milestones
-
‘నేనెప్పుడూ అనుకోలేదు’
న్యూఢిల్లీ: క్రికెట్ కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడు అనుకోలేదని భారత స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ఈ వన్డే ప్రపంచకప్‌లో 48వ సెంచరీతో భారత గ్రేటెస్ట్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ (49) సరసన నిలిచేందుకు చేరువైన కోహ్లి తన తారాస్థాయి బ్యాటింగ్ ప్రదర్శనపై స్పందిస్తూ... ‘క్రికెట్ గురించే మాట్లాడితే... ఇంతలా రాణిస్తానని, ఇన్ని మైలురాళ్లు అధిగమిస్తానని ఎప్పుడూ అనుకోనే లేదు. దేవుడి కృప వల్లే ఎక్కడో ఉన్న నేను ఇక్కడిదాకా వచ్చాను. నా ఆటతీరు, నిలకడ కొనసాగుతున్నాయి. సెంచరీలు చేయాలని, వేల కొద్దీ పరుగులు సాధించాలని కలలైతే కనేవాణ్ని. కానీ అవన్నీ ఇలా ఒక్కొక్కటిగా సాకారమవుతాయని అనుకోలేదు. నిజం చెప్పాలంటే క్రికెట్లో ఇవి ఇలా జరుగుతాయని, పయనం ఇలా సాగుతుందని ఎవరూ ప్రణాళికలు వేసుకోరు’ అని అన్నాడు. ఈ 12 ఏళ్లలో టన్నుల కొద్దీ పరుగులు చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఒక దశలో తన ప్రొఫెషనల్ క్రికెట్లోని లోపాల్ని గుర్తించడం... వెంటనే ఆటకు తగిన జీవనశైలి, క్రమశిక్షణ అలవర్చుకోవడం వల్లే అంతా మంచి జరిగిందని విరాట్ చెప్పుకొచ్చాడు. ‘నా దృష్టంతా జట్టుపైనే ఉంటుంది. టీమిండియా విజయాల కోసం నా ప్రదర్శన బాగుండాలని, క్లిష్ట సమయంలోనూ జట్టును గట్టెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే జీవనశైలి (సంపూర్ణ ఫిట్నెస్ కోసం)ని మార్చుకున్నాను. కఠినమైన క్రమశిక్షణ తప్పదని భావించాను. ఆట ఎప్పుడు మన కృషినే గుర్తిస్తుంది. నిజాయితీగా చెబుతున్నా... నా కెరీర్లో నేను బాగా నేర్చుకుంది ఇదే! ఫీల్డులో వంద శాతం అంకితభావంతో ఆడేందుకే కృషి చేస్తా. ఇదంతా కూడా భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తా’ అని కోహ్లి వివరించాడు. 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ బ్యాటింగ్ కింగ్... సచిన్ తర్వాత అంతటి క్రేజ్‌ను సంపాదించుకోవడమే కాదు... ఆ మాస్టర్ బ్లాస్టర్ వేర్వేరు ఘనతలను తిరగరాశాడు. ఈ ప్రపంచకప్‌లో ఒక శతకం, మూడు అర్ధసెంచరీలతో అతను ఇప్పటికే 354 పరుగులు చేశాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం నవంబర్ 5న కోహ్లి పుట్టినరోజు. అదే రోజు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఉండటంతో శతకోటి భారతీయులంతా ఆ రోజు కింగ్ కోహ్లి శతకం కొట్టాలని కోరుకుంటున్నారు. మరో వైపు కోహ్లి కోసం ఆదివారం బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఈడెన్ గార్డెన్స్‌లో ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్‌కు ముందు ఐసీసీ అనుమతితో అందరి ముందు భారీ కేక్‌ను కట్ చేయించాలనేది ప్రతిపాదన. దీంతో పాటు మైదానానికి వచ్చే దాదాపు 70 వేల మంది ప్రేక్షకులకు లోపలికి వెళ్లే సమయంలో ‘కోహ్లి మాస్్క’లను అందజేస్తారు. దాంతో స్టేడియమంతా కోహ్లిమయమయ్యే అవకాశం ఉంది. -
కీలక మైలు రాళ్లు, అనేక విషాదాలు:170 ఏళ్ళ రైల్వే ఘన చరిత్ర ఇది!
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది. 21వ శతాబ్దంలో జరిగిన ఈ అతి పెద్ద రైలు దుర్ఘటన వివరాలు ఇస్తూనే భారత రైల్వేల చరిత్రను, దాని విశిష్ఠతను ఈ ప్రపంచ వార్తాసంస్థలు అందరికీ తెలియజేస్తున్నాయి. బ్రిటిష్ వారి పాలనలోని భారతదేశంలో 1853లో అంటే 170 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన భారత రైల్వే వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి సాధించింది. దేశంలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చడమేగాక, ఇతర సాంప్రదాయ సరకు రవాణా పద్ధతులతో పోల్చితే రైల్వేలు అంతే సామర్ధ్యంతో, ఇంకాస్త చౌకగా వస్తు రవాణా చేయడం ద్వారా భారత ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. 1991 నుంచీ దేశ ఆర్థికవ్యవస్థతో పాటే రోడ్డు మార్గాలు విపరీతంగా విస్తరించినా గాని పెరుగుతున్న వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భారత రైల్వేలు వృద్ధిచెందాయేగాని వెనుకబడ లేదు, భారతదేశంలో నలుమూలలకూ విస్తరించిన భారత రైల్వేల రైలు పట్టాల వ్యవస్థ మ్తొత్తం విస్తీర్ణం 2022 మార్చి 31 నాటికి 1,28,305 కిలోమీటర్లు కాగా, రైళ్లు నడిచే పట్టాల (రైలు ట్రాక్) పొడవు 1,02,831 కి.మీ. అందులో అన్ని రైలు మార్గాల రూట్లు కలిపి చూస్తే వాటి మొత్తం పొడవు 68,043 కి.మీ. 1853లో మొదలైన భారత రైల్యేల ప్రయాణం వేగంగా ముందుకు సాగడంతో 1880 నాటికి 9000 మైళ్ల పొడవైన రైలు మార్గాల స్థాయికి చేరింది. దక్షిణాది నగరం మద్రాసులోనే కదిలిన మొదటి (గ్రానైట్ లోడుతో) భారత రైలు! 1953 ఏప్రిల్ 16న భారత రైల్వేల మొదటి రైలు బొంబాయి నుంచి ఠాణె మధ్య లాంఛనంగా పట్టాలపై నడవడంతో ప్రారంభోత్సవం జరిగిందని చెబుతారు. నాటి నగరం బొంబాయితో సమీపంలోని ఠాణె, కల్యాణ్ వంటి ప్రాంతాలను రైలు మార్గాల ద్వారా కలపాలనే ఆలోచన 1843లో బొంబాయి ప్రభుత్వ చీఫ్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్ బొంబాయి సమీపంలోని భాండప్ ప్రాంతానికి వచ్చినప్పుడు కలిగింది. వెంటనే రైలు మార్గాల నిర్మాణ ప్రయత్నాలు మొదలబెట్టడంతో ఈ ఆలోచన పదేళ్లకు వాస్తవ రూపం దాల్చింది. 21 మైళ్ల దూరం ఉన్న ఈ రూటు మొదటి రైలులోని 14 బోగీల్లో దాదాపు 400 మంది అతిధులు బోరీ బందర్ లో రైలెక్కి ప్రయాణించారు. తర్వాత, తూర్పు తీరంలోని బెంగాల్ లో కలకత్తా నగరం సమీపంలోని హౌరా (బెంగాలీలో హావ్‌డా) నుంచి హుగ్లీకి మొదటి ప్రయాణికుల రైలు 1954 ఆగస్ట్ 15న బయల్దేరింది. ఈ రెండు కొత్త రైల్వే స్టేషన్ల మధ్య దూరం 24 మైళ్లు. భారత ఉపఖండం తూర్పు భాగానికి మొదటి రైలు మార్గాన్ని ఈస్టిండియన్ రైల్వే సంస్థ ఇలా ప్రారంభించింది. తర్వాత దక్షిణాదిలో మొదటి రైల్వే లైను ప్రారంభించారు. 1856 జులై 1న మద్రాస్ రైల్వే కంపెనీ మద్రాసు నగరంలోని వ్యాసరపాడి జీవ నిలయం (వెయసరపాండి), వాలాజారోడ్డు మధ్య మొదటి ప్రయాణికుల రైలు నడిపింది. ఈ రైలు మార్గం దూరం 63 కి.మీ. అయితే, దేశంలో మొదటి రైలు 1853లో నాటి బొంబాయి నగరంలో బయల్దేరిందని చెబుతారు గాని అసలు రైలు అనేది రైలు మార్గంపై నడించింది మాత్రం నాటి మద్రాసు నగర ప్రాంతంలోనే. 1837లోనే నగరంలోని రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట్ బ్రిడ్జికి మొదటి రైలును రెడ్ హిల్ రైల్వే సంస్థ నడిపింది. కానీ ఇది ప్రయాణికుల రైలు కాదు. ప్రఖ్యాత ఈస్టిండియా కంపెనీ ఇంజినీరు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు గ్రానైట్ రవాణా చేయడానికి ఈ రైలును తయారుచేశాడు. గ్రానైట్ రవాణాతో మొదలైన గూడ్సురైళ్లే భారతరైల్వేలకు తెచ్చేది 74శాతం ఆదాయం పైన వివరించినట్టు మద్రాసు నగరంలో గ్రానైట్ రాయి రవాణాతో మొదలైన భారత రైల్వేల గూడ్సు రైళ్లు 1837 నుంచీ అనూహ్య రీతిలో విస్తరించాయి. ఫలితంగా ప్రస్తుతం భారత రైల్వేల ఆదాయంలో 74 శాతం సరకు రవాణా గూడ్సు రైళ్ల వ్యవస్థ ద్వారానే ప్రభుత్వానికి వస్తోంది. ఆసక్తికర అంశం ఏమంటే–చివరికి ఆటోమొబైల్ కంపెనీలు సైతం తమ వాహనాలను గూడ్సు రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు పంపుతున్నాయి. 2027 నాటికి ఇలాంటి రవాణాను 30శాతం పెంచాలని ఈ ఆటోమొబైల్ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇలా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న భారత రైల్వేలు 2019 నుంచీ మరింత వేగంగతో ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేసే ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా గత ఐదేళ్లుగా పత్రికల మొదటి పేజీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది వందే భారత్ యుగమని ప్రజలు ఆనందిస్తున్న సమయంలో ఒడిశాలో శుక్రవారం జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. అయితే, భారత రైల్వేలు ఇలాంటి అనేక సవాళ్లను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డాయి. ప్రతి దుర్ఘటన తర్వాతా ఎన్నో పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నాయి. ఒడిశా ప్రమాదం నుంచి కూడా ఎంతో నేర్చుకుని భారత రైల్వేలు శరవేగంతో ముందుకు పరుగెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్'.. భారత్ మైలురాళ్లు చెప్పిన మోదీ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. దేశ ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. 2022 చివరి ఎపిసోడ్ కావడంతో ఈ ఏడాది భారత్ సాధించిన మైలురాళ్ల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను ఈ ఏడాది అధిగమించినట్లు చెప్పారు. ఏ ఏడాదే జీ-20కి భారత్ నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం వేడుకల్లో భాగంగా నిర్వహించిన హర్ గర్ తిరంగా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఆధునిక యుగంలో యోగా, ఆయుర్వేదానికి ప్రాధాన్యం పెరగడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగులపై యోగా ప్రభావవంతంగా ఉందని టాటా రీసెర్చ్ సెంటర్ చేసిన పరిశోధనను కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయుర్వేదాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను సహకరించాలన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినెల చివరి ఆదివారం మోదీ మన్ కీ బాత్ రేడియా కార్యక్రమంలో మాట్లాడుతారు. మొత్తంగా ఇది 96వ ఎపిసోడ్ కాగా.. ఈ ఏడాది చివరిది. చదవండి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం.. -
స్వావలంబన: ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు
ఆటో మొబైల్ రంగంలో మహిళలు పని చేయడం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని కాలదన్ని ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు. హర్షించదగిన, ఆహ్వానించదగిన పరిణామం ఏమిటంటే ఆటో మొబైల్ రంగంలోని దిగ్గజ సంస్థలు స్త్రీ సాధికారత, స్వావలంబనకు పెద్ద పీట వేస్తున్నాయి. తాజాగా టాటా మోటార్స్ అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ను ప్రారంభించింది... మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. ‘ఇరవైమందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తేలిగ్గా జరగలేదు. కష్టపడాల్సి వచ్చింది. మహిళలు ఒక బృందంగా ఒకేచోట పనిచేయడం వల్ల అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవచ్చు. స్వావలంబనను బలోపేతం చేయవచ్చు. నేటి తరం మహిళలు ఇతరులపై ఆధారపడడం కంటే స్వతంత్రంగా ఎదగడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతల్లో మంచి విజయాలు సాధిస్తున్నారు’ అంటోంది షోరూమ్ జనరల్ మేనేజర్ లవ్లీసింగ్. ఆటోమొబైల్ రంగంలో లవ్లీసింగ్కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సేల్స్ బృందంలో సభ్యురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది లవ్లీసింగ్. ఆ రోజుల్లో నగరం మొత్తంలో ఆటో మొబైల్ రంగానికి సంబంధించి సేల్స్ విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ లవ్లీ. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాను’ అంటే ఆశ్చర్యంగా చూసేవారు.కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ‘టీచర్ జాబ్ చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. అయితే అవేమీ తనను ముందుకెళ్లకుండా అడ్డుకోలేకపోయాయి. ‘సేల్స్ విభాగంలో పనిచేస్తే పదిమంది పలురకాలుగా అనుకుంటారు’ అనే భయం ఉంది. ఎన్నో అపోహలు ఉన్నాయి. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అంతమంది మగవాళ్ల మధ్య ఎలా పనిచేస్తున్నావు...’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ముందుకు వచ్చేవి. వాటిని పట్టించుకొని ఉంటే సేల్స్ విభాగంలో పనిచేసిన వారం రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలి ఇంట్లో కూర్చునేదాన్ని అంటుంది లవ్లీసింగ్. ‘ఆటోమొబైల్ రంగంలో పనిచేయాలనే ఆసక్తి నాలో మొదట ఉండేది కాదు. దీనికి కారణం... పురుషులు మాత్రమే ఆ రంగంలో ఉంటారు అనుకోవడం. అయితే ఆటోమొబైల్ రంగంలో కూడా పురుషులతో సమానంగా మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. వారే నాకు స్ఫూర్తి. ఇరవైమంది సభ్యులు ఉన్న బృందంలో చేరడంతో అప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో భయాలు పోయాయి. ఎంతో ధైర్యం వచ్చింది. ఉద్యోగంలో చేరినట్లుగా లేదు చిన్న విశ్వవిద్యాలయంలో చేరినట్లుగా ఉంది. ఇక్కడి అనుభవాలే మాకు గొప్ప పాఠాలు’ అంటుంది మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న సీమ. 27 సంవత్సరాల గుర్మీత్ ఆటో మొబైల్ రంగంలోకి రావాలనుకోవడానికి ముందు– ‘అంత తేలికైన విషయం కాదు. కార్లు–హెవీ డ్యూటీ ట్రక్స్ అసెంబ్లింగ్‌లో మగవాళ్లతో పోటీపడడం కష్టం. ఇండస్ట్రీలో మొదలైన కొత్త డిజిటల్ ట్రెండ్‌ను త్వరగా అందుకోవడం ఇంకా కష్టం’లాంటి మాటలు ఎన్నో వినిపించాయి. అయితే అలాంటి మాటలేవీ తనను ఇండస్ట్రీకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. ఎంజీ మోటర్స్ గత సంవత్సరం గుజరాత్‌లోని వడోదర ప్లాంట్‌లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను మొదలుపెట్టింది. ‘ప్రయోగాలకు, వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్ ఎంజీ. ఆల్–ఉమెన్ టీమ్ అనేది మహిళలు కష్టపడే తత్వానికి, అంకితభావానికి మేము ఇచ్చే గౌరవం’ అంటున్నాడు ఎంజీ మోటర్ ఇండియా ఎండీ రాజీవ్ చాబ. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని పాడుకోనక్కర్లేకుండానే ఆటోమొబైల్ రంగంలో మహిళలకు మేలు చేసే మంచికాలం వచ్చింది. దిగ్గజ సంస్థలు ‘ఆల్–ఉమెన్ టీమ్’లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. -
విండీస్‌తో వన్డే సిరీస్.. రోహిత్ ముంగిట అరుదైన రికార్డులు
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ద్వారా రోహిత్ శర్మ తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్న ఈ సిరీస్‌లో రోహిత్ ముంగిట అరుదైన రికార్డులు ఎదురుచూస్తున్నాయి. ఇక ఆదివారం జరగనున్న తొలి వన్డే టీమిండియాకు 1000వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఇక కెప్టెన్‌గానే గాక బ్యాట్స్‌మన్‌గానూ రోహిత్ సాధించనున్న రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం. ►రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 244 సిక్సర్లు కొట్టాడు. మరో ఆరు సిక్సర్లు కొడితే వన్డే చరిత్రలో టీమిండియా తరపున 250 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలవనున్నాడు. టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని 229 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒక ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది(351), క్రిస్ గేల్(331), సనత్ జయసూర్య(270) సిక్సర్లతో వరుసగా తొలి మూడుస్థానాల్లో ఉన్నారు. ►ఇక స్వదేశంలో వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 1523 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ మరో 51 పరుగులు చేస్తే బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లి(38 ఇన్నింగ్స్‌లో 2235 పరుగులు) తొలిస్థానంలో ఉన్నాడు. ►రోహిత్ శర్మ 179 పరుగులు చేస్తే.. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో ఆరో స్థానానికి చేరుకోనున్నాడు. ప్రస్తుతం రోహిత్ వన్డేల్లో 9205 పరుగులతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్‌ను(9378) అధిగమించే అవకాశం ఉంది. ఈ జాబితాలో టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్(18426 పరుగులు), విరాట్ కోహ్లి(12285 పరుగులు), సౌరవ్ గంగూలీ(11221 పరుగులు), రాహుల్ ద్రవిడ్(10768 పరుగులు), ఎంఎస్ ధోని(10599 పరుగులు) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. -
IPL 2021 Final: పలు అరుదైన రికార్డులపై కన్నేసిన సీఎస్కే ఆటగాళ్లు
CSK Players Set To Reach Milestones In IPL 2021 Final Match Against KKR: చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌లో పలు అరుదైన రికార్డులు బద్దలయ్యే ఆస్కారముంది. ఆ రికార్డులు ఏంటో, వాటిని ఏ సీఎస్కే ఆటగాడు బద్దలు కొట్టనున్నాడో ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. * నేటి మ్యాచ్‌తో సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో 200వ మ్యాచ్ ఆడనున్నాడు. * ఇవాళ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ రాబిన్ ఊతప్ప మరో 55 పరుగులు సాధిస్తే, పొట్టి ఫార్మాట్ మొత్తంలో 7000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో 5 బౌండరీలు సాధిస్తే టీ20 ఫార్మాట్ మొత్తంలో 700 ఫోర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. * సీఎస్కే మిడిలార్డర్ ఆటగాడు అంబటి రాయుడు మరో 84 పరుగులు చేస్తే ఐపీఎల్లో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో సిక్సర్ బాదితే ఐపీఎల్లో 150, టీ20 ఫార్మాట్ మొత్తంలో 200 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. * నేటి మ్యాచ్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మరో 5 వికెట్లు తీస్తే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన లసిత్ మలింగ(170) రికార్డును అధిగమిస్తాడు. * సీఎస్కే సారధి ధోని నేటి మ్యాచ్‌లో మరో 65 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్ మొత్తంలో 7000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. * ఇవాళ మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మరో 24 పరుగులు చేస్తే పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నుంచి ఆరెంజ్ క్యాప్ చేజిక్కించుకోవడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నాడు. * నేటి మ్యాచ్‌తో సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నాడు. అలాగే మరో 7 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 100 సిక్సర్ల ఘనతను, మరో 3 ఫోర్లు కొడితే టీ20 ఫార్మాట్ మొత్తంలో 600 ఫోర్ల మైలురాయిని చేరుకుంటాడు. చదవండి: సీఎస్కే జెర్సీలో వార్నర్.. అసలేం జరిగింది..? -
పురీ వేవ్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రికార్డ్స్
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను రెండున్నర దశాబ్దాలపాటు ముందుండి నడిపించిన ఆదిత్య పురీ సోమవారం(26న) పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త ఎండీ, సీఈవోగా శశిధర్ జగదీశన్ బాధ్యతలు చేపట్టారు. బ్యాంకు అదనపు డైరెక్టర్, ఫైనాన్స్ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్న శశిధర్ ఎండీ, సీఈవో బాధ్యతలను పురీ నుంచి స్వీకరించారు. పురీ 1994 సెప్టెంబర్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీగా పదవిని చేపట్టారు. ఆపై బ్యాంక్ పలు విధాలుగా వృద్ధి బాటలో పరుగు పెట్టింది. తద్వారా తీవ్రమైన పోటీలోనూ బ్యాంకు తొలి స్థానంలో నిలుస్తూ వచ్చింది. ప్రస్థానమిలా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1995 మే 19న బీఎస్ఈలో లిస్టయ్యింది. అప్పట్లో బ్యాంకు ఆస్తులు రూ. 3,394 కోట్లుగా నమోదుకాగా.. ప్రస్తుతం రూ. 16 లక్షల కోట్లకుపైగా విస్తరించాయి. మొత్తం డిపాజిట్లు రూ. 642 కోట్ల నుంచి రూ. 12.29 లక్షల కోట్లకు ఎగశాయి. ఇదేవిధంగా 1995 మార్చిలో రూ. 98 కోట్లుగా ఉన్న రుణాలు(అడ్వాన్సులు) 2020 సెప్టెంబర్‌కల్లా రూ. 10.38 లక్షల కోట్లను తాకాయి. వెరసి పురీ హయాంలో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 7 లక్షల కోట్లకు చేరింది. వెరసి ప్రయివేట్ రంగ బ్యాంకులలో టాప్ ర్యాంకుకు చేరుకుంది. 1997లో బ్యాంక్ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 1,000 కోట్లను అధిగమించింది. గత 25 సంవత్సరాలలో బ్యాంకు షేరు రూ. 3 నుంచి రూ. 1,200కు దూసుకెళ్లింది. అంటే 1995 నుంచి చూస్తే 30,000 శాతానికిపైగా రిటర్నులు అందించింది. లాభాల బాటలో ఏస్ ఈక్విటీ వివరాల ప్రకారం 1995 మే చివర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 432 కోట్లను తాకింది. ఆపై 1997 కల్లా రూ. 1,000 కోట్లను అధిగమించగా.. 2005 జులై 6న రూ. 20,130 కోట్లకు చేరింది. ఈ బాటలో 2007 కల్లా రూ. 50,000 కోట్లు, 2010 ఆగస్ట్‌లో రూ. లక్ష కోట్ల మార్క్‌ను దాటేసింది. తిరిగి 2018 జనవరిలో మరింత వృద్ధి చూపుతూ రూ. 5 లక్షల కోట్లను తాకింది. ఇక ప్రస్తుతం అంటే 2020 అక్టోబర్ 27కల్లా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6.73 లక్షల కోట్లకు చేరింది.ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం పుంజుకుని రూ. 1,223 వద్ద ట్రేడవుతోంది. షేర్ల విభజన గతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండుసార్లు షేర్ల ముఖ విలువను విభజించింది. 2011లో రూ. 10 ముఖ విలువను రూ. 2కు, తిరిగి 2019లో రూ. 2 నుంచి రూ. 1కు షేర్ల విభజన చేపట్టింది. ప్రస్తుతం బీఎస్ఈ డేటా ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 26.02 శాతంగా నమోదైంది. పబ్లిక్ వాటా దాదాపు 74 శాతానికి చేరింది. వీటిలో మ్యూచువల్ ఫండ్స్ 13.95 శాతం, ఎల్ఐసీ 3.79 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 37.43 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. -
హోటల్ పేరుకు ‘దారి’ చూపింది
కర్నూలు(హాస్పిటల్): ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మంచి పేరు పెడితే అది ప్రాచుర్యమై విజయవంతం అవుతుందని భావిస్తారు. ఎంతో ఆలోచించి మంచి పేరు పెడతారు. కాగా బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇటీవల ఏర్పాటైన ఓ హోటల్‌కు రహదారే పేరు చూపింది. జాతీయ రహదారిపై ఐటీసీ ఎదురుగా ఉన్న బోర్డుతో పాటు హంద్రీ బిడ్రి దాటిన వెంటనే హైదరాబాద్‌కు 210 కిలోమీటర్ల దూరంలో ఉందని ఓ రాయి కనిపిస్తుంది. ఇదే రాయి వద్ద హోటల్ ఏర్పాటు కావడంతో నిర్వాహకులు తమ హోటల్‌కు–210 అని నామకరణం చేశారు. హోటల్‌కు తగిన పేరు కోసం వందల సంఖ్యలో పేర్లు అనుకుని చివరకు రాయిపై నెంబర్ కనిపించే సరికి అదే పేరుగా నిర్ణయించడం విశేషం. -
మోదీ విమానానికి పాక్ ఓకే
న్యూఢిల్లీ: అన్ని మంత్రిత్వ శాఖలు వచ్చే అయిదేళ్లలో ప్రజాభీష్టం మేరకు వారి జీవితాలను మెరుగుపరిచే ప్రభావవంతమైన ప్రణాళికలను రూపొందించాలని ప్రధాని మోదీ ఉన్నతాధికారులను కోరారు. సోమవారం ఆయన అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రభావశీల ప్రణాళికతో ముందుకు వస్తే వందరోజుల్లోనే అమలయ్యేలా అనుమతులు మంజూరు చేస్తాం’ అని ప్రధాని అధికారులను కోరారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘దేశంలో పని చేయగలిగే వారి సంఖ్య ఎక్కువగా మంది ఉన్నందున వారిని సమర్థంగా వాడుకోవాలి. కేంద్రంలోని ప్రతి శాఖ, రాష్ట్రంలోని ప్రతి జిల్లా కూడా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మార్చేందుకు కీలకమైనవి. ఎంతో కీలకమైన ‘భారత్‌లో తయారీ’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి. చిన్న వ్యాపారాలు, సంస్థల విషయంలో సులభతర వాణిజ్య విధానం ప్రతిఫలించాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల కార్యదర్శులు పరిపాలనపరమైన నిర్ణయాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీ, విద్యారంగ సంస్కరణలు, ఆరోగ్యం, పారిశ్రామిక విధానం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాల్లో కొన్ని సూచనలు, సలహాలు చేశారు. 2014లోనూ ఇఏదేవిధంగా కార్యదర్శుల స్థాయి అధికారులతో మోదీ సమావేశమ య్యారు. మోదీ విమానానికి పాక్ ఓకే కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో జూన్ 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ విమానానికి గగనతల అనుమతులు ఇవ్వాలన్న భారత్ విజ్ఞప్తికి పాకిస్తాన్ సానుకూలంగా స్పందించింది. తమ దేశం మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్ వెళ్లేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అంగీకరించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్ ఈ ఏడాది ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టడంతో పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని మొత్తం 11 రూట్లకుగానూ రెండు మార్గాల్లోనే రాకపోకల్ని అనుమతిస్తోంది. కాగా, జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన విజ్ఞప్తికి మోదీ అంగీకరించారు. ఫ్రాన్స్‌లోని బియర్రిట్జ్‌లో ఆగస్టు 24 నుంచి 26 వరకూ జరిగే 45వ జీ7 సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించారు. -
ముడిచమురు ముప్పు?
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల భారత ఈక్విటీలకు అతిపెద్ద రిస్కని సీఎల్ఎస్ఏ ఈక్విటీ వ్యూహకర్త క్రిస్‌వుడ్ హెచ్చరించారు. మే2 తర్వాత ఇరాన్ చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షల మినహాయింపు ముగిసిపోతుందని, తదనంతరం బ్రెంట్ క్రూడ్ ధర వందడాలర్ల వరకు దూసుకుపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వీలయినంతవరకు ఈక్విటీ పొజిషన్లను చమురు స్టాకులతో హెడ్జ్ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు తన గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో సలహా ఇచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరం మార్చుకునే చాన్సులు కూడా ఉన్నాయని వుడ్ అభిప్రాయపడ్డారు. చైనాతో వాణిజ్య యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఇరాన్ చమురు కొనుగోలుపై ఆంక్షల అంశాన్ని ట్రంప్ వాడుకోవచ్చన్నారు. ప్రస్తుతం సౌదీ తన ఉత్పత్తి పెంచుకునేందుకు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నా అంగీకరించడం లేదని, అందువల్ల అటు చైనా, ఇటు సౌదీలను దారిలో తెచ్చుకునేలా ఇరాన్ ఆయిల్‌పై ట్రంప్ స్వరం మారే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ టెన్షన్ల కారణంగా చమురు ధరలు ఇంతవరకు దాదాపు 40 శాతం ర్యాలీ చేశాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ధర 75 డాలర్లను తాకింది. చమురు ధరల్లో అనూహ్య పెరుగుదల దేశీ కరెన్సీపై పడింది. దీంతో రూపీ 70 స్థాయిలకు పైన కదలాడుతోంది. ప్రస్తుతం ఇండియా స్టాక్ మార్కెట్‌పై సానుకూలంగా ఉన్నా, రూపాయిపై తాను ఆసక్తిగా లేనని వుడ్ చెప్పారు. రూపాయి వాస్తవ ఎక్చేంజ్ రేటు లెక్కన ఇంకా చౌకగా లేదని, ఆర్బీఐ పాలసీలో వచ్చిన మార్పుతో రూపాయికి రక్షణ తగ్గిందని వివరించారు. ఎన్నికలు– ఎకానమీ మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక ఆర్థ్ధిక నిర్ణయాల్లో నోట్లరద్దు, జీఎస్టీ ఎకానమీపై పెను ప్రభావం చూపాయి. వీటిలో నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థకు అత్యంత చెరుపు చేసిందని వుడ్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఎకానమీలో నల్లధనం ఏరివేతే నోట్లరద్దు ఉద్దేశమని, కానీ అసంఘటిత రంగానికి నోట్ల రద్దు చాలా కీడు చేసిందని, ఇదే తరుణంలో వచ్చిన జీఎస్టీతో ఈ రంగానికి మరింత ఇక్కట్లు కలిగాయని చెప్పారు. ముఖ్యంగా బీజేపీకి ప్రధాన మద్దతుదారులైన చిన్న వ్యాపారస్థులకు జీఎస్టీ దెబ్బ గట్టిగా తగిలిందన్నారు. అయితే తాజా ఎన్నికల్లో తిరిగి మోదీనే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని, కానీ గతంలో కన్నా మెజార్టీ తగ్గవచ్చని అంచనా వేశారు. అందుకే మోదీ ఈ దఫా గుజరాత్లో సైతం గట్టిగా ప్రచారం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ఎకానమీ సంబంధిత అంశాలను ఆయన ప్రస్తావించడం లేదని, కేవలం జాతీయత, దేశభక్తి, పాక్‌కు గుణపాఠం వంటి అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారన్నారు. ఆందోళనలో ఆటోమొబైల్ ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల దేశీయ ఆటోమొబైల్రంగాన్ని ఇబ్బంది పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ సరఫరా లోటు భర్తీ చేసేందుకు ఇతర దేశాలు ముందుకు వస్తున్నా, రాబోయే కొన్ని వారాల పాటు మాత్రం ముడిచమురు ధరలకు రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చమురు ఆధారిత రంగాలన్నీ క్రూడ్ ధర 90 డాలర్లను దాటకూడదని ఆశిస్తున్నాయి. ఒకవేళ క్రూడ్ 90 డాలర్లను దాటితే వెంటనే ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్ ప్రభావం కనిపిస్తుంది. ఒకపక్క కొన్ని నెలలుగా దేశీ ఆటో విక్రయాలు మందగించాయి. ఇదే సమయంలో పెరుగుతున్న చమురు ధరలు ఆటో మొబైల్ పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ క్రూడ్ 80 డాలర్లను చేరితే అసలే అంతంతమాత్రంగా ఉన్న విక్రయాలు మరింత దిగజారతాయని ప్రముఖ కంపెనీలు భయపడుతున్నాయి. క్రూడాయిల్ ధరల ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నాయి. కొందరు నిపుణులు మాత్రం ముడిచమురు ధరలు మరింత పెరిగితే టూవీలర్ విక్రయాలు, అందునా అధిక మైలేజ్ ఇచ్చే వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీలెవల్ బైక్స్, కాంపాక్ట్ కార్ల విక్రయాలు సైతం పాజిటివ్‌గా ఉండే చాన్సులున్నాయి. ఓఎంసీలకు గడ్డుకాలం! మరింత రాబడి కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలపై(ఓఎంసీ) ప్రభుత్వం తెస్తున్న ఒత్తిళ్ల కారణంగా సమీప భవిష్యత్‌లో ఈ కంపెనీల ఫైనాన్షియల్ ప్రొఫైల్స్ ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఓఎంసీల ఫలితాలు ఇబ్బందుల్లో పడితే వాటి క్రెడిట్ రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరించింది. బడ్జెట్లో పేర్కొన్న డిజి న్వెస్ట్మెంట్ అంచనాలను అందుకునేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోందని తెలిపింది. ఇందుకోసం నగదునిల్వలు భారీగా ఉన్న పీఎస్‌యూలను రెండో దఫా మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని, షేర్ బైబ్యాక్ చేపట్టాలని కోరుతోందని తెలిపింది. ఈ కంపెనీలు వచ్చే రెండేళ్ల కాలానికి రూపొందించుకున్న పెట్టుబడుల ప్రణాళికలకు బైబ్యాక్‌లు, డివిడెండ్లు విఘాతం కల్పిస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఓఐఎల్‌కు బీబీబీ నెగిటివ్ రేటింగ్, ఐఓసీ, బీపీసీఎల్‌కు బీబీ ప్లస్ రేటింగ్ ఉంది. క్రూడ్ ధర పెరిగినా ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉంటే వీటికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2008 రిపీట్?! ప్రస్తుత పరిస్థితులు 2008లో ముడిచమురు మార్కెట్‌ను గుర్తు చేస్తున్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అప్పట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పరుగులు తీసి 150 డాలర్ల వరకు చేరాయి. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కువ దేశాల్లో చమురు ధరలపై ప్రభుత్వాల నియంత్రణ ఉండేది. కానీ ఇప్పుడు చాలా దేశాలు ఓపెన్ మార్కెట్‌కు మరలాయి. ఇండియాలో చమురు ధరలపై ప్రభుత్వ పెత్తనం ఉన్నంత వరకు ఎకానమీపై తీవ్ర ఒత్తిడి ఉండేది. ధర పెరిగే కొద్దీ ప్రభుత్వం సబ్సిడీలు పెంచుతూ పోవాల్సి వచ్చేది. కానీ గత నాలుగైదేళ్లుగా చమురు ధరలు బాగా దిగివచ్చాయి. చాలా రోజులు క్రూడ్ ధర 40 డాలర్ల వద్ద కదలాడింది. ఈ సమయంలో ప్రభుత్వానికి చాలా మిగులు కలిగింది. ఇదే సమయంలో చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేయడం కూడా జరిగింది. అంతర్జాతీయంగా అమెరికా షేల్ గ్యాస్ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల గతంలోలాగా ముడిచమురు 150 డాలర్లకు చేరకపోవచ్చని ఎక్కువమంది భావన. -
నవయుగ కంటెయినర్ టర్మినల్ సరికొత్త రికార్డు
హైదరాబాద్: నవయుగ కంటెయినర్ టర్మినల్ (ఎన్సీటీ) సరుకు రవాణాలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2018–19లో 5,00,000 టీఈయూల (భారీ ఓడల నిర్వహణ సామర్థ్యాన్ని లెక్కించే కొలమానం) హ్యాండ్లింగ్‌ను 2019 మార్చి 27న తొలిసారిగా చేరుకున్నట్టు సంస్థ ప్రకటించింది. ఎం.వి ఎస్ఎస్ఎల్ కుచ్ వెస్సెల్ ద్వారా దీన్ని సాధించినట్టు తెలిపింది. 2013–14లో 58,577 టీఈయూల సామర్థ్యం నుంచి చూస్తే ఐదేళ్ల కాలంలో 9 రెట్ల వృద్ధిని నమోదు చేసినట్టు పేర్కొంది. కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ సీఈవో, డైరెక్టర్ అనిల్ యెండ్లూరి దీనిపై మాట్లాడుతూ... నవయుగ కంటెయినర్ టర్మినల్ భారత తూర్పు తీరంలో రవాణా హబ్‌గా అవతరించేందుకు భారీ ముందగుడు వేసినట్టు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో దీన్నొక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. షిప్పింగ్ లైన్స్‌తో బలమైన భాగస్వామ్యాలు లేకుండా ఈ ప్రగతి సాధ్యమయ్యేది కాదని నవయుగ కంటెయినర్ టర్మినల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి జితేంద్ర నిమ్మగడ్డ అభివర్ణించారు. టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 1.2 మిలియన్ టీఈయూల నుంచి 2019 చివరి నాటికి 2 మిలియన్ల టీఈయూలకు పెంచనున్నట్టు చెప్పారు. -
భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా..
భారత క్రికెట్ జట్టు తన 500వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. గురువారం న్యూజిలాండ్‌తో జరగనున్న ఈ మ్యాచ్.. 1932లో ప్రారంభమైన భారత టెస్ట్ క్రికెట్ ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకమైంది. ఈ సందర్భంగా భారత టెస్ట్ క్రికెట్లో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గ కొన్ని విశేషాలు మీకోసం.. ► భారత్ తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌ను 1932లో క్రికెట్‌కు మక్కాగా పేరుగాంచిన ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో ఆడింది. సీకే నాయుడు తొలి కెప్టెన్. ► భారత జట్టు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ విజయాన్ని రుచి చూసింది 1952లో. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ► మొదటి టెస్ట్ సిరీస్ విజయం మాత్రం భారత్‌కు 1971లో దక్కింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ఈ సిరీస్‌ను భారత్ 1-0తో గెలుపొందింది. ► భారత టెస్ట్ క్రికెట్లో మొట్టమొదటి సారి సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ లాలా అమర్నాథ్. చెన్నైలో 1933లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాలా 118 పరుగులు చేశాడు. ► ఇప్పటివరకు సాధించిన విజయాల్లో బంగ్లాదేశ్‌పై 2007లో సాధించిన విజయమే భారత విజయాల్లో పెద్దది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 219 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ► భారత్ అత్యంత చెత్తగా ఓడింది మాత్రం వెస్టిండీస్ చేతిలో. 1958లో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 336 పరుగుల తేడాతో ఓడింది. ► అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. ► భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. 132 టెస్టుల్లో 619 వికెట్లను కుంబ్లే తన ఖాతాలో వేసుకున్నాడు.