న్యూఢిల్లీ: నగరంలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల సమీపంలోని ఎల్జీఎల్ గ్యాస్ పైపులైన్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో సత్యకేతన్ ప్రాంతంలో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు అర్పుతున్నారు.