
కర్నూలు(హాస్పిటల్): ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మంచి పేరు పెడితే అది ప్రాచుర్యమై విజయవంతం అవుతుందని భావిస్తారు. ఎంతో ఆలోచించి మంచి పేరు పెడతారు. కాగా బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇటీవల ఏర్పాటైన ఓ హోటల్‌కు రహదారే పేరు చూపింది. జాతీయ రహదారిపై ఐటీసీ ఎదురుగా ఉన్న బోర్డుతో పాటు హంద్రీ బిడ్రి దాటిన వెంటనే హైదరాబాద్‌కు 210 కిలోమీటర్ల దూరంలో ఉందని ఓ రాయి కనిపిస్తుంది. ఇదే రాయి వద్ద హోటల్ ఏర్పాటు కావడంతో నిర్వాహకులు తమ హోటల్‌కు–210 అని నామకరణం చేశారు. హోటల్‌కు తగిన పేరు కోసం వందల సంఖ్యలో పేర్లు అనుకుని చివరకు రాయిపై నెంబర్ కనిపించే సరికి అదే పేరుగా నిర్ణయించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment