హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’.విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా తమ సినిమా ప్రమోషన్స్ కోసం చేయించిన ప్రాంక్ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ ఫిలింనగర్ రోడ్డులో వెళుతుంటే ఓ యువకుడు కారుకు అడ్డంగా పడుకొని నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు.
అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్‌సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది.
సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారి ఆలోచించాలా అంటూ చిత్ర యూనిట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమా బాగుంటే ఆడుతుంది. లేకపోతే ఆడియెన్స్ చూడరు. ఇలాంటి జిమ్మిక్కులు వర్కవుట్ కావని ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రాంక్ పేరుతో పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
https://t.co/VXk5VSKO4y#VishwakSen and His Fan Hulchal On #Road | #AshokaVanamLoArjunaKalyanam | Filmylooks #Tollywood
— MrB Celeb News (@mrbcelebnews) May 1, 2022
Comments
Please login to add a commentAdd a comment