Chor Nikal Ke Bhaaga
-
నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాలేవో తెలుసా?
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీలపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రిలీజ్ చిత్రాలు సైతం నెల రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతుండగా.. సినీ ప్రియులు ఎంచక్కా ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా మడాక్ ఫిల్మ్స్ సంస్థ ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాల జాబితాను పోస్ట్ చేసింది. అందులో హాలీవుడ్ కాకుండా.. అత్యధిక గంటలు వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాలు ఉన్నాయి. (ఇది చదవండి: రాహుల్ గాంధీపై మనసు పారేసుకున్న బోల్డ్ బ్యూటీ!) ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల జాబితాను ప్రకటించింది. మడాక్ ఫిల్మ్స్ రిలీజ్ చేసిన లిస్ట్‌లో ఆర్ఆర్ఆర్(హిందీ) తొలిస్థానంలో ఉండగా.. మిమి చిత్రం పదో స్థానంలో నిలిచింది. రెండు స్థానంలో ఆలియాభట్ మూవీ గంగుభాయ్ కతియావాడి, మూడోస్థానంలో 'చోర్ నికల్ కే భాగా' నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో డార్లింగ్స్, మిన్నల్ మురళి, హసీన్ దిల్రుబా, సూర్యవంశి, మిషన్ మజ్ను, భూల్ భూలయ్యా-2 చిత్రాలు ఉన్నాయి. హిందీలోనూ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ మొదటిస్థానంలో నిలవడం టాలీవుడ్ సినిమాకే గర్వకారణం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియాభట్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !) View this post on Instagram A post shared by Maddock Films (@maddockfilms) -
ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు.. విడుదలైన రెండు వారాల్లోనే!
దర్శకధీరుడు తెరకెక్కించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాటునాటు సాంగ్‌కు సైతం ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. అయితే తాజాగా ఈ మూవీ రికార్డ్ బద్దలైంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ ఇప్పటి వరకు 2 5మిలియన్ అవర్స్‌తో తొలిస్థానంలో ఉండగా ఆ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల రిలీజైన హైజాకింగ్ థ్రిలింగ్ డ్రామా ‘చోర్ నికల్ కే భాగా’ ఆర్ఆర్ఆర్ను అధిగమించింది. యామీ గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ ఖేల్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ 29 మిలియన్ల అవర్స్ వీక్షించనట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. విడుదలైన రెండు వారాల్లోనే అత్యధికమంది వీక్షించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కాగా.. మూడో స్థానంలో 22 మిలియన్ అవర్స్‌తో అలియాభట్ ప్రధానపాత్రలో నటించిన గంగూబాయి కతియావాడి నిలిచింది. -
హిట్ కోసం ఐదోసారి!
తమన్నాకు హిట్స్ కొత్త కాదు. సౌత్‌లో పలు హిట్, సూపర్‌హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కానీ, హిందీలో హిట్ అనేది ఇప్పటివరకూ అందని ద్రాక్షలా ఆమెను ఊరిస్తోంది. ‘హమ్‌షకల్స్’, ‘హిమ్మత్వాలా’, ‘ఎంటర్టైన్మెంట్’... తమన్నా చేసిన మూడు స్ట్రయిట్ హిందీ సినిమాలు నిరాశను మిగిల్చాయి. గతేడాది నటించిన త్రిభాషా సినిమా ‘అభినేత్రి’ కూడా ఫ్లాప్ జాబితాలో చేరింది. అయినా... పట్టు వదలని విక్రమార్కుడు తరహాలో తమన్నా హిందీ తెరపై హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా... జాన్ అబ్రహాం హీరోగా నటించనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఛోర్ నికల్ కే భాగ్’లో నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. అయితే... హీరోయిన్గా కాదు, హీరోకు ధీటుగా అతనితో మైండ్ గేమ్స్ ప్లే చేసే కీలక పాత్ర. ఇందులో తమన్నా ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించనున్నారు. ఈసారి హిట్ కన్ఫర్మ్ అని తమన్నా ధీమాగా ఉన్నారట! హిందీ సినిమాల సంగతి పక్కన పెడితే... తెలుగులో ఆమె నటించిన ‘బాహుబలి–2’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. తమిళంలో ఆమె రెండు మూడు సినిమాలు చేస్తున్నారు.