Courtesy: IPL
Harshal Patel: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. దీంతో హర్షల్ పటేల్ 2013 సీజన్‌లో అత్యధిక వికెట్లు (32) తీసిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తనతో సమంగా నిలిచిన హర్షల్ పటేల్‌ను అభినందించాడు. "అభినందనలు హర్షల్. నీవు ఖచ్చితంగా ఈ రికార్డును సాధిస్తావు !! నీ పోరాట పటిమ చూడటానికి చాలా బాగుంది!' అని బ్రావో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు.
కాగా మొత్తం 15 మ్యాచ్‌లాడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన హర్షల్ ఈ ఘనత సాధించాడు. కాగా 17ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ క్యాచ్ పడక్కల్ వదిలివేయడంతో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డను తృటిలో చేజార్చుకున్నాడు. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు అర్హత సాధించగా... కోహ్లి సేన ఇంటిముఖం పట్టింది.
చదవండి: Glenn Maxwell: కొంచెం డీసెంట్‌గా ఉండండి.. చెత్తగా వాగొద్దు
Comments
Please login to add a commentAdd a comment