రోష్ని నాడార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభన భర్తియ, ప్రియాంక చోప్రా
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో మన దేశానికి చెందిన నలుగురు మహిళలకు చోటుదక్కింది. హెచ్‌సీఎల్ రోష్ని నాడార్ మల్హోత్రా, బయో కాన్ కిరణ్ మజుందార్ షా, హిందుస్థాన్ టైమ్స్ శోభన భర్తియ, సినీతార ప్రియాంక చోప్రా జాబితాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందితో రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిలిచారు. ఆమె ఈ జాబితాలో టాప్‌లో నిలవడం ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం. రెండో స్థానంలో యూకే ప్రధాని థెరిసా మే, మూడో స్థానంలో ఐఎమ్‌ఎఫ్ ఎమ్‌డీ క్రిస్టినా లగార్డే ఉన్నారు.
51వ స్థానంలో రోష్ని నాడార్...
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్న రోష్ని 51వ స్థానంలో నిలిచారు. కిరణ్ షా 60వ స్థానంలో, హెచ్‌టీ మీడియా సీఎండీ శోభనా భర్తియ 88వ స్థానంలో నిలిచారు. ప్రియాంక చోప్రా 94వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment