భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా.. | milestones in indian test cricket | Sakshi
Sakshi News home page

భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా..

Published Wed, Sep 21 2016 1:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా..

భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా..

భారత క్రికెట్ జట్టు తన 500వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. గురువారం న్యూజిలాండ్తో జరగనున్న ఈ మ్యాచ్.. 1932లో ప్రారంభమైన భారత టెస్ట్ క్రికెట్ ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకమైంది. ఈ సందర్భంగా భారత టెస్ట్ క్రికెట్లో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గ కొన్ని విశేషాలు మీకోసం..
 
► భారత్ తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ను 1932లో క్రికెట్కు మక్కాగా పేరుగాంచిన ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో ఆడింది. సీకే నాయుడు తొలి కెప్టెన్.
 
► భారత జట్టు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ విజయాన్ని రుచి చూసింది 1952లో. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది.
 
► మొదటి టెస్ట్ సిరీస్ విజయం మాత్రం భారత్కు 1971లో దక్కింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ఈ సిరీస్ను భారత్ 1-0తో గెలుపొందింది.
 
► భారత టెస్ట్ క్రికెట్లో మొట్టమొదటి సారి సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ లాలా అమర్నాథ్.  చెన్నైలో 1933లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో లాలా 118 పరుగులు చేశాడు.
 
► ఇప్పటివరకు సాధించిన విజయాల్లో బంగ్లాదేశ్పై 2007లో సాధించిన విజయమే భారత విజయాల్లో పెద్దది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్, 219 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
 
► భారత్ అత్యంత చెత్తగా ఓడింది మాత్రం వెస్టిండీస్ చేతిలో. 1958లో కోల్కతాలో జరిగిన మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్, 336 పరుగుల తేడాతో ఓడింది.
 
► అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు.
 
► భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. 132 టెస్టుల్లో 619 వికెట్లను కుంబ్లే తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement