ఎస్కలేటర్‌పై అమ్మాయి చేయిని తాకితే..! | Touching Strangers prank video | Sakshi
Sakshi News home page

ఎస్కలేటర్‌పై అమ్మాయి చేయిని తాకితే..!

Published Wed, Sep 21 2016 7:29 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

ఎస్కలేటర్‌పై అమ్మాయి చేయిని తాకితే..!

ఎస్కలేటర్‌పై అమ్మాయి చేయిని తాకితే..!

రద్దీ ప్రదేశాల్లో మనుషులు ఒకరినొకరు తాకడం, తగలడం సాధారణంగా జరిగే విషయమే. కానీ ఓ అగంతకుడు ఉద్దేశపూర్వకంగా ఎదురుగా వస్తున్న వ్యక్తుల చేతులను తాకితే ఎలా ఉంటుంది? ఎస్కలేటర్‌లో ఓ అమ్మాయి అబ్బాయిల చేతులను కావాలని తాకితే.. వారు ఏమనుకుంటారు.. అదేవిధంగా ఓ వ్యక్తి అమ్మాయిలను చేతులను తాకుతూపోతే వారి స్పందన ఎలా ఉంటుంది.

అవును చాలా చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కరి ఒక్కోరకంగా ఉంటుంది. ఓ వ్యక్తి కావాలనే అమ్మాయిల చేతులను తాకితే.. చాలామంది చిత్రంగా చూశారు. కొంతమంది గందరగోళానికి లోనయ్యారు. అతనికేమైనా పిచ్చా అన్నట్టు కొందరు యువతులు పరికించి చూశారు. వారి వెంట ఉన్న మగవారైతే ఏకంగా గొడవకు సిద్ధమయ్యారు. ఇక, ఓ అమ్మాయి అబ్బాయిల చేతులను తాకినప్పుడు మాత్రం చాలామంది ఒకింత ఆనందంగా.. కొంత సందిగ్థంగా స్పందించారు.

కొంతమంది ఇదేం పద్ధతి కాదండి అంటూ 'రాముడు మంచి బాలుడు' టైప్‌లో చెప్పారు. చాలాచాలా చిత్రమైన ఇలాంటి హవభావాలకు, విచిత్రమైన స్పందనలకు తాజాగా యూట్యూబ్‌లో పెట్టిన ఓ ప్రాంక్‌ వీడియో వేదికగా మారింది. యూట్యూబ్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన లవ్ రుద్రాక్ష, ఖుషీ తాజాగా ఓ ప్రాంక్‌ వీడియోను పెట్టారు. ఓ షాపింగ్‌ మాల్‌లో ఎస్కలేటర్‌లో ఉన్న వ్యక్తుల చేతులను తాకడం ద్వారా వారు ఎలా స్పందిస్తారన్నది చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షలమందికి పైగా చూశారు. అయితే, పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ప్రాంక్‌ వీడియోలు ఎన్నో ఇప్పటికే వచ్చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement