న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ చెన్నై ప్లాంట్ నుంచి పదిలక్షలవ కారును, ఇంజిన్‌ను ఉత్పత్తి చేసింది. ఈ పదిలక్షలవ కారుగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను తయారు చేశామని ఫోర్డ్ ఇండియా ఈడీ(మాన్యుఫాక్చరింగ్ ఫోర్డ్ చెన్నై వెహికల్ అసెంబ్లీ, ఇంజిన్ ప్లాంట్) బాలసుందరం రాధాకృష్ణన్ చెప్పారు. ఈ చెన్నై ప్లాంట్ తమకు అంతర్జాతీయ తయారీ కేంద్రంగా కూడా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఈ చెన్నై ప్లాంట్‌లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, ఫోర్డ్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్ వంటి కార్లను ఫోర్డ్ ఇండియా తయారు చేస్తోంది.
ఫోర్డ్ చెన్నై ప్లాంట్ నుంచి పది లక్షల కార్లు
Published Fri, Nov 6 2015 1:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM
Advertisement
Advertisement