Ashoka Vanamlo Arjuna Kalyanam Theatrical Trailer - Sakshi
Sakshi News home page

Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కల్యాణం' ట్రైలర్‌ రిలీజ్‌..

Published Wed, Apr 20 2022 7:41 PM | Last Updated on Wed, Apr 20 2022 8:05 PM

Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Trailer Released - Sakshi

'రాసేసుంటది.. మొత్తం రాసేసుంటది స్క్రిప్ట్‌..' అనే వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే కామెడీ, ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంది.

Ashoka Vanamlo Arjuna Kalyanam Trailer: 'పాగల్' సినిమా తర్వాత యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్‌ విద్యా సాగర్‌ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రారంభంనుంచి విభిన్నంగా ప్రమోషన్స్‌ చేస్తున్న మేకర్స్‌ తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు. 'రాసేసుంటది.. మొత్తం రాసేసుంటది స్క్రిప్ట్‌..' అనే వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే కామెడీ, ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంది.

36 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోకూడదా ? అదేమైనా నేరమా ? జైళ్లో పెడతారా ? అని విశ్వక్ సేన్‌ చెప్పే డైలాగ్ ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో తెలంగాణ అబ్బాయి అర్జున్‌ కుమార్‌గా విశ్వక్ సేన్‌, ఆంధ్రా అమ్మాయి మాధవిగా రుక్సార్‌ దిల్లాన్‌ కనిపించనున్నారు. 33 ఏళ్లు వచ్చిన అర్జున్‌కు ఎందుకు పెళ్లి కాలేదు ? సంబంధం ఫిక్స్‌ అయిన తర్వాత మాధవి పెళ్లి వద్దని ఎందుకు చెప్పింది ? వంటి అంశాలతో సినిమా చూసి తెలుసుకునేలా ఆసక్తిగా ట్రైలర్‌ ఉంది. ఎస్వీసీసీ డిజిటల్‌ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement