సాక్షి, తిరుపతి: తిరుమలలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, వీడియో అంశాన్ని భక్తులు టీటీడీ దృష్టికి తీసుకెళ్లడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
కాగా, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుమల లోపల ప్రాంక్ వీడియో కోసం.. నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కలరింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా కంపార్ట్మెంట్‌లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేచారు. దీంతో, వెంటనే సదరు యూట్యూబర్ కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు తీశాడు. ఇదంతా మరో యువకుడు వీడియో తీశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయ మైన చర్య .. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
• తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియోలు ! #TTFVasan @APPOLICE100 @TTDevasthanams pic.twitter.com/vxJxCwmqMm
— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) July 11, 2024
ఇదిలా ఉండగా.. తిరుమల ఆలయంలో క్యూ లైన్లలోకి వెళ్లాలంటే సిబ్బంది ఎన్నో రకాలుగా చెకింగ్స్ చేసి పంపిస్తారు. భక్తుల వద్ద మొబైల్ ఫోన్లు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటారు. కాగా, ఈ వీడియో చేసిన యువకులు ఆలయంలోకి ఫోన్ ఎలా తీసుకెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment