సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్ హీరామండి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ నటీ నటుల వివరాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ మేనకోడలు గ్లామరస్ 'అలంజేబ్' పాత్రలో అలరించిన షర్మిన్ సెగల్ ఎవరు. ఆమె భర్త ఎవరు. అతని నెట్‌వర్త్ ఎంత అనేది ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం.
ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కంటెంట్ హెడ్‌గా పనిచేశారు. తల్లి బేలా సెగల్ పాపులర్ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్ లాంటి ఎన్నో చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.
అంతేకాదు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు షర్మిన్ మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన సంజయ్ లీలా బన్సాలీ క 'హిరామండి'లో షర్మిన్ గ్లామరస్ పాత్రను దక్కించుకుంది.
రూ. 50 వేల కోట్ల ఆస్తి
షర్మిన్ సెగల్ భర్త, పారిశ్రామికవేత్త అమన్ మెహతా వేల కోట్లకు యజమాని. గత ఏడాది నవంబరులో అమన్ మెహతా , షర్మిన్ సెహగల్ పెళ్లి చేసుకున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ అనుబంధ సంస్థటోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్‌మెహతా. మెహతా కుటుంబ నికర విలువ 50000 కోట్లకు పైమాటే. అమన్ టోరెంట్ గ్రూప్‌ను అమన్ తాత యు.ఎన్. మెహతా 1959లో ప్రారంభించారు. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం అమన్ తండ్రి సమీర్ మెహతా సోదరుడు సుధార్ మెహతా ఇద్దరూ కంపెనీ కో-ఛైర్మెన్‌గా ఉన్నారు. టోరెంట్ గ్రూప్‌నకు టొరెంట్ ఫార్మా, టొరెంట్ పవర్, టొరెంట్ కేబుల్స్, టొరెంట్ గ్యాస్ ,టొరెంట్ డయాగ్నోస్టిక్స్ లాంటి అనుబంధ కంపెనీలున్నాయి.
టోరెంట్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమన్ మెహతా 2022 నుండి టోరెంట్ ఫార్మాలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇండియతో పాటు, ఇతర దేశాలలోకంపెనీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.
ఫోర్బ్స్ ప్రకారం, అమన్ మెహతా తండ్రి సమీర్ మెహతా నికర విలువ 6.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 50,939 కోట్లు). టోరెంట్ ఫార్మా ఆదాయం 4.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 38,412 కోట్లు). సమీర్, అమన్ ఇద్దరూ తమ కుటుంబ వ్యాపారంలో ఫార్మా రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు.
అమన్ మెహతా విద్యార్హతలు
అమన్ మెహతా బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అమెరికాలోన కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ పూర్తికాక ముందు అమన్ 3 సంవత్సరాల పాటు టోరెంట్ పవర్‌లో డిస్ట్రిబ్యూషన్ మేనేజర్‌గా అనుభవం సంపాదించాడు. ఎంబీఏ పూర్తి అయిన తరువాత టోరెంట్ ఫార్మాలో సీఎంఓగా చేరి మూడేళ్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment