జాన్‌తో జోడీగా | tamannah act with John Abraham | Sakshi
Sakshi News home page

జాన్‌తో జోడీగా

Published Thu, Dec 14 2017 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

tamannah act with John Abraham - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహాంతో జత కట్టనున్నారని బాలీవుడ్‌ టాక్‌. జాన్‌ అబ్రహాం, మనోజ్‌ భాజ్‌పాయి ముఖ్య పాత్రల్లో మిలాప్‌ జావేరి దర్శకత్వం వహించనున్న ఓ యాక్షన్‌ మూవీలో తమన్నాను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారట చిత్రబృందం. ఈ రోల్‌ ఆమెకు బాగా సూట్‌ అవుతుందని, స్క్రిప్ట్‌ తమన్నాకు కూడా బాగా నచ్చిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమాలో తమ్మూ కొన్ని యాక్షన్‌ సీన్స్‌ కూడా చేయబోతున్నారట.

ఈ చిత్రాన్ని నిఖిల్‌ అద్వాని నిర్మించనున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం జనవరిలో సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటివరకు తమన్నా నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా హిట్‌ అయిన దాఖలాలు లేవు. సో.. ఈ సినిమాతో అయినా సూపర్‌ సక్సెస్‌ అందుకుంటారో లేదో చూడాలి. తమన్నా ప్రస్తుతం ‘క్వీన్‌’ తెలుగు రీమేక్‌  ‘క్వీన్‌ వన్స్‌ ఎగైన్‌’, కల్యాణ్‌ రామ్‌ సరసన  ఒక సినిమా చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement