Torrent Pharma
-
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్ హీరామండి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ నటీ నటుల వివరాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ మేనకోడలు గ్లామరస్ 'అలంజేబ్' పాత్రలో అలరించిన షర్మిన్ సెగల్ ఎవరు. ఆమె భర్త ఎవరు. అతని నెట్‌వర్త్ ఎంత అనేది ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం.ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ హెడ్‌గా పనిచేశారు. తల్లి బేలా సెగల్ పాపులర్ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్ లాంటి ఎన్నో చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.అంతేకాదు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు షర్మిన్ మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన సంజయ్ లీలా బన్సాలీ క 'హిరామండి'లో షర్మిన్ గ్లామరస్ పాత్రను దక్కించుకుంది.రూ. 50 వేల కోట్ల ఆస్తిషర్మిన్ సెగల్ భర్త, పారిశ్రామికవేత్త అమన్ మెహతా వేల కోట్లకు యజమాని. గత ఏడాది నవంబరులో అమన్ మెహతా , షర్మిన్ సెహగల్ పెళ్లి చేసుకున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ అనుబంధ సంస్థటోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్మెహతా. మెహతా కుటుంబ నికర విలువ 50000 కోట్లకు పైమాటే. అమన్ టోరెంట్ గ్రూప్‌ను అమన్ తాత యు.ఎన్. మెహతా 1959లో ప్రారంభించారు. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం అమన్ తండ్రి సమీర్ మెహతా సోదరుడు సుధార్ మెహతా ఇద్దరూ కంపెనీ కో-ఛైర్మెన్‌గా ఉన్నారు. టోరెంట్ గ్రూప్‌నకు టొరెంట్ ఫార్మా, టొరెంట్ పవర్, టొరెంట్ కేబుల్స్, టొరెంట్ గ్యాస్ ,టొరెంట్ డయాగ్నోస్టిక్స్ లాంటి అనుబంధ కంపెనీలున్నాయి.టోరెంట్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమన్ మెహతా 2022 నుండి టోరెంట్ ఫార్మాలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇండియతో పాటు, ఇతర దేశాలలోకంపెనీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.ఫోర్బ్స్ ప్రకారం, అమన్ మెహతా తండ్రి సమీర్ మెహతా నికర విలువ 6.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 50,939 కోట్లు). టోరెంట్ ఫార్మా ఆదాయం 4.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 38,412 కోట్లు). సమీర్, అమన్ ఇద్దరూ తమ కుటుంబ వ్యాపారంలో ఫార్మా రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. అమన్ మెహతా విద్యార్హతలుఅమన్ మెహతా బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అమెరికాలోన కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ పూర్తికాక ముందు అమన్ 3 సంవత్సరాల పాటు టోరెంట్ పవర్లో డిస్ట్రిబ్యూషన్ మేనేజర్‌గా అనుభవం సంపాదించాడు. ఎంబీఏ పూర్తి అయిన తరువాత టోరెంట్ ఫార్మాలో సీఎంఓగా చేరి మూడేళ్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు. -
టొరంట్ ఫార్మా చేతికి క్యురేషియో: ఏకంగా 2వేలకోట్లు
న్యూఢిల్లీ: చర్మ పరిరక్షణ(డెర్మటాలజీ) విభాగంలో సేవలందిస్తున్న క్యురేషియో హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రయివేట్ రంగ కంపెనీ టొరంట్ ఫార్మాస్యూటికల్స్ పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువను రూ. 2,000 కోట్లుగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఒప్పందంపై సంతకాలు చేసిన రోజున రూ. 115 కోట్లను నగదు రూపేణా చెల్లించనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,885 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఒప్పందం కుదిరినట్లు వివరించింది. కాగా.. క్యురేషియోను సొంతం చేసుకోవడం ద్వారా డెర్మటాలజీ పోర్ట్‌ఫోలియోను విభిన్నంగా విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు టొరంట్ ఫార్మా డైరెక్టర్ అమన్ మెహతా తెలియజేశారు. ఇది వ్యూహాత్మక కొనుగోలుగా పేర్కొన్నారు. 50 బ్రాండ్లకుపైగా: చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న క్యురేషియో కాస్మెటిక్, పిడియాట్రిక్ డెర్మటాలజీ విభాగాలలో అధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. టెడిబార్, అటోగ్లా, స్పూ, బీ4 నప్పి, పెర్మైట్ తదితర 50 బ్రాండ్లకుపైగా పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. గతేడాది(2021–22)లో రూ. 224 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. క్యురేషియో ప్రమోటర్లతోపాటు.. క్రిస్‌క్యాపిటల్, సీక్వోయా సైతం కంపెనీ నుంచి వైదొలగనున్నట్లు ప్రస్తావించింది. -
బేయర్ క్రాప్‌సైన్స్ -టొరంట్.. లాభాల పవర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో సస్య రక్షణ రంగ దిగ్గజం బేయర్ క్రాప్‌సైన్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఇదే కాలం(ఏప్రిల్-జూన్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ కంపెనీ టొరంట్ పవర్కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. బేయర్ క్రాప్‌సైన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బేయర్ క్రాప్‌సైన్స్ నికర లాభం 86 శాతం ఎగసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 252 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం పుంజుకుని రూ. 1,228 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బేయర్ క్రాప్‌సైన్స్ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 6,174 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతం దూసుకెళ్లి రూ. 6,450కు చేరింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది! టొరంట్ పవర్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో టొరంట్ పవర్ రూ. 373 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది35 శాతం వృద్ధికాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 19 శాతం నీరసించి రూ. 3,042 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో టొరంట్ పవర్ షేరు 5.2 శాతం జంప్‌చేసి రూ. 345 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 358 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
టోరెంట్ ఫార్మా చేతికి గ్లోకెమ్ ప్లాంటు
వైజాగ్ ప్లాంటు కొనుగోలుకు ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం టోరెంట్ ఫార్మా తాజాగా గ్లోకెమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన వైజాగ్ ప్లాంటును, కొన్ని డ్రగ్ మాస్టర్ ఫైల్స్ (డీఎంఎఫ్)ను ఏకమొత్తంగా కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి గ్లోకెమ్తో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే గ్లోకెమ్.. ఔషధాల తయారీలో ఉపయోగించే ముడిపదార్ధాలు (బల్క్ డ్రగ్స్ లేదా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్-ఏపీఐ) ఉత్పత్తి చేస్తుంది. వైజాగ్‌లో పరవాడకు దగ్గర్లోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న ప్లాంటుకు ఎఫ్‌డీఏ, యూరోపియన్ ఔషధ రంగ నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులున్నాయి. ఇందులో నాలుగు బ్లాక్‌లు ఏపీఐల తయారీకి ఉపయోగపడుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీ, పైలట్ ప్లాంట్ తదితర సదుపాయాలున్నాయి. ప్లాంటులో అగ్నిప్రమాదం కారణంగా కొద్దిరోజుల క్రితమే వార్తల్లో నిల్చింది. ఇక డీల్ విలువను కంపెనీలు వెల్లడించనప్పటికీ .. సుమారు రూ. 300 కోట్ల మేర ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌కు అనుగుణంగా ఔషధాల ఉత్పత్తికి ఈ కొనుగోలు తమకు ఉపయోగపడగలదని టోరెంట్ ఫార్మా ఈడీ (ఆపరేషన్స్ విభాగం) జినేష్ షా తెలిపారు. వివిధ ఔషధాల ఉత్పత్తిలో ఉపయోగించే రసాయనాలు తదితర వివరాలతో అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కి తయారీ సంస్థలు సమర్పించే పత్రాలను డీఎంఎఫ్‌గా వ్యవహరిస్తారు. టోరెంట్ ఫార్మాకు 5 ఫార్ములేషన్ ప్లాంట్లున్నాయి. తాజాగా గ్లోకెమ్ వైజాగ్ కేంద్రాన్ని కొనుగోలు చేయడంతో ఏపీఐ ప్లాంట్ల సంఖ్య మూడుకు చేరుతుంది. హైదరాబాద్‌కే చెందిన ఇంజెక్టబుల్స్ తయారీ సంస్థ గ్లాండ్ ఫార్మా కొనుగోలుకు పోటీపడిన సంస్థల్లో టోరెంట్ కూడా ఉంది. అయితే, వాల్యుయేషన్ల వల్ల వైదొలిగింది. -
ఫార్మాలో 4 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఓకే
న్యూఢిల్లీ : ఫార్మా రంగంలో సుమారు రూ. 4,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టొరెంట్ ఫార్మా, బయోకాన్‌కి చెందిన రీసెర్చ్ సేవల సంస్థ సింజీన్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. అయితే, షాసన్ ఫార్మాకి చెందిన ప్రవాసీ, దేశీ షేర్హోల్డర్లకు షేర్లను జారీ చేసేందుకు ఉద్దేశించిన స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం, మరో మూడు సంస్థల ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. వాయిదా పడిన వాటిల్లో శాంతా బయోటెక్నిక్స్, స్పర్శ ఫార్మా ఇంటర్నేషనల్, సెలాన్ లేబొరేటరీస్ ప్రతిపాదనలు ఉన్నాయి. మే 28న సమావేశమైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం బుధవారం ఈ నిర్ణయాలు తీసుకుంది. వీటిలో టొరెంట్ ఫార్మా అత్యధికంగా రూ. 3,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం కంపెనీలో 13.09%గా ఉన్న వాటాలను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) 35 శాతానికి పెంచుకోనున్నారు. ఇక, సింజీన్ ఇంటర్నేషనల్ రూ. 930 కోట్ల ఎఫ్‌డీఐలు సమీకరించనుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీవో) కింద విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ), ప్రవాస భారతీయులకు(ఎన్ఆర్ఐ) షేర్లను జారీ చేయడం ద్వారా కంపెనీ ఈ నిధులు సమీకరిస్తుంది. దీంతో కంపెనీలో విదేశీ పెట్టుబడులు 44%కి చేరనున్నాయి. గ్రూప్ పీటర్స్ సర్జికల్ సంస్థకు 77.5% వాటాల విక్రయం ద్వారా స్టెరిక్యాట్ గట్ స్ట్రింగ్స్ రూ. 43.52 కోట్ల ఎఫ్‌డీఐలు సమీకరించనుంది. అలాగే, అల్కెమ్స్ ఫెర్టికాకు చెందిన కొన్ని ఆస్తులను ఆర్డెయిన్ హెల్త్‌కేర్ గ్లోబల్ కొనుగోలు చేసే ప్రతిపాదనకూ గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ డీల్ విలువ రూ.23.34 కోట్లు. రూ. 180 కోట్లతో ఫార్మా పార్కులు.. ఫార్మాస్యూటికల్స్ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ ఏడాది ఆరు ఫార్మా పార్కులు నెలకొల్పాలని కేంద్రం యోచిస్తోంది. సుమారు రూ. 180 కోట్లతో వీటిని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు త్వరలో ఆమోదముద్ర వేయనున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఆరు ఫార్మా పార్కులను ప్రయోగాత్మకంగా నెలకొల్పనున్నట్లు, వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా వీటి ఏర్పాటు కోసం ఆర్థిక శాఖ నుంచి రూ. 1,000 కోట్లు కోరనున్నట్లు ఆయన వివరించారు. వీటిలో ఔషధాల టెస్టింగ్‌కు, పరిశ్రమ వర్గాల శిక్షణకు తగిన మౌలిక సదుపాయాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ఒక్కో దానికి రూ. 20 కోట్లు గ్రాంటుగా సమకూర్చనుందని ఫార్మా రంగానికి సంబంధించిన క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించిన సందర్భంగా మంత్రి వివరించారు. స్టార్ ఇండియా ప్రతిపాదనకు ఓకే... ప్రసార సంస్థ స్టార్ ఇండియా తన విదేశీ భాగస్వామ్య సంస్థకు షేర్ల జారీ, బదిలీ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాకుండా బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో ఉన్న మరో భారత కంపెనీ కొనుగోలుకు కూడా ఈ కంపెనీకి అనుమతి లభించింది. మొత్తం రూ.6,751 కోట్ల విలువైన 16 విదేశీ ప్రత్య క్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు బుధవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో స్టెరిక్యాట్ గట్ స్ట్రింగ్స్, బీఏఎస్ఎఫ్ కెమికల్స్ ఇండియా, ఓర్డియన్ హెల్త్‌కేర్ గ్లోబల్, ట్రిఫ్ కోచి ప్రాజెక్ట్స్, ట్రిఫ్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలప్మెంట్, బెర్గ్యుయన్ రియల్ ఎస్టేట్స్, టుడే మ్యాగజైన్స్ లైఫ్స్టైల్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడుల పరిమితిని 55 శాతానికి పెంచుకోవాలన్న కోటక్ మహీంద్రా ప్రతిపాదనపై నిర్ణయం వాయిదా పడింది. ఇలా వాయిదా పడిన ప్రతిపాదనల్లో రిలయన్స్ గ్లోబల్‌కామ్, ఈరోస్ ఇంటర్నేషనల్, ఎన్టీటీ కమ్యూనికేషన్స్, హాత్వే కేబుల్ ఉన్నాయి. -
టొరంట్ చేతికి ‘ఎల్డర్ ఫార్మా’
న్యూఢిల్లీ: ఎల్డర్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన బ్రాండెడ్ ఫార్ములేషన్ బిజినెస్‌ను (భారత్, నేపాల్‌ల బిజినెస్‌ను )టొరెంట్ ఫార్మా కొనుగోలు చేయనున్నది. ఈ లావాదేవీ విలువ రూ.2,000 కోట్లు. ఈ డీల్ కారణంగా మహిళల ఆరోగ్య సంరక్షణ, నొప్పి నివారణ సెగ్మెంట్లలో తమ పరిస్థితి మరింత మెరుగవుతుందని, తమ వ్యాపారం మరింత పటిష్టమవుతుందని టొరెంట్ గ్రూప్ చైర్మన్ సుధీర్ మెహతా చెప్పారు. ఈ డీల్‌కు కావలసిన నిధులను అంతర్గతంగానూ, బ్యాంక్ రుణాల ద్వారానూ సమకూర్చుకుంటామని వివరించారు. ఈ డీల్ కారణంగా ఇటీవల తాము ఎదుర్కొన్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఎల్డర్ ఫార్మా ఎండీ, సీఈవో అలోక్ సక్సేనా చెప్పారు. అంతే కాకుండా తమ ఆర్థిక పరిస్థితి కూడా పటిష్టమవుతుందని వివరించారు. ఈ లావాదేవీ ఇరు కంపెనీల బోర్డ్‌ల ఆమోదం పొందింది. ఇక వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ కల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. ఈ డీల్ ప్రభావంతో శుక్రవారం ఎన్ఎస్ఈలో టొరంట్ ఫార్మా షేర్ 4.36 శాతం క్షీణించి రూ.479.65కు, ఎల్డర్ ఫార్మా 8 శాతం క్షీణించి రూ.299.10 వద్ద ముగిసాయి.