trillion-dollar club
-
కాబోయే తొలి టాప్10 ట్రిలియనీర్లు వీళ్లేనా?
ప్రపంచంలో కొందరి సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల కోట్లు దాటిపోయింది. ఇప్పటి వరకూ వారిని మల్టీ బిలియనీర్లు అనేవారు. ఇప్పుడు కొత్త టైటిల్ రాబోతోంది. అదే ట్రియనీర్. అంటే 1000 బిలియన్లు ఒక ట్రిలియన్కి సమానం. అయితే ఇప్పటి వరకూ ఎవరూ అధికారింగా ట్రిలియనీర్ టైటిల్ పొందలేదు. ఆ టైటిల్ సాధించే దిశగా టాప్ 10లో ఎవరెవరుంటారు అనే దానిపై ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ఓ జాబితాను తయారు చేసింది.ఎలాన్ మస్క్ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఎలాన్ మస్క్‌కు ఉంది. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ 195 బిలియన్ డాలర్లు. ఇది సగటున ఏడాదికి 109.88 శాతం చొప్పున పెరుగుతోంది. దీని ప్రకారం ఆయన 2027 కల్లా ట్రిలియన్ డాలర్ల సంపదను చేరుకుంటారు. ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరా లింక్ వంటి సంస్థలకు అధినేతగా ఉన్నారు.గౌతమ్ అదానీభారత్కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ట్రిలియనీర్ అయ్యేవారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 84 బిలియన్ డాలర్లున్న గౌతమ్ అదానీ నెట్‌వర్త్ ఏటా సగటున 122.86 శాతం వృద్ధి చెందుతోంది.జెన్సెన్ హువాంగ్చిప్ కంపెనీ ఎన్విడియా కోఫౌండర్, సీఈవో జెన్సెన్ హువాంగ్ నెట్‌వర్త్ 77 బిలియన్ డాలర్లు కాగా సంవత్సానికి 111.88 శాతం పెరుగుతోంది. దీని ప్రకారం 2028 కల్లా ట్రిలియనీర్ జాబితాలోకి చేరనున్నారు.ప్రజోగో పంగెస్టుబరిటో పసిఫిక్ వ్యాపార సమ్మేళం అధినేత ప్రజోగో పంగెస్టు కూడా ట్రిలియనీర్ కానున్నవారి జాబితాలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 43.4 బిలియన్ డాలర్లున్న పంగెస్టు నెట్‌వర్త్ ఏటా సగటున 135.95 శాతం పెరుగుతోంది.బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబంఎల్వీఎంహెచ్ ఫౌండర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం సంపద 223 బిలియన్ డాలర్లు. ఇది ఏటా 29.33 శాతం వృద్ధి చెందుతోంది. ఈ లెక్కన 2030 కల్లా ఆర్నాల్ట్ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలోకి రానుంది.మార్క్ బుకర్బర్గ్మెటా ఫౌండర్, చైర్మన్, సీఈవో అయిన మార్క్ బుకర్‌బర్గ్ 2030 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్న బుకర్‌బర్గ్ నెట్‌వర్త్ ఏటా 35.76 శాతం వృద్ధి చెందుతోంది.ఫిల్ నైట్ కుటుంబంనైక్ చైర్మన్ ఫిల్ నైట్, ఆయన కుటుంబం సంయుక్తంగా 40.9 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఇది సంవత్సరానికి సగటున 7.99 శాతం పెరుగుతోంది. 2030 నాటికి ఈ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలో చోటు దక్కించుకోనుంది.ముఖేష్ అంబానీఆసియా అపర కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2033 కల్లా ట్రిలియనీర్ కానున్నారు. ఆయన నెట్‌వర్త్ ఏటా సగటున 28.25 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది.మైకేల్ డెల్డెల్ టెక్నాలజీస్ చైర్మన్ సీఈవో మైకేల్ డెల్ ప్రస్తుత నెట్‌వర్త్ 91 బిలియన్ డాలర్లు. ఇది సంవత్సరానికి 30.89 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. దీని ప్రకారం ఆయన 2033 నాటికి ట్రిలియన్ డాలర్ క్లబ్లో చేరనున్నారు.స్టీవ్ బామర్మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ ప్రస్తుత నెట్‌వర్త్ 121 బిలియన్ డాలర్లు. 25.76 శాతం చొప్పున ఏటా వృద్ధి చెందుతోంది. ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక ప్రకారం ఈయన 2034 నాటికి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉంది. -
తిరుగులేని టెస్లా.. రూ.75 లక్షల కోట్ల విలువైన కంపెనీగా రికార్డు
Tesla Crosses One Trillion Dollar Market Capital: ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ప్రపంచలోనే నంబర్ వన్ కంపెనీగా ఉన్న టెస్లా మరో రికార్డు సాధించింది. మార్కెట్ క్యాపిటల్ విలువలో ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీగా నిలిచింది. వన్ ట్రిలియన్ క్లబ్లో అమెరికన్ స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ షేర్ల ధర సోమవారం ఒక్క రోజే దాదాపు 15 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ ఒక్కో షేరు విలువ ఏకంగా 1045 యూఎస్ డాలర్లకి చేరుకుంది. ఫలితంగా మార్కెట్ క్యాపిటల్ విలువ వన్ ట్రిలియన్ డాలర్లు దాటి పోయింది. ఎలన్ మస్క్ సైతం తన ట్వీట్ ద్వారా ఈ విషయం ధ్రువీకరించారు. భారీ ఆఫర్ అమెరికాలో రెంటల్ కార్ సర్వీసులు అందించే హెర్జ్ కంపెనీ టెస్లాతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది చివరినాటికి టెస్లా నుంచి లక్ష కార్లను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ వివరాలు బయటకు రావడం ఆలస్యం టెస్లా కంపెనీ షేర్లు ఆకాశాన్ని తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి 14.9 శాతంగా షేర్ల విలువ పెరిగింది. దీంతో సునాయాసంగా వన్ ట్రిలియన్ మార్క్‌ని క్రాస్ చేసింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 75 లక్షల కోట్ల (రూ. 75,133,05,00,00,000)కు పైగా నమోదు అయ్యింది. Wild $T1mes! — Elon Musk (@elonmusk) October 25, 2021 ఆ ఒక్క డీల్ విలువే హెర్జ్ కంపెనీతో కుదిరిన ఒప్పందం విలువ ఏకంగా 4.4 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా ఎస్ ప్లెయిడ్ కారు ధర ప్రస్తుతం 44,000 డాలర్లుగా ఉంది. కేవలం ఏడాది వ్యవధిలోనే లక్ష కార్లను కొనుగోలు చేయడం ద్వారా 4.4 బిలియన్ డాలర్ల బిజినెస్ జరగబోతుంది. ఇది కాకుండా యూరప్, ఏషియా మార్కెట్లలో సైతం టెస్లా కార్లను ఫుల్ డిమాండ్ ఉంది. ఐదో కంపెనీ ఇప్పటి వరకు వన్ ట్రిలియన్ మార్క్ మార్కెట్ వ్యాల్యూని దాటిన కంపెనీలన్నీ టెక్నాలజీ బేస్డ్గాను ఉన్నాయి. యాపిల్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ విలువ వన్ ట్రిలియన్ పైకి ఉండగా తాజగా టెస్లా వాటి సరసన చేరింది. వాటికి సాధ్యం కానిది ఫోర్డ్, జనరల్ మోటార్స్, హోండా, హ్యుందాయ్, రెనాల్ట్, ఫోక్స్ వ్యాగన్ లాంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు సాధ్యం కాని రికార్డును టెస్లా అలవోకగా అధిగమించింది. వందల ఏళ్లుగా ఆటోమొబైల్ సెక్టార్లో ఉన్న బడా కంపెనీలు చేయలేకపోయిన ఫీట్‌ని అవలీలగా క్రాస్ చేసింది. చదవండి:టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...! -
ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకి జారిన భారత్
రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల బలహీన పడటంతో భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకు జారింది. స్టాక్ మార్కెట్లో నిన్న సాయంత్రానికి జరిగిన మొత్తం వాణిజ్యంలో భారత్ రూ. 989 కోట్ల అమెరికన్ డాలర్లు నమోదు అయింది. ట్రిలియన్ డాలర్లకు స్వల్పంగా కొన్ని కోట్లు తగ్గటంతో ఆ క్లబ్లో భారత్ స్థానం చేజారింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ కనిష్టస్థాయికి చేరుతుంది. అంతలోనే రూపాయి విలువ పెరుగుతుంది. ఆ ఒడిదుడుకుల నేపథ్యంలో భారత్‌కు ఆ పరిస్థితి నెలకొంది. గత కొన్ని వారాలుగా ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి భారత్ వైదొలిగే సూచనలు కనిపించాయి. కానీ రూపాయి పతనం, మరల పుంజుకొవడంతో భారత్ ఆ క్లబ్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. కానీ మంగళవారం జరిగిన వాణిజ్యంలో రూపాయి పతనం అయ్యే సరికి ఆ క్లబ్ నుంచి భారత్ వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2007లో మొట్టమొదటగా భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం పొందింది. 2008, సెప్టెంబర్‌లో ఆ క్లబ్ నుంచి వైదొలిగింది. 2009లో భారత్ మళ్లీ ట్రిలియన్ క్లబ్లో సభ్యత్వం పొందింది. భారత్ వైదొలగడంతో యూఎస్, యూకే, జపాన్, చైనా, కెనడా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతం, బ్రెజిల్ దేశాల స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కాగా బ్రెజిల్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతంలోని స్టాక్ మార్కెట్లు మాత్రం స్వల్ప తేడాతో ఆ క్లబ్లో కొనసాగుతున్నాయి. అయితే గతంలో రష్యా, స్పెయిన్, దక్షిణాఫ్రికాలు ఆ క్లబ్లో స్థానం పొంది మరల కొల్పోయాయి.