రిలయన్స్ అధినేతకు భారీ షాక్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తన బావుల పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడివేయడంపై వివాదంలో ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి భారీ పరిహారాన్ని విధించింది. ఈ వివాదంలో 1.55 బిలియన్ డాలర్లు( సుమారు 10వేల312 కోట్లు) జరిమానా విధించింది. ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్-జీసీ -రిలయెన్స్ సంస్థకు చెందిన కేజీ- డీ 6 బ్లాక్ మధ్య నడుస్తున్న గ్యాస్ వివాదంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడు సంవత్సరాలుగా కేజీ బేసిన్లో సహజవాయువును తోడుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వాముల నుంచి ఈ పరిహారాన్ని కోరుతూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది
కాగా ఓఎన్‌జీసీ గ్యాస్‌ను ఆర్‌ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)1 బిలియన్ డార్లుగా ( సుమారు రూ. 6652.75 కోట్లుగా) లెక్క కట్టింది. ఈ అంచనాలను ఆయిల్ మంత్రిత్వ శాఖకు అందచేసిన సంగతి తెలిసిందే.