హిట్‌ కోసం ఐదోసారి! | John Abraham and Tamannaah Bhatia to star in Chor Nikal Ke Bhaaga | Sakshi
Sakshi News home page

హిట్‌ కోసం ఐదోసారి!

Published Wed, Mar 8 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

హిట్‌ కోసం ఐదోసారి!

హిట్‌ కోసం ఐదోసారి!

తమన్నాకు హిట్స్‌ కొత్త కాదు. సౌత్‌లో పలు హిట్, సూపర్‌హిట్‌ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కానీ, హిందీలో హిట్‌ అనేది ఇప్పటివరకూ అందని ద్రాక్షలా ఆమెను ఊరిస్తోంది. ‘హమ్‌షకల్స్‌’, ‘హిమ్మత్‌వాలా’, ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’... తమన్నా చేసిన మూడు స్ట్రయిట్‌ హిందీ సినిమాలు నిరాశను మిగిల్చాయి. గతేడాది నటించిన త్రిభాషా సినిమా ‘అభినేత్రి’ కూడా ఫ్లాప్‌ జాబితాలో చేరింది. అయినా... పట్టు వదలని విక్రమార్కుడు తరహాలో తమన్నా హిందీ తెరపై హిట్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తాజాగా... జాన్‌ అబ్రహాం హీరోగా నటించనున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఛోర్‌ నికల్‌ కే భాగ్‌’లో నటించే ఛాన్స్‌ ఆమెకు వచ్చింది. అయితే... హీరోయిన్‌గా కాదు, హీరోకు ధీటుగా అతనితో మైండ్‌ గేమ్స్‌ ప్లే చేసే కీలక పాత్ర. ఇందులో తమన్నా ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించనున్నారు. ఈసారి హిట్‌ కన్ఫర్మ్‌ అని తమన్నా ధీమాగా ఉన్నారట! హిందీ సినిమాల సంగతి పక్కన పెడితే... తెలుగులో ఆమె నటించిన ‘బాహుబలి–2’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. తమిళంలో ఆమె రెండు మూడు సినిమాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement