సాక్షి, హైదరాబాద్: అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్‌లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై నిఘా పెట్టడంతో పాటు కేసు విచారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. త్వరలోనే సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి వీరిద్దరు కొట్టుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో ఎస్‌ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు సైతం వచ్చాయి.
చదవండి: పార్టీలో మెరిసిన రష్మిక, ఎందుకలా ఫీలవుతోందని ట్రోలింగ్
Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే..
Comments
Please login to add a commentAdd a comment