
సాక్షి, చెన్నై : కోలీవుడ్ హీరో విశాల్ ఇళ్లు, కార్యాలయాలపై గత నెలలో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో విశాల్ పన్నులు ఎగ్గొట్టాడంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటెలిజెన్స్(డీజీజీఎస్టీఐ) తనిఖీలు చేసినట్లు వాటి సారాంశం.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విడుదలైన ఓ వీడియో వైరల్ అవుతోంది. విశాల్ డబ్బును ఐటీ అధికారులు లెక్కిస్తున్నట్లు.. ఆయన్ని ప్రశ్నిస్తున్నట్లు అందులో ఉంది. అది తన కష్టార్జితమని విశాల్ చెబుతుంటే.. అధికారులు మాత్రం లెక్కల్లో లేని సోమ్మని చెప్పటం... కెమెరా ఆఫ్ చెయ్యండంటూ అధికారులను వేడుకోవటం... అన్నింటికి మించి రెండు వేల నోట్ల కట్టల ముందు విశాల్ ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇదే అసలు వీడియో అంటూ చక్కర్లు కొట్టింది. అయితే వీడియో పూర్తిగా చూసినోళ్లకే అందులో అసలు విషయం అర్థమౌతోంది. అంత సీరియస్ డిస్కషన్ నడుస్తుండగా.. మధ్యలో సీనియర్ నటుడు అర్జున్ అక్కడికి వచ్చారు. ఓ పక్క సీన్ కోసం డైరెక్టర్ వెయిట్ చేస్తుంటే ఏంటయ్యా? ఇదంతా అని విశాల్‌ను అర్జున్ ప్రశ్నించగా.. అందరి ఘోల్లున నవ్వుకున్నారు. రెండు వేల నోట్ల మధ్య అన్నీ తెల్ల కాగితాలే చూపిస్తూ అర్జున్ సరదాగా అక్కడున్న స్టాఫ్‌పై చిర్రుబుర్రు లాటం బట్టి ఇదంతా ఓ ప్రాంక్ వీడియో అని చెప్పకనే చెబుతోంది.
మెర్సల్ సినిమాకు మద్దతు ప్రకటించిన మరుసటి రోజే దాడుల వార్తలు రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కక్ష్య సాధింపు చర్యకు దిగుతోందని అని పలువురు విశాల్‌కు మద్ధతుగా నిలిచారు. ఇప్పుడు ఇలా ఓ చిత్ర షూటింగ్ సన్నివేశాన్ని ఆ సందర్భానికి అనుగుణంగా మలుచుకున్న విశాల్.. సెన్సాఫ్ హ్యుమర్‌కి అభిమానులు హాట్సాఫ్ చెబుతున్నారు.
Unseen Footage of IT Raid @ Vishal.. #ITRaidatVishal pic.twitter.com/ozSAOfpEaX
— Ramesh Bala (@rameshlaus) 15 November 2017
Comments
Please login to add a commentAdd a comment