Halloween party
-
హంతకుని గెటప్‌లో మార్క్ జుకర్‌బర్గ్ (ఫోటోలు)
-
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో లలా లాండ్ సీజన్ 3.0 (ఫోటోలు)
-
అమెరికాలో కాల్పులు..
కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చోటు చేసుకుంది. హలోవీన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో అకస్మాత్తుగా కాల్పులు చోటు చేసుకున్నాయి. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా కమ్యూనిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి అత్యంత ధనికులు నివాసముండే ఆ ప్రాంతంలో స్థానికంగా ఉండే 100 మంది హలోవీన్ విందు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. కాల్పులకు కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, కాసేపటికి పోలీసులు వచ్చారని, అంబులెన్స్‌ల్లో పలువురిని తీసుకువెళ్లారని స్థానికులు తెలిపారు. -
మెగా పార్టీ.. భయానక రూపాల్లో స్టార్స్
పాశ్చాత్య సంస్కృతిలో ప్రముఖంగా కనిపించే హాలోవీన్ పార్టీల సందడి ఇటీవల కాలంలో మనదేశంలో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఇలాంటి పార్టీలలో పాల్గొంటుండటంతో సామాన్యుల్లోనూ వీటిపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా హాలోవీన్ వీక్ సందర్భంగా మెగాఫ్యామిలీ అంతా పార్టీ చేసుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌తో సహా కొణిదెల, అల్లు కుటుంబాలు ఈ పార్టీలో పాల్గొన్నాయి. ముఖ్యంగా కల్యాణ్ దేవ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు మెగా డాటర్స్ సుస్మిత, శ్రీజ వింత మేకప్‌లతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అనిశ్చితికి తెరదించేందుకే!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించి ప్రజల్లో ఉన్న అనిశ్చితికి తెరదించేందుకు అన్ని వివరాలను వెల్లడిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ‘హత్యకు సంబంధించిన ప్రతి వివరాన్ని పూర్తిగా వెల్లడిస్తాం. కేసుకు సంబంధించి బతికున్న వ్యక్తుల వివరాలను మాత్రం తెలపబోం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ట్వీట్ చేశారు. సీఐఏ, ఇతర ఏజెన్సీలతో మాట్లాడిన తర్వాత మిగిలిన వివరాలూ వెల్లడించాలని నిర్ణయించాం అని ఆయన పేర్కొన్నారు. ‘మిలటరీ, భద్రత, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, చట్టబద్ధ సంస్థల గౌరవాన్ని కాపాడటంతోపాటు, విదేశీ సంబంధాలకు విఘాతం కలగకుండా తాత్కాలికంగా పలు పత్రాల విడుదలను నిలిపివేయాల్సి వచ్చింది. 180 రోజుల సమీక్ష తర్వాత వాటినీ విడుదల చేస్తాం’ అని ట్రంప్ తెలిపారు. ఈ విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నామని అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ పేర్కొన్నారు. ‘కేసుకు సంబంధించి మా దగ్గరున్న అన్ని వివరాలనూ వెల్లడిచేస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. మీడియా మీతో ఎలా వ్యవహరిస్తుంది? హాలోవీన్ పార్టీ సందర్భంగా వైట్‌హౌస్ రిపోర్టర్ల పిల్లలతో ట్రంప్ సరదాగా సంభాషించారు. చిన్నారులకు కానుకలు అందించిన ట్రంప్.. మీడియాపై తనదైన శైలిలో జోకులు వేశారు. పిల్లలతో వారి తల్లిదండ్రుల ఉద్యోగం గురించి సరదాగా మాట్లాడారు. వారందరితో కలసి గ్రూప్ ఫొటో దిగారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్ మీడియాపై తరచూ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ‘మీరు మీ తల్లిదండ్రుల్లాగే ఉండాలనుకుంటున్నారా? జవాబు చెప్పొద్దు. చెబితే నాకు సమస్యలొస్తాయి. ప్రెస్ మీతో ఎలా వ్యవహరిస్తుంది? ప్రపంచంలో అందరికన్నా మిమ్మల్నే మీడియా జాగ్రత్తగా చూసుకుంటుందని అనుకుంటున్నా’ అని ట్రంప్ సరదాగా అన్నారు. పిల్లలతో ఉల్లాసంగా గడిపిన ట్రంప్ వారికి చాక్లెట్లు ఇచ్చారు. -
వైరల్.. భయపెట్టాలని ట్రై చేస్తే...
-
వైరల్.. భయపెట్టాలని ట్రై చేస్తే...
సాక్షి : దారిన పోయే ప్రయాణికులను భయపెడదామనుకున్న అతని ప్రయత్నం బెడసి కొట్టింది. కాస్తుంటే ప్రాణాలు పోయి ఉండేవే. కానీ, అతని ఆయుష్షు గట్టిది కావటంతో చిన్న గాయం కూడా కాకుండా తప్పించుకున్నాడు. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. హలోవీన్ పేరిట తరచూ అక్కడ పార్టీలు సాధారణంగా జరుగుతుంటాయి. వాటిల్లో దెయ్యాల వేషధారణలో తిరుగుతూ వేడుకలు చేసుకుంటుంటారు. అయితే అదే గెటప్ లో ఫ్రాంక్ వీడియో చేయాలని ఓ వ్యక్తి భావించాడు. ఘౌలీష్ బందీ మాదిరి వేషం వేసుకుని కాళ్లు, చేతులు కట్టేసుకుని ముందుకు వెళ్తుంటే.. జాంబీ నర్స్ గెటప్ లో ఉన్న ఓ మహిళ వెనకాల అతన్ని పట్టుకుని లాగుతుంటుంది. ఇలా దారిన కార్లలో వెళ్లే వారిని భయపెట్టడం అతను చేస్తున్నాడు. ఇంతలో ఓ కారు రావటం.. ఆ తాడు తెగిపోవటం.. అతను కింద పడిపోవటం జరిగిపోయాయి. కాస్తుంటే అతని తలపై కారు వెనకాల చక్రం ఎక్కేదే. కానీ, అతని టైం బాగుండి అది జరగలేదు. ఏ ప్రాంతంలో ఏ తేదీలో జరిగిందో స్పష్టత లేకపోయినా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. -
అధ్యక్షా.. మీరు అదుర్స్!
అమెరికా అధ్యక్షుడు బరాక్.. ఓ అగ్రరాజ్యానికి అధినేతగానే కాదు.. వ్యక్తిగతంగానూ మనసున్న నేతగా పేరు గడించారు. ఈ కొత్త ఏడాదిలోనే అమెరికా అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగియబోతున్నది. ఈ సందర్భంగా 2015లో ఒబామా అధికార హోదాలో నిర్వహించిన కార్యకలాపాలనే కాదు.. వ్యక్తిగతంగా కుటుంబసభ్యులతో, వైట్‌హౌస్ సిబ్బందితో, ప్రజలతో మమేకమై.. ఓ సామాన్యుడిలా పంచుకున్న మధురస్మృతులను పీటీ సౌజా ఫొటోల్లో బంధించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ అధికారిక ఫొటోగ్రాఫర్ అయిన సౌజా కొత్త సంవత్సరం సందర్భంగా ఒబామాకు చెందిన వందకుపైగా ఫొటోలను ప్రచురించారు. బ్లెడీ సండే 50వ దినోత్సవ వేడుకగా బహిరంగ సభలో భార్య మిషెల్ చేతిని ఆప్యాయంగా పట్టుకోవడం మొదలు.. హలోవీన్ పార్టీ సందర్భంగా వైట్‌హౌస్ సిబ్బంది పిల్లలకు విందు ఇవ్వడం వరకు ఒబామాలోని మానవతా కోణాన్ని పట్టిచ్చే ఎన్నో అందమైన ఫొటోలు ఇందులో ఉన్నాయి. కూతురు మాలియాతో ప్రేమగా గడుపడం, తనకన్నా చాలా పొడగరి అయిన ఎన్బీఏ ఆటగాడు షాక్విల్ ఓనియల్తో నవ్వుతూ ముచ్చట్లు పెట్టడం, పౌరుహక్కుల 50 దినోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా పౌరులతో చేతులు కలిపి ర్యాలీలో పాల్గొనడం, భార్య మిషెల్‌తో ప్రేమగా గడుపడం వంటి వైవిధ్యభరితమైన ఒబామా ఫొటోలు చూడొచ్చు. అలాగే ఒబామా భార్య మిషెల్ బాక్సింగ్ చేయడం, కుటుంబంతో, బయట ఒబామా సన్నిహితంగా పంచుకున్న అనుభూతులకు చెందిన ఫొటోలను సౌజా ప్రచురించారు. .