–3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను 2020 నాటికి 10,000కు పెంచుతామన్నారు. పారిస్ వాతావరణ సదస్సు(కాప్ 21) సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కాలుష్య నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 129 జిల్లాల్లోని ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) నెట్వర్క్ పనులకు ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. 10వ రౌండ్ గ్యాస్ లైసెన్స్ బిడ్డింగ్‌ను ప్రారంభించారు. 90 % కుటుంబాలకు ఎల్పీజీ సౌకర్యం.. ‘కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో 12 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. వీటిలో దాదాపు 6 కోట్ల ఉజ్వల ఉచిత కనెక్షన్లు ఉన్నాయి. మా ప్రభుత్వం చొరవతో దేశంలో 90 శాతం కుటుంబాలకు గ్యాస్ సౌకర్యం లభించింది. కానీ నాలుగేళ్ల క్రితం దేశంలోని 55 శాతం మందికి మాత్రమే ఎల్పీజీ సౌకర్యం ఉండేది. అంటే గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేవలం 13 కోట్ల మందికి మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. యూపీఏ హయాంలో 24 లక్షలుగా ఉన్న పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్లు గత నాలుగేళ్లలో 2 కోట్లకు చేరుకున్నాయి. 2014లో దేశ ప్రజలు కేవలం ప్రభుత్వాన్నే కాదు.. పనిచేసే విధానం, సంస్కృతిని మార్చేశారు అంటే అతిశయోక్తేమీ లేదు’ అని ప్రధాని మోదీ తెలిపారు. కాలుష్యానికి అడ్డుకట్ట.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి దేశంలోని 66 జిల్లాల్లో మాత్రమే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండేదని ప్రధాని వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశంలోని సీజీడీల సంఖ్యను పెంచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. 18 రాష్ట్రాల్లోని 129 జిల్లాల్లో(50 జియోగ్రాఫికల్ ఏరియాలుగా విభజించారు) ఇళ్లకు వంటగ్యాస్ అందించే పనులకు శ్రీకారం చుట్టాం. 10వ రౌండ్ బిడ్డింగ్ పూర్తయితే దేశంలోని 70 శాతం జనాభాకు గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. స్వేచ్ఛాయుత గ్యాస్ మార్కెట్, ధరల నియంత్రణ కోసం ట్రేడింగ్ ఎక్ఛ్సేంజ్‌తో పాటు స్వతంత్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. దేశీయ గ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానిస్తాం. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి ఆసక్తులను పరిరక్షిస్తాం. పంట వ్యర్థాలను బయో–సీఎన్జీగా మార్చే 5వేల ప్లాంట్లను ఏర్పాటుచేస్తాం’ అని అన్నారు. బిడ్డింగ్‌లో నెల్లూరుకు చోటు సీఎన్జీ పర్యావరణ హితమైనదనీ, దీని ఖర్చు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీతో పోల్చుకుంటే తక్కువని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 10వ రౌండ్ బిడ్డింగ్ లో భాగంగా నెల్లూరు(ఏపీ), కొల్లామ్, అలప్పుజా(కేరళ), ఉజ్జయిని, గ్వాలియర్, మొరేనా(మధ్యప్రదేశ్), మైసూర్, గుల్బర్గా(కర్ణాటక), ముజఫర్‌పూర్(బిహార్) సహా 19 నగరాల్లో సీజీడీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో శంకుస్థాపనను నిలిపివేశామని స్పష్టం చేశారు. 2030 నాటికి దేశ విద్యుత్ అవసరాల్లో 40 శాతాన్ని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
ముకేశ్ అంబానీ పైప్‌లైన్ వ్యాపార విక్రయానికి ఓకే
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ వ్యాపార విక్రయానికి లైన్ క్లియర్ అయింది. నష్టాల్లో ఉన్న ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్ లిమిటెడ్(ఈడబ్ల్యూపీఎల్)ను కెనడాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు విక్రయించే ఒప్పందానికి చమురు–గ్యాస్ నియంత్రణ సంస్థ(పీఎన్జీఆర్బీ) కొద్ది వారాల క్రితం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని పీఎన్జీఆర్బీ చైర్మన్ దినేష్ కె షరాప్ వెల్లడించారు. గతంలో రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌గా ఉన్న ఈ సంస్థ పేరు తర్వాత ఈడబ్ల్యూపీఎల్‌గా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ బేసిన్లో వెలికి తీసే గ్యాస్‌ను తరలించేందుకుగాను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి గుజరాత్‌లోని బారుచ్ వరకూ 1,400 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను దశాబ్దం క్రితం నిర్మించారు. రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను రవాణా చేసే సామర్థ్యంతో ఈ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయగా... ఇప్పుడు ఇందులో 5 శాతం సామర్థ్యంతోనే ఇది నడుస్తోంది. రిలయన్స్ కేజీ–డీ6 క్షేత్రంలో అంచనాలతో పోలిస్తే భారీగా గ్యాస్ ఉత్పత్తి దిగజారడమే దీనికి కారణం. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఆమోదం తెలిపింది. ఒప్పందం విలువను ఇరు కంపెనీలు బయటికి వెల్లడించలేదు. కాగా, భారత్ ఇంధన రంగంలో బ్రూక్‌ఫీల్డ్‌కు ఇదే తొలి పెట్టుబడి కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ఈడబ్ల్యూపీఎల్ రూ.884 కోట్ల నిర్వహణ ఆదాయంపై రూ.715 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. -
సూర్యారావుపేటలో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ
కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సూర్యారావుపేట లైట్‌హౌస్ వద్ద గ్యాస్ లీకేజీ అయింది. రోడ్డు పక్కన చెట్లు కొడుతుండగా పొరపాటున గడ్డపార పైప్లైన్లోకి దిగబడినట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో భాగ్యనగర్ పైప్‌లైన్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని వెంటనే మరమ్మతులు చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. -
అమెరికా పైప్‌లైన్‌లో వాటా విక్రయించిన రిలయన్స్
డీల్ విలువ రూ. 6,400 కోట్లు న్యూఢిల్లీ : అమెరికాలోని షేల్ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్ జాయింట్ వెంచర్లో దేశీయ పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు వున్న మొత్తం 49.9 శాతం వాటాను విక్రయించింది. న్యూయార్క్‌లో లిస్టయిన కంపెనీ ఎంటర్ప్రైజ్ ప్రాడక్ట్స్ పార్టనర్స్ కు 1.07 బిలియన్ డాలర్లకు (సుమారు 6,400 కోట్లు) విక్రయించినట్లు ఆర్ఐఎల్ అమెరికా సబ్సిడరీ రిలయన్స్ హోల్డింగ్ యూఎస్ఏ ప్రకటించింది. రిలయన్స్‌తో కలిపి ఈ వెంచర్లో 50.1 శాతం వాటా కలిగిన నేచురల్ రిసోర్సెస్ కంపెనీ కూడా తన వాటాను అదే సంస్థకు విక్రయించడానికి గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. -
గ్యాస్ హబ్‌గా హైదరాబాద్
* తెలంగాణలో రూ.1,300 కోట్లతో పనులు: కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ * ఈశాన్యం నుంచి రాష్ట్రం మీదుగా గ్యాస్ పైప్‌లైన్ * ముంబై నుంచి హైదరాబాద్‌కు పైప్‌లైన్ ఏర్పాటుకు నిర్ణయం * రాష్ట్రంలో మరో రెండు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు! సాక్షి, హైదరాబాద్: రానున్న రోజుల్లో హైదరాబాద్ గ్యాస్ హబ్‌గా మారే అవకాశం ఉందని కేంద్రసహజ వాయువు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఈశాన్యం నుంచి దక్షిణానికి గ్యాస్ పైప్‌లైన్ వేయనున్నామని, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా వెళుతుందని చెప్పారు. ఒడిశాలోని పారదీప్ నుంచి హైదరాబాద్ వరకు కొత్తగా ఐఓసీ వేసే గ్యాస్ పైప్‌లైన్‌కు రూ.2,500 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇక హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని చెప్పారు. ఈ రెండు పైప్లైన్లు పూర్తయితే దేశ ఉత్తర, పశ్చిమ, తూర్పుల ప్రాంతాలను కలుపుతూ ఏర్పడే సరికొత్త గ్యాస్ పైప్‌లైన్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాల యంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రూ. 1,300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఐఓసీ టెర్మినల్, గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే దాదాపు రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. అందరికీ వంట గ్యాస్.. తెలంగాణలో 86 లక్షల వంట గ్యాస్ వినియోగదారులు ఉండగా.. అందులో 74 లక్షల కనెక్షన్లు మాత్రమే క్రియాశీలంగా ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రంలో వందశాతం కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చూస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సీఎన్జీతో 21వేల వాహనాలు, పీఎన్జీతో వెయ్యి వరకు వాహనాలు నడుస్తున్నాయని.. భవిష్యత్తులో ఇవి బాగా పెరగాల్సి ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో మోనోటెర్మినల్ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, అందుకు రూ.500 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణలో మరో రెండు గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో నాలుగు కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. కాగా శుక్రవారం ప్రధాన్ పుట్టినరోజు కావడంతో కిషన్‌రెడ్డి, డా.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
కోనసీమలో గ్యాస్ పైప్ లైన్ లీకేజ్
-
గ్యాస్ పైప్ లైన్ లీక్.. ఎగిసిన మంటలు
సదాశివపేట/ పటాన్చెరు: మద్దికుంట గ్రామానికి ఆనుకుని నిర్మించిన రిలయన్స్ గ్యాస్ మాన్యువల్‌లో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మాన్యువల్ నుంచి గ్యాస్ లీకై మంటలు ఎగిసి పడడంతో అధికారులు గ్రామ ప్రజలు భయందోళనకు గురయ్యారు. అధికారుల ద్వారా సమాచారం అందుకున్న డీఎస్పీ తిరుపతన్న తెల్లవారు జామున 3.30 గంటలకల్లా గ్రామానికి చేరుకుని ఉదయం 10 గంటలకు వరకు అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ సుమతి ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీకైన విషయం గురించి రిలయన్స్ గ్యాస్ ప్రతినిధులు, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాల్లోకి గ్యాస్ విడుదల.. సదాశివపేటలోని మద్దికుంట వద్ద జరిగిన రిలయన్స్ గ్యాస్ పైప్‌లైన్‌లో చెలరేగిన మంటలను నియంత్రించేందుకు పటాన్చెరు మండలం ఐనోల్ వద్ద ఉన్న ఆ పైప్‌లైన్ జంక్షన్ వద్ద గ్యాస్‌ను గాల్లోకి వదిలారు. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గ్యాస్‌ను గాలిలోకి వదిలారు. పటాన్చెరు నుంచి సదాశివపేట వద్ద గ్యాస్ విస్ఫోటన జరిగిన ప్రాంతానికి సరిగ్గా 37 కిలోమీటర్లు దూరం ఉందని రిలయన్స్ పైప్ లైన్ ఇంజినీర్ తెలిపారు. 48 ఇంచుల డయాతో ఉన్న పైప్‌లైన్ ఉన్న గ్యాస్ అంతా విడుదల చేశామన్నారు. ఆ సమయంలో దాదాపు ఓ బోర్వెల్ వేసేటప్పుడు వచ్చే శ బ్దంలా వినిపించింది. విడుదల చేసిన గ్యాస్ ఆకాశాన్ని తాకింది. దీంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు వణికిపోయారు. గ్యాస్ లీకైందనే పుకార్లు పుట్టాయి.. ఆ సూచనలతో ఆ ప్రాంతంలో చాలా మంది ఆందోళన చెందారు. ఉదయం పూట పిల్లలను స్కూల్‌కు పంపాలా వద్దా?, అని ఆలోచించాల్సి వచ్చిం ది. టిఫిన్లు, వంటలు చేసేందుకు కూడా భయపడ్డారు. ఆ ప్రాంతంలో దగ్గరే ఉన్న ఇటుకబట్టీల వారిని అగ్గిపుల్ల వెలగించరాదని రిలయన్స్ సెక్యూరిటీ సిబ్బంది సూచిం చారు. గ్యాస్ విడుదల ప్రక్రియ అయిదు గంటల పాటు సాగింది. ఐనోల్ వద్ద జంక్షన్లో ఉన్న వాల్వును తె రిచి గ్యాస్‌ను గాల్లోకి వదిలారు. మాన్యువల్‌ను తరలించాలి.. రిలయన్స్ గ్యాస్ మాన్యువల్‌ను తమ గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి తరలించాలని మద్దికుంట గ్రామస్తులు మాన్యువల్ వద్ద ధర్నా చేసి ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి తాము చాల భయాందోళనకు గురికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ తిరుపతన్న, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు అందోళకు దిగిన ప్రజలను సముదాయించి నచ్చజేప్పడంతో అందోళన విరమించారు. పరుగో పరుగు.... గ్యాస్ జంక్షన్‌కు సమీపంలో ఉన్న ఇటుకబట్టీల్లో వందలాది మంది కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు పెట్టారు. ఉదయం గ్యాస్ విడుదల సందర్భంగా వచ్చిన శబ్దం భారీగా ఉండటంతో వారు భీతిల్లిపోయారు. తొలుత వారు నిద్రలో ఉండగా రిలయన్స్ సెక్యూరిటీ వారు పెద్ద శబ్దంతో వారిని అప్రమత్తం చేశారు. ఆ తరువాత గ్యాస్ విడుదల కాగానే ఆ ప్రజలు తమ గుడిసెలు వదిలిపెట్టి పరుగు పెట్టారు. మండల పరిధిలోని ఐనోల్తో పాటు ఇంద్రేశం, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, జిన్నారం మండలం అండూర్ వరకు గ్యాస్ శబ్దం వినిపడింది. ప్రతి 33 కిలోమీటర్లకు ఒక మాన్యువల్.. కాకినాడ కేజీ బేసిన్ నుంచి గుజరాత్‌లోని భరిష్పూర్ వరకు గ్యాస్ పైప్‌లైన్ 1400 కిలోమీటర్ల వరకు ఉంది. ప్రమాదాలు చోటుచేసుకుంటే నివారించడానికే ప్రతి 33 కిలోమీటర్ల వద్ద గ్యాస్ మాన్యువల్ ఏర్పాటు చేశాం. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ పరిజ్ఞానంతో గ్యాస్ సరఫరా చేస్తున్నాం. గ్యాస్ లీకై మంటలు చెలరేగినందు వల్ల వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పటాన్చెరువు మండలం ఇంద్రేశం గ్రామం వద్ద ఉన్న గ్యాస్ సరఫరాను నిలిపివేశాం. అదే విధంగా కోహిర్ మండలం మదిర గ్రామం వద్ద ఉన్న మాన్యువల్ వద్ద కూడా గ్యాస్ నిలిపివేసి పైపుల్లో మిగిలిఉన్న గ్యాస్‌ను వెంటిలేషన్ ద్వారా గాలిలోకి వదిలివే శాం. దాంతో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. - ఏరియా మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డి చచ్చేంత భయమేసింది గ్యాస్‌లీకై మంటలు ఎగిసిపడ్డాయి. చచ్చేంత భయమేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు విడిచి ముందు ప్రాణాలు దక్కించుకుందామని ఊరి బయటకు వెళ్లిపోయి తెల్లవారే వరకు భయంతో గడిపాం. -భాగ్యమ్మ, మద్దికుంట బర్రెలు అరిచాయి జంక్షన్‌కు పక్కనే ఉన్న పొలం నాదే. పైప్‌లైన్ వేసేట ప్పుడే వద్దన్నాం. ఈయాల (సోమవారం) తెల్లారకముందే బర్రెలు లేచి అరుస్తున్నాయి. నాకు బర్రెలు ఉన్నాయి. రోజూ పాలు తీస్తాను. కాని అవి నాకంటే ముందే లేచి అరుస్తున్నాయి. గ్యాస్లీకైన సంగతి తెల్వలే. - బాల్‌రాజ్, ఐనోల్ వాసన కూడా వచ్చింది గ్యాస్ విడుదలైనప్పుడు చాలా శబ్దం వచ్చింది. వాసన కూడా ఉంది. మంటలు వస్తాయని భయ పడ్డాం. ఆకాశమంత ఎత్తున గ్యాస్ తెల ్లగా పోతూ కనిపించింది. పిల్లలను స్కూల్‌కు కూడా కొందరు పంపలేదు. - పురుషోత్తం, ఇంద్రేశం పరుగు పెట్టాం కూలీలంతా భ్యార్యా పిల్లలతో కలిసి భయపడి పరుగు పెట్టారు. అంతా కలిసి చేరో గ్రామానికి పోయాం. కొందరు చిన్న కంజర్లకు, మరి కొందరు కాలేజీవైపుకు, ఇంద్రేశంకు పారిపోయాం. - హరి, ఇటుక బట్టీ మున్షీ, ఐనోల్ -
గ్యాస్ పైపులైన్లో అగ్నిప్రమాదం
-
గ్యాస్ పైపులైన్లో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: నగరంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల సమీపంలోని ఎల్జీఎల్ గ్యాస్ పైపులైన్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో సత్యకేతన్ ప్రాంతంలో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు అర్పుతున్నారు. -
మహిళా వాణిజ్యవేత్తలకు ప్రత్యేక రాయితీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అభివృద్ధిపరంగా వచ్చే ఐదేళ్లలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చోటు సంపాదిస్తుందన్న నమ్మకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. 2018-19 నాటికి టాప్ 3లో చోటు సంపాదించడమే కాకుండా 2029 నాటికి మొదటి స్థానానికి చేరుకొనే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి మంగళవారానికి 100 రోజులు పూర్తవుతోందని, ఈ సమయంలో సమస్యల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నదానిపై ఒక విజన్‌ను సిద్ధం చేసుకున్నామని, దీన్ని రేపటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. సోమవారం ఫిక్కీ మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొత్త రాజధాని నిర్మాణంతో పాటు, మౌలిక వసతులు, మానవవనరులు, ఖనిజ నిక్షేపాల పరంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని వీటిని వినియోగించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే మహిళలకు ప్రత్యేక రాయితీలను ఇవ్వడంతోపాటు అవసరమైతే వారి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కన్సల్టెన్సీ సేవలను కూడా అందిస్తామన్నారు. సమస్యలున్న చోటే అవకాశాలు అనేకం ఉంటాయని, రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికీ సీఎన్జీ, పరిశ్రమలకు ఎల్‌ఎన్‌జీనీ పైప్‌లైన్ ద్వారా అందించడంతో పాటు, ప్రతి ఇంటికీ హై బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించేలా ముందుకుపోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ యంగ్ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ చైర్ పర్సన్ శంకుతల దేవితోపాటు పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
తూ.గో. జిల్లాలో గ్యాస్‌పైప్ లైన్ లీక్!
-
నగరం గ్రామంలో విషాదచాయలు
-
బాధితులకు అండగా ఉంటాం: వైఎస్ జగన్
నగరం: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్‌లో పేలిన ప్రదేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అధికారులు, నేతలు ఆయనకు వివరించారు. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌లో పేలుడు సంభవించి, 17 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా నిట్టనిలువునా తగలబడిపోయిన కొబ్బరి చెట్లను, ఇళ్లు కాలిపోయి శ్మశానవాటికను తలపిస్తున్న గ్రామాన్ని ఆయన పరిశీలించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన వెంట గ్రామానికి తరలి వచ్చారు. అంతకు ముందు ఆయన బాధితులను పరామర్శించారు. బాధితులను అందరిని కలుసుకొని పరామర్శించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ తెల్లవారుజామున జరిగిన సంఘటనను, వారుపడిన బాధలను వివరిస్తుంటే జగన్ చలించిపోయారు. ఒకే కుటుంబంలో ఆరుగురు, మరో కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఆ కుటుంబాలు అన్నిటిని ఆయన కలుసుకుంటున్నారు. బాధితులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ బాధలు చెప్పుకున్నారు. బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. -
నగరం చేరుకున్న వైఎస్ జగన్మోహన రెడ్డి
నగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామం చేరుకున్నారు. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్ గ్యాస్ స్టేషన్ సమీపంలో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌లో పేలుడు సంభవించి, 16 మంది సజీవ దహనమయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలను జగన్ పరామర్శిస్తున్నారు. బాధితులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అంతకు ముందు జిల్లా అధికారులతో జగన్ మాట్లాడారు. గ్రామంలోని పరిస్థితులను, తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి, వారికి అందించే సహాయక చర్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, బాధితులు ఓఎన్జిసి, గెయిల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. -
ఉలిక్కిపడిన పశ్చిమ
తూర్పుగోదావరిలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాదంతో జిల్లాలో భయాందోళనలు నరసాపురం(రాయపేట) : తూర్పుగోదావరి జిల్లా మామి డికుదురు మండలం నగరంలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాద ఘటనతో జిల్లాప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) పైప్లైన్లు నరసాపురం మండలం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు కావడం, తుప్పుపట్టి పోవడంతో ఏ క్షణమైనా ప్రమా దం చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 250 కిలోమీటర్ల మేర పైప్లైన్లు గ్యాస్ నిక్షేపాల తరలింపులో భాగంగా ఓఎన్జీసీ ఆధ్వర్యంలోని గెయిల్ తీర ప్రాంతం నుంచి 250 కిలోమీటర్ల పైప్లైన్లు వేసింది. నరసాపురం మండలం కొత్తనవరసపురం, పాతనవరసపురం, యలమంచిలి మండలం ఏనుగువానిలంక, బాడవ, చించినాడ గ్రామాలలోని పొలాలు మధ్యన, నివాస గృహాలకు సమీపం నుంచి గ్యాస్ పైప్‌లైన్ ఉంది. అనంతరం నరసాపురం మండలంలోని పలు గ్రామాల మధ్యగా పైప్‌లైన్‌ను విస్తరించారు. నరసాపురం, పెనుగొండ పరిసర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు విస్తారంగా లభించడంతో ఓఎన్జీసీతవ్వకాలను మరింత విస్తృతం చేసింది. దీనిలోభాగంగా నరసాపురం పట్టణంలో ఓఎన్జీసీ టెంపుల్లాండ్ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతంలో ఎన్నోసార్లు గ్యాస్ లీకేజీ ఘటనలు జిల్లాలోని గ్యాస్ పైప్లైన్లు కూడా తరచూ లీకేజీ అవుతున్నాయి. అనేకసార్లు గ్యాస్ లీక్ అయినట్లుగా రైతులు గుర్తించి సమీపంలోని ఓఎన్జీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే లీకేజీని అరికట్టేవారు. భూమిలో నుంచి గ్యాస్ ఎగదన్నడంతో ఆ ప్రాంతంలో శబ్దంతో కూడినబుడగలు వచ్చేవని, వాటిని చూసి ఓఎన్జీసీ అధికారులకు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయని కొత్తనవరసపురం మాజీ సర్పంచి ఈద ఇశ్రాయేలు తెలిపారు. తుప్పుపట్టిన పైప్లైన్లు 25 ఏళ్ల కిందట వేసిన పైప్లైన్లు కావడంతో తుప్పుపట్టాయని ఓఎన్జీసీ అధికారులే అనేక సందర్భాల్లో చెప్పారని స్థానికులు వివరించారు. పైప్‌లైన్ లీకేజీ అయినవెంటనే తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారని, శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని వాపోతున్నారు. లీకేజీలను అరికట్టడానికి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని, లేకపోతే నగరం లాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశముందని పలువ ఆందోళన వ్యక్తం చేశారు. 125 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ మారుస్తాం కేజీ బేసిన్‌కు సంబంధించి గ్యాస్ పైప్‌లైన్ మొత్తం 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, దానిలో 125 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను త్వరలో మారుస్తామని ఓఎన్జీసీ ఈడీ, అసిస్టెంట్ మేనేజర్(రాజమండ్రి) పి.కృష్ణారావు తెలిపారు. నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 12న ఓఎన్జీసీ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేజీ బేసిన్లో రోజుకు 800 టన్నుల ఆయిల్, 31 లక్షల క్యూబిక్ మీటర్లు గ్యాస్ ఉత్పత్తి అవుతోందని వివరించారు. -
ఇదో దురదృష్టకర ఘటన:చంద్రబాబు
-
గ్యాస్‌కు మార్కెట్ ధరే కరెక్ట్
న్యూఢిల్లీ: ఏడేళ్లలో ప్రపంచంలోనే మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా ఇండియా అవతరించనున్న నేపథ్యంలో గ్యాస్‌కు మార్కెట్ ఆధారిత ధరల విధానమే తగినదని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. భారీ స్థాయిలోని దేశ అవసరాలను తీర్చాలంటే తగిన సాంకేతికత కూడా అవసరమని చెప్పారు. ఇక్కడ ఫిక్కీ, గెయిల్ నిర్వహణలో ఏర్పాటైన 8వ ఆసియా గ్యాస్ సదస్సుకు హాజరైన ప్రధాని ప్రసంగిస్తూ ప్రస్తుతం ఇండియా అంతర్జాతీయ స్థాయిలో ఏడో పెద్ద ఇంధన ఉత్పత్తిదారుగా నిలుస్తున్నదని తెలి పారు. అయితే రానున్న రెండు దశాబ్దాలలో ఇంధన సరఫరాను మూడు నుంచి నాలుగు రెట్లు పెంచాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. దేశీయ ఇంధన అవసరాలలో చమురు, గ్యాస్‌లకు 41% వాటా ఉన్నదని చెప్పారు. 2,020కల్లా ఇండియా మూడో పెద్ద ఇంధన వినియోగదారుగా నిలవనున్నదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన దేశం అమెరికా, చైనా, జపాన్ల తరువాత ప్రపంచంలోనే నాలుగో పెద్ద ఇంధన వినియోగదారుగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. వెరసి గిరాకీ, సరఫరాల మధ్య సమతౌల్యాన్ని సాధించేందుకు వీలుగా ఇంధన వెలికితీతలో దేశ, విదేశీ కంపెనీలను ప్రోత్సహించాల్సి ఉన్నదని వివరించారు. యూఎస్ షేల్ గ్యాస్ ఆదర్శం ఇంధన ఉత్పత్తిని పెంచడంలో అమెరికా షేల్ గ్యాస్ విప్లవాన్ని ప్రధాని ఉదహరించారు. మార్కెట్ ఆధారిత విధానాలు, సాంకేతికతల ద్వారా సంప్రదాయేతర వనరులను వెలికితీయడంలో అమెరికా బాగా విజయవంతం అయిం దని చెప్పారు. దీంతో ఇంధన నిల్వలు(మిగులు) కలిగిన దేశంగా అవతరించిందని చెప్పారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఇండియావంటి దేశాల ఇంధన అవసరాలకు ఇలాంటి విధానాలు అవసరమని వ్యాఖ్యానించారు. ఇంధన భద్రతను సాధించే దిశలో ఇండియా కూడా పలు ఇతర అవకాశాలను పరిశీలిస్తున్నదని చెప్పారు. ఈ బాటలోనే ఇతర దేశాల్లోని ఇంధన ఆస్తులను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. 80% దిగుమతులే... దేశ చమురు అవసరాల్లో 80% దిగుమతుల ద్వారానే లభిస్తోంది. ఇదే విధంగా 50% గ్యాస్ సరఫరాను కూడా దిగుమతుల ద్వారానే అందుకుంటోంది. ముడిచమురు విషయంలో మార్కెట్ ధరను ఆధారం చేసుకుంటున్నప్పటికీ, గ్యాస్ విషయంలో ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. అయితే వచ్చే ఏడాది(2014) ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరను దాదాపు రెట్టింపునకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కున్న విషయం విదితమే. దీంతో గ్యాస్ ధర ఒక ఎంబీటీయూకి 8.4 డాలర్లవరకూ పెరగనుంది. కొత్త మార్గాల ద్వారా ఇంధనాన్ని వెలికితీసే కంపెనీలకు మద్దతిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని గ్యాస్ ధర పెంపు ద్వారా నమ్మకాన్ని కలిగించనున్నట్లు ప్రధాని చెప్పారు. కొనుగోలుదారులు, విక్రయదారుల మధ్య ధర విషయంలో భారీ అంతరాలుంటే తగిన స్థాయిలో ఇంధనం లభించదని, దేశీయంగా గ్యాస్‌కున్న భారీ గిరాకీ దృష్ట్యా ఇండియా వంటి దేశాలలో ఇది సమస్యలు సృష్టిస్తుందని విశ్లేషించారు. దభోల్-బెంగళూరు పైప్‌లైన్ ప్రాజెక్ట్ జాతికి అంకితం మహారాష్ర్టలోని దభోల్ , కర్ణాటకలోని బెంగళూరు మధ్య గెయిల్ ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం జాతికి అంకితం చేశారు. 1,000 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్‌లైన్‌ను రూ. 4,500 కోట్లతో గెయిల్ అభివృద్ధి చేసింది. 8వ ఆసియా గ్యాస్ సదస్సుకు మన్మోహన్తోపాటు, ఆయిల్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ కూడా హాజరయ్యారు. మహారత్న స్థాయిని అందుకున్న గ్యాస్ దిగ్గజం గెయిల్ మంచి పనితీరును చూపుతున్నదని ఈ సంద ర్భంగా ప్రధాని ప్రశంసించారు. ఈ పైప్‌లైన్ ద్వారా జాతీయ గ్రిడ్‌కు తొలిసారి దక్షిణాది అనుసంధానమైందని గెయిల్ చైర్మన్ బీసీ త్రిపాఠీ పేర్కొన్నారు. పైప్‌లైన్ ద్వారా రోజుకి 1.6 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎస్‌ఎండీ) గ్యాస్‌ను సరఫరా చేయవచ్చు.