టొరంట్ చేతికి ‘ఎల్డర్ ఫార్మా’ | Elder Pharma crashes 8% on worry about residual business; Torrent down 4% | Sakshi
Sakshi News home page

టొరంట్ చేతికి ‘ఎల్డర్ ఫార్మా’

Published Sat, Dec 14 2013 1:50 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

టొరంట్ చేతికి ‘ఎల్డర్ ఫార్మా’ - Sakshi

టొరంట్ చేతికి ‘ఎల్డర్ ఫార్మా’

న్యూఢిల్లీ: ఎల్డర్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన బ్రాండెడ్ ఫార్ములేషన్ బిజినెస్‌ను (భారత్, నేపాల్‌ల బిజినెస్‌ను )టొరెంట్ ఫార్మా కొనుగోలు చేయనున్నది. ఈ లావాదేవీ విలువ రూ.2,000 కోట్లు. ఈ డీల్ కారణంగా మహిళల ఆరోగ్య సంరక్షణ, నొప్పి నివారణ సెగ్మెంట్లలో  తమ పరిస్థితి మరింత మెరుగవుతుందని, తమ వ్యాపారం మరింత పటిష్టమవుతుందని టొరెంట్ గ్రూప్ చైర్మన్ సుధీర్ మెహతా చెప్పారు. ఈ డీల్‌కు కావలసిన నిధులను అంతర్గతంగానూ, బ్యాంక్ రుణాల ద్వారానూ సమకూర్చుకుంటామని వివరించారు.
 
 ఈ డీల్ కారణంగా ఇటీవల తాము ఎదుర్కొన్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఎల్డర్ ఫార్మా ఎండీ, సీఈవో అలోక్ సక్సేనా చెప్పారు. అంతే కాకుండా తమ ఆర్థిక పరిస్థితి కూడా పటిష్టమవుతుందని వివరించారు. ఈ లావాదేవీ ఇరు కంపెనీల బోర్డ్‌ల ఆమోదం పొందింది. ఇక వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ కల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. ఈ డీల్ ప్రభావంతో శుక్రవారం  ఎన్‌ఎస్‌ఈలో టొరంట్ ఫార్మా షేర్ 4.36 శాతం క్షీణించి రూ.479.65కు, ఎల్డర్ ఫార్మా 8 శాతం క్షీణించి రూ.299.10 వద్ద ముగిసాయి.        

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement