IPL 2021 Final: పలు అరుదైన రికార్డులపై కన్నేసిన సీఎస్‌కే ఆటగాళ్లు  | IPL 2021 Final CSK Vs KKR: CSK Players Set To Reach Milestones | Sakshi
Sakshi News home page

IPL 2021 Final CSK Vs KKR: పలు అరుదైన రికార్డులపై కన్నేసిన సీఎస్‌కే ఆటగాళ్లు

Published Fri, Oct 15 2021 6:16 PM | Last Updated on Fri, Oct 15 2021 6:16 PM

IPL 2021 Final CSK Vs KKR: CSK Players Set To Reach Milestones - Sakshi

CSK Players Set To Reach Milestones In IPL 2021 Final Match Against KKR: చెన్నై సూపర్ కింగ్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌లో పలు అరుదైన రికార్డులు బద్దలయ్యే ఆస్కారముంది. ఆ రికార్డులు ఏంటో, వాటిని ఏ సీఎస్‌కే ఆటగాడు బద్దలు కొట్టనున్నాడో ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.  
* నేటి మ్యాచ్‌తో సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో 200వ మ్యాచ్‌ ఆడనున్నాడు. 
* ఇవాళ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్‌ రాబిన్‌ ఊతప్ప మరో 55 పరుగులు సాధిస్తే, పొట్టి ఫార్మాట్‌ మొత్తంలో 7000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో 5 బౌండరీలు సాధిస్తే టీ20 ఫార్మాట్‌ మొత్తంలో 700 ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. 
* సీఎస్‌కే మిడిలార్డర్‌ ఆటగాడు అంబటి రాయుడు మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో సిక్సర్‌ బాదితే ఐపీఎల్‌లో 150, టీ20 ఫార్మాట్‌ మొత్తంలో 200 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. 
* నేటి మ్యాచ్‌లో సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో మరో 5 వికెట్లు తీస్తే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన లసిత్‌ మలింగ(170) రికార్డును అధిగమిస్తాడు. 
* సీఎస్‌కే సారధి ధోని నేటి మ్యాచ్‌లో మరో 65 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్‌ మొత్తంలో 7000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. 
* ఇవాళ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరో 24 పరుగులు చేస్తే పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నుంచి ఆరెంజ్‌ క్యాప్‌ చేజిక్కించుకోవడంతో పాటు ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నాడు. 
* నేటి మ్యాచ్‌తో సీఎస్‌కే ఓపెనర్‌ డుప్లెసిస్‌ 100వ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. అలాగే మరో 7 సిక్సర్లు బాదితే ఐపీఎల్‌లో 100 సిక్సర్ల ఘనతను, మరో 3 ఫోర్లు కొడితే టీ20 ఫార్మాట్‌ మొత్తంలో 600 ఫోర్ల మైలురాయిని చేరుకుంటాడు. 
చదవండి: సీఎస్‌కే జెర్సీలో వార్నర్‌.. అసలేం జరిగింది..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement