
టీసీఎస్‌ను దాటిన ఆర్‌ఐఎల్
ముంబై: మార్కెట్ విలువలో ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)...ఐటీ దిగ్గజం టీసీఎస్‌ను మళ్లీ మించిపోయింది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,68,160 కోట్లుకాగా, టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 4,64,577 కోట్లు. ఆర్‌ఐఎల్ షేరు ధర 1.2 శాతం ఎగిసి రూ. 1,440 వద్ద ముగియగా, టీసీఎస్ షేరు 0.26 శాతం క్షీణించి రూ. 2,357 వద్ద క్లోజయ్యింది.
జూన్ 23న ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ టీసీఎస్‌ను మించగా, అదేనెల 28న టీసీఎస్ విలువ ఆర్‌ఐఎల్ విలువను దాటింది. తర్వాత తాజాగా మళ్లీ ఆర్‌ఐఎల్ విలువ టాప్‌లోకి చేరింది. నాలుగేళ్ల క్రితం ఆర్‌ఐఎల్ విలువను టీసీఎస్ అధిగమించి, అప్పట్నుంచి నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది ఆర్‌ఐఎల్ చకాచకా జరిపిన ర్యాలీతో టీసీఎస్‌ను ద్వితీయస్థానానికి దింపింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్‌ఐఎల్ షేరు 33 శాతం పెరగ్గా, టీసీఎస్ షేరు 0.17 శాతం క్షీణించింది.