సాక్షి, ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టీసీఎస్ మరోసారి షాక్ ఇచ్చింది. దేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించిన సంతోషాన్ని అంతలోనే ఆవిరైపోయింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఐటీ దిగ్గజం టీసీఎస్ తన అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఐదేళ్ల క్రితం రిలయన్స్‌ను వెనక్కినెట్టిన టీసీఎస్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.
దేశీయ అతిపెద్ద కంపెనీలు టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మధ్య పోటీ ఆకర్షణీంగా నిలిచింది. మార్కెట్ క్యాప్‌కు సంబంధించి ఇరు సంస్థలు నువ్వానేనా అన‍్నట్టుగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా క్యూ1 ఫలితాల జోష్ తో ఆర్‌ఐఎల్ షేరు మంగళవారం భారీగా లాభపడిది. దీంతో ఆర్‌ఐల్ నెంబర్ వన్ స్థానంలోకి దూసుకు వచ్చింది. అప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న టీసీఎస్‌ను వెనక్కి నెట్టేసింది. ఇది మంగళవారం చోటు చేసుకుంది. బుధవారం ఈ పరిస్థితి తారుమారైంది. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మళ్లీ ఆర్‌ఐల్‌ను తోసేసి రేసులో ముందుకు దూసుకువచ్చింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బుధవారం దేశంలో అత్యంత విలువైన సంస్థగా తన హోదాను తిరిగి దక్కించుకుంది. ప్రస్తుతం టీసీఎస్ ఎమ్. క్యాప్ 7.56 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రిలయన్స్ విలువ కంటే 14.08 బిలియన్ డాలర్లు ఎక్కువ. రూ .7.54 ట్రిలియన్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. మరో వైపు బిఎస్ఇలో టిసిఎస్ షేర్లు 1.74 శాతం పెరిగి 1,975.10 వద్ద స్థిరపడగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.45 శాతం పెరిగి రూ. 1,191.15 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment