భారతీయ సినీ పరిశ్రమలో సినీ నేపథ్య గాయకులకు ఉన్న పాపులారిటీ సామాన్యమైంది కాదు. ప్లేబ్లాక్ సింగింగ్‌ను కరియర్‌గా ఎంచుకున్న మహిళలు కూడా చాలామందే ఉన్నారు. తెలుగులో సుశీల, జానకి మొదలు వాణీ జయరాం, సునీత, చిన్మయి, ఉష లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే లతామంగేష్కర్, ఆశా భోంశ్లే బాలీవుడ్ సినిమాను ఏలారు. ఇంకా సునిధి చౌహాన్ , శ్రేయా ఘోషల్, నేహా కక్కర్ లాంటి వాళ్లు లెజెండ్స్‌గా ఈ తరాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో రిచెస్ట్ గాయని ఎవరో చూద్దాం.
భారతీయ సంగీతంలో ప్లేబ్యాక్ సింగింగ్‌కు సంబంధించి1950-60లలో గాయకులకు పైసా కూడా చెల్లించేవారు కాదట. కానీ లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి వాళ్లు పోరాటం ఫలితంగా ఈ తరం గాయకులు మంచి రెమ్యునరేషన్‌ను అందుకోవడం విశేషమే మరి. ఎంతగా అంటే నేడు చాలా మంది గాయకులు కోట్ల రూపాయలు, ఒక్కో పాటకు లక్షల్లో వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అత్యంత ధనిక మహిళా గాయని ఎవరు అనగానే పలు భాషల్లో తమ గాత్రంతో ఆకట్టుకుంటున్న శ్రేయ ఘోషల్, చిన్మయి శ్రీపాద లాంటివాళ్లు గుర్తు వస్తారు కదా! (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్)
ఈ పేర్లు టాప్ 5లో ఉన్నప్పటికీ, నికర విలువ పరంగా చూస్తే మాత్రం 37 ఏళ్ల తులసీ కుమార్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఈమె నికర విలువ రూ. 200 కోట్లు. అయితే పాటలు పాడటంతోపాటు, కుటుంబ వ్యాపారం నుంచి వచ్చిన సంపాదన కూడా ఈమె నెట్‌వర్త్‌కు జత కలిసింది. కంటే కొంత తక్కువగానే ఉన్నాయి. గాయకుడు-అలా సింగర్=ఆంట్రప్రెన్యూర్ నికర విలువ 25 మిలియన్లు డాలర్లు. టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ సోదరి తులసికి కుటుంబ వ్యాపారంలో వాటా ఉంది. సుమారు 4000 కోట్ల కంపెనీలో ఆ వాటా ఆమెకు అపారమైన సంపదను జోడిస్తోంది. (Foxconn: ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి)
దాదాపు రూ.180-185 కోట్ల నికర విలువతో శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, 100 కోట్ల రూపాయలతో తరువాతి ప్లేస్‌లో ఉన్నారు. ఇక సింగింగ్ లెజెండ్ ఆశా భోంస్లే నికర విలువ రూ. 80 కోట్లకు పైగా ఉండగా, లేటెస్ట్ సెన్నేషనల్ సింగర్ నేహా కక్కర్ విలువ దాదాపు రూ. 40 కోట్లు. అయితే ఇండియా అత్యంత ధనిక గాయకుడితో పోల్చితే తులసి నికర విలువ తక్కువే. ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయుడు ఏఆర్ రెహమాన్ నికర విలువ రూ. 500 కోట్లకు పైగా మాటే. ఇది చాలా మంది బాలీవుడ్ స్టార్లకంటే చాలా ఎక్కువ.
తులసి మరిన్ని విషయాలు
1986 మార్చి 15న న్యూఢిల్లీలో జన్మించారు తులసి సోదరుడు భూషణ్ కుమార్, ఖుషాలి కుమార్ అనే సోదరి ఉన్నారు. లేడీ శ్రీ రామ్ మహిళా కళాశాలలో చదువుకుంది. వ్యాపారవేత్త హితేష్ రాల్హాన్‌తో 2015లో ప్రేమ వివాహం. వీరిద్దరికీ 2017లో శివాయ్ రాల్హాన్ అనే పాప పుట్టింది.
2009లో 'లవ్ హో జే' ఆల్బమ్‌తో అరంగేట్రం చేసిన అనేక మ్యూజిక్ వీడియోలు, ఆల్బంలతో మిలియన్ల వ్యూస్‌తో ఆదరణ పొందడమే కాదు తన గాన ప్రతిభకు ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది.
2010- గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు
2014- మిర్చి మ్యూజిక్ అవార్డ్స్
2017- ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ
2017- మిర్చి మ్యూజిక్ అవార్డు
2019- IIFA బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌కి నామినేట్
Comments
Please login to add a commentAdd a comment