
జడపట్టి లాగడంతో విగ్గు ఊడి..!
ఈ మధ్య ప్రాంక్ వీడియోలు ఆన్‌లైన్‌లో పెట్టి క్లిక్‌లు తెచ్చుకోవడం యువతకు బాగా అలవాటైంది. అయితే, నిజజీవితంలో సరదా సన్నివేశాలను సృష్టించి.. వాటిని కెమెరాలో బంధించాలన్న ప్రయత్నం అన్నిసార్లు సజావుగా సాగకపోవచ్చు. 'పెళ్లిచూపులు' సినిమాలోలాగా కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు బెడిసికొట్టే.. తీసినవారే బాధితులు అయ్యే అవకాశముంటుంది.
కొందరు టీనేజ్ కుర్రాళ్లు ఇలాగే తమ స్కూల్‌లో ప్రాంక్ వీడియో తీయాలనుకున్నారు. క్యాంటీన్‌లో అమ్మాయిల వెనుక కూర్చిలో కూర్చొని వారి పిలకజడలను పట్టుకొని లాగారు. ఇద్దరు అమ్మాయిల జట్టు గట్టిగానే ఉంది. కానీ మూడో అమ్మాయి జుట్టే విగ్ కావడంతో అది ఊడివచ్చింది. అంతే ఆ నల్ల అమ్మాయి కోపం కట్టలు తెగింది. ఈడ్చి ఒక్కటి ఇచ్చింది. జుట్టు పీకినవాడు దెబ్బకు అడ్డం పడ్డాడు. ఇప్పుడు ప్రాంక్ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. మీరు ఓ లుక్ వేయండి!