కరోనా మహమ్మారి అడ్డుకట్టకు కేంద్రం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు దైనిక జీవితంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇళ్లలో గడపడంతో అందరూ టీవీలు, స్మార్ట్‌ఫోన్లకు అత్తుకుపోయారు. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో చూసే వారి సంఖ్య ఒక్కసారిగా ఎగబాకింది. దీంతో టిక్‌టాక్ వీడియోలు, షార్ట్ ఫిలింలు, ప్రాంక్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తూ కొందరిని ఓవర్‌నైట్ సెలబ్రిటీలను చేసిన ఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి ప్రాంక్ వీడియోలు చేస్తున్న క్రమంలో ప్లాన్ బెడిసి కొట్టి ఇబ్బందలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రాంక్ వీడియోకు ప్లాన్ చేసిన ఓ బాయ్‌ఫ్రెండ్‌కు అలాంటి చేదు అనుభవమే ఎదరైంది.
అయ్యో.. అక్కడ తగిలిందే
ఇటీవల నెట్టింట ప్రాంక్ వీడియోల హవా పెరుగుతోంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల, సన్నిహితుల మీద వీటిని చేస్తున్నారు. అయితే ఈ వీడియోలు ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సరిగ్గా జరిగితే, ఫన్ వస్తుంది కానీ అది ఏ చిన్న తప్పు జరిగినా మర్చిపోలేని ఘటనగా మారుతుంది. ప్రస్తుతం నెట్టింట్లో దర్శనమిస్తున్న ఓ వీడియోలో.. అందులో ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌పై ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేస్తాడు. అందుకోసం అతను తన హుడిని రెగ్యులర్‌గా కాకుండా ఛాతీ వైపు నుంచి ధరిస్తాడు.
అతను గోడకు ఆనుకుని నిలబడి తన ముఖాన్ని హూడీతో కప్పుకుని గోడవైపు మొహం పెట్టుకుని నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడి వచ్చిన అతని గర్ల్‌ఫ్రెండ్ అతని వెనుక నుంచి గట్టిగా కొడుతుంది. అయితే అది వాస్తవానికి అతని ప్రైవేట్ భాగం కావడంతో నొప్పికి అక్కడే కిందపడిపోతాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పాపం మనోడు అనుకున్నది ఒకటైతే, అక్కడి జరిగింది మరొకటి అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్త అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment