విజయానికి అత్యంత చేరువగా రావడం... చివరకు ఒత్తిడిలో ఓటమిని ఆహా్వనించడం అలవాటుగా మార్చుకున్న పంజాబ్ జట్టు ఈసారి అలాంటి క్షణాలను అధిగమించి బయటపడింది. ఆఖర్లో కొంత అదృష్టం కూడా కలిసి రావడంతో కింగ్స్ ఖాతాలో ఒక విజయం చేరింది. శుభారంభం లభించినా కోల్‌కతా నైట్‌రైడర్స్ సాధారణ స్కోరుకే పరిమితం కాగా... కెపె్టన్ కేఎల్ రాహుల్ ముందుండి పంజాబ్ టీమ్‌ను నడిపించాడు. అతనికి షారుఖ్ ఇచి్చన సహకారం ప్రీతిజింటా టీమ్‌లో ఆనందం నింపింది. మరోవైపు పంజాబ్ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైంది.
దుబాయ్: ఐపీఎల్‌లో ని్రష్కమణకు చేరువగా వచ్చిన దశలో పంజాబ్ కింగ్స్‌కు కీలక గెలుపు దక్కింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (49 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రాహుల్ త్రిపాఠి (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అర్ష్‌దీప్ 3 వికెట్లు, రవి బిష్ణోయ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (55 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.
కీలక భాగస్వామ్యం...
అలెన్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో వెంకటేశ్ శుభారంభం అందించినా... తర్వాతి ఓవర్లోనే శుబ్‌మన్ గిల్ (7) బౌల్డ్‌తో కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. అయితే వెంకటేశ్, త్రిపాఠి రెండో వికెట్ భాగస్వామ్యంతో జట్టు స్కోరు వేగంగా సాగింది. ఎలిస్ వేసిన మూడు ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టడం విశేషం. రెండో వికెట్‌కు 55 బంతుల్లో 72 పరుగులు జోడించిన అనంతరం త్రిపాఠి డగౌట్ చేరాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంకటేశ్ కొద్ది సేపటికే భారీ షాట్‌కు ప్రయతి్నంచి అవుటయ్యాడు. మోర్గాన్ (2), దినేశ్ కార్తీక్ (11), సీఫెర్ట్ (2) విఫలం కావడంతో చివర్లో కోల్‌కతా ఎక్కువ పరుగులు సాధించలేకపోయింది.
రాహుల్ అర్ధ సెంచరీ...
తాను ఎదుర్కొన్న తొలి బంతికే మోర్గాన్ సులువైన క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మయాంక్ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. సౌతీ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన అతను నరైన్ ఓవర్లో కూడా మరో సిక్సర్ కొట్టడంతో 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. చక్కటి బంతితో మయాంక్‌కు బోల్తా కొట్టించిన వరుణ్, తన తర్వాతి ఓవర్లోనే పూరన్ (12)ను కూడా అవుట్ చేశాడు. మార్క్‌రమ్ (18), హుడా (3) ప్రభావం చూపలేకపోయారు. గత మ్యాచ్‌లలో జట్టు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాహుల్ వేగంగా ఆడకపోయినా చివరి వరకు క్రీజ్‌లో నిలిచి జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. విజయానికి 4 పరుగుల దూరంలో రాహుల్ వెనుదిరిగినా... మిగిలిన పనిని షారుఖ్ ఖాన్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) హుడా (బి) బిష్ణోయ్ 67; గిల్ (బి) అర్ష్‌దీప్ 7; త్రిపాఠి (సి) హుడా (బి) బిష్ణోయ్ 34; రాణా (సి) మయాంక్ (బి) అర్ష్‌దీప్ 31; మోర్గాన్ (ఎల్బీ) (బి) షమీ 2; కార్తీక్ (బి) అర్ష్‌దీప్ 11; సీఫెర్ట్ (రనౌట్) 2; నరైన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–18, 2–90, 3–120, 4–124, 5–149, 6–156, 7–165. బౌలింగ్: అలెన్ 4–0–38–0, షమీ 4–0–23–1, అర్ష్‌దీప్ 4–0–32–3, ఎలిస్ 4–0–46–0, రవి బిష్ణోయ్ 4–0–22–2.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మావి (బి) అయ్యర్ 67; మయాంక్ (సి) మోర్గాన్ (బి) వరుణ్ 40; పూరన్ (సి) మావి (బి) వరుణ్ 12; మార్క్‌రమ్ (సి) గిల్ (బి) నరైన్ 18; హుడా (సి) త్రిపాఠి (బి) మావి 3; షారుఖ్ (నాటౌట్) 22; అలెన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–70, 2–84, 3–129, 4–134, 5–162. బౌలింగ్: సౌతీ 4–0–40–0, శివమ్ మావి 4–0–31–1, వరుణ్ 4–0–24–2, నరైన్ 4–0–34–1, వెంకటేశ్ 2.3–0–30–1, రాణా 1–0–7–0.
పంజాబ్‌కో గెలుపు
Published Sat, Oct 2 2021 5:31 AM | Last Updated on Sat, Oct 2 2021 5:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment