టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌లు బిజినెస్ టైకూన్స్. ఫోర్బ్స్ తాజా గణంకాల ప్రకారం..ప్రపంచ అపర కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మొదటిస్థానం,బెజోస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. సంపాదించడంలో ఒకరితో ఒకరూ పోటీ పడడమే కాదు..దానం చేసే విషయంలో ఏక్ నెంబర్ పిసునారులుగా ప్రసిద్దికెక్కారు.
ఫోర్బ్స్ సర్వేలో
ఎలాన్ మస్క్, జెఫ్‌బెజోస్‌లకు డబ్బు విలువ తెలియడం చేత ఆచి తూచి ఖర్చు చేసినా...పొదుపు,ఆదాను మరీ పీక్‌లెవెల్స్‌కి తీసుకెళ్లి ఆల్‌టైమ్ పిసినారి కోటీశ్వరుల జాబితాలో చేరిపోయారు.అది ఎలా అంటారా? ఫోర్బ్స్ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ప్రపపంచ ధనవంతుల జాబితాలో ఉన్న వ్యక్తులు తమ జీవితకాలంలో ఎంత దానం చేశారనే విషయాన్ని నిర్ధారించే ప్రయత్నం చేసింది.
అందులో ప్రైవేట్ ఫౌండేషన్‌లు, డోనర్ అడ్వైజ్ ఫండ్స్ (ఓ చారిటీ సంస్థకు తరుపు బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు వేయడం, వాటి వినియోగం) ను పరిగణలోకి తీసుకోకుండా ధనవంతులు సంపాదించిన మొత్తం ఆస్తిని వాళ్లు దానం చేసిన మొత్తాన్ని డివైడ్ చేయగా వచ్చిన మొత్తాన్ని 1శాతం కంటే తక్కువ, 1శాతం - 5శాతం మధ్య, 5శాతం - 10శాతం మధ్య, 10శాతం -20శాతం మధ్య, 20శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇలా ఐదు భాగాలుగా విభజించింది. ఇందులో సగటు ఒక అమెరికా పౌరుడు కుటుంబం అంతా జీవిత కాలంలో చేసే దానం కంటే ఎలాన్ మస్క్, జెఫ్‌బెజోస్‌లు ఇప్పటి వరకు చేసిన దానం చాలా తక్కువని తేలింది.
అపర కుబేరులే కానీ ఏక్ నెంబర్ పిసినారులు
సగటు ఒక అమెరికన్ కుటుంబం వారి జీవితం మొత్తంలో నికర విలువ దాదాపు $ 120,000 డాలర్లు ఉంటే...అందులో స్వచ్ఛంద సంస్థకు $1,200 ఇస్తే బెజోస్ - మస్క్ ఇచ్చేది చాలా తక్కువని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఈ ఏడాది బిలియనీర్ల జాబితాలో ఉన్న 400 మందిలో కేవలం 19 మంది మాత్రమే తమ సంపదలో 10శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చారు. రికార్డ్ స్థాయిలో 156 మంది 1శాతం కంటే తక్కువ ఇచ్చారు. వారిలో బెజోస్- ఎలాన్ మస్క్‌లు కూడా ఉన్నారు.జెఫ్ బెజోస్ మాజీ భార్య మెక్‌కెంజీ తన సంపదలో 13శాతం దానం ఇవ్వడం మరింత ఆసక్తి కరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment