స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నటించిన తాజా చిత్రం గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో జూలై 15న థియేటర్లలో విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సాయిపల్లవి నటనకు మరోసారి ఫిదా అవుతున్నారు. చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తాయి, కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేవిగా నిలిచిపోతాయి. అందులో గార్గి ఒకటని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పాజిటివ్ టాక్ అందుకున్న గార్గి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఖరారైనట్లు తెలుస్తోంది. గార్గి ఓటీటీ హక్కులను సోనీ లివ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే గార్గిని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తోందట సోని లివ్. అయితే గార్గి ఆగస్టు మొదటి వారానికే ఓటీటీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉందంటున్నారు సినీపండితులు. మరి గార్గి నిజంగానే వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచే అందుబాటులోకి వస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!
There are few films that need to be viewed as a community experience and we’re grateful that this has reached the big screens.
— Sai Pallavi (@Sai_Pallavi92) July 15, 2022
I’d like for you all to watch #Gargi in THEATRES along ur friends and family!
My love to all those ppl who’ve sent your wishes and blessings 🙏🏻❤️ pic.twitter.com/iAiKlvxOHw
Comments
Please login to add a commentAdd a comment