ఫైనల్‌ చేరడం సంతోషం.. కప్‌ కొట్టడమే మిగిలింది | IPL 2021: Venkatesh Iyer Reacts Happy Moment After Match Winning Vs DC | Sakshi
Sakshi News home page

Venkatesh Iyer: ఫైనల్‌ చేరడం సంతోషం.. కప్‌ కొట్టడమే మిగిలింది

Published Thu, Oct 14 2021 8:28 AM | Last Updated on Thu, Oct 14 2021 8:37 AM

IPL 2021: Venkatesh Iyer Reacts Happy Moment After Match Winning Vs DC - Sakshi

​​​​​​​PC: IPL Twitter

Venkatesh Iyer Reaction After Winning Match Vs Delhi Capitals.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌ 2లో కేకేఆర్‌ ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌  మరోసారి మెరిశాడు. అర్థ శతకంతో రాణించిన వెంకటేశ్‌ అయ్యర్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయకుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఓపెనర్లిద్దరు ఔటైన తర్వాత కేకేఆర్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. అశ్విన్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో కేకేఆర్‌ రెండు వికెట్లు పోగొట్టుకోవడంతో పాటు మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే ఓవర్‌ ఐదో బంతిని త్రిపాఠి స్టన్నింగ్‌ సిక్స్‌ కొట్టి జట్టను ఫైనల్‌ చేర్చాడు. ఇక రేపు (అక్టోబర్‌ 15న) సీఎస్‌కేతో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: KKR vs DC, IPL 2021: కోల్‌కతా ‘సిక్సర్‌’తో...


PC: IPL Twitter

ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన వెంకటేశ్‌ అయ్యర్‌ స్పందించాడు. ''ఈరోజు మ్యాచ్‌లో నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా. డొమొస్టిక్‌ క్రికెట్‌.. ఐపీఎల్‌ ఇలా ఏదైనా నాకు పెద్ద తేడా ఏం ఉండదు.. నా ఆటతీరు ఇలాగే ఉంటుంది. నేను ఐపీఎల్‌లో ఎలాగైతే ఆడాలనుకున్నానో అదే విధంగా ఆడుతున్నా. ఫైనల్‌ చేరడంతో సంతోషంగా ఉంది.. ఇక కప్‌ కొట్టడమే ఒక్కటే బాకీ ఉంది. ఆ విషయంలో మాత్రం కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు కెప్టెన్‌ మోర్గాన్‌ నాకు పూర్తి స్వేచ్చనిచ్చారు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్‌ అయ్యర్‌కు ఐపీఎల్‌లో ఇది మూడో అర్థసెంచరీ. ఐపీఎల్‌ 2021 తొలి ఫేజ్‌లో కేకేఆర్‌ ఆటతీరు అగమ్యగోచరంగా ఉంది. వరుస పరాజయాలతో ఉక్కరిబిక్కిరైన కేకేఆర్‌ మలిదశలో మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా వెంకటేశ్‌ అయ్యర్‌ ఓపెనర్‌గా ప్రమోట్‌ అద్బుత ఆటతీరుతో ఆకట్టుకుంటూ కేకేఆర్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

Venkatesh Iyer: అయ్యారే అయ్యర్‌.. కేకేఆర్‌ తరపున రెండో బ్యాటర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement