ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హర్షల్ పటేల్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. ఈ వేలంలో అతడిని రూ.10.75 కోట్లకు రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. హర్షల్ పటేల్ బేస్ ప్రైస్ 2 కోట్లుగా ఉంది. వేలంలో హర్షల్ పటేల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ చివర వరకు పోటీ పడ్డాయి. కాగా వేలానికి ముందు ఆర్సీబీ హర్షల్ పటేల్‌ను రీటైన్ చేసుకోలేదు. అయితే మళ్లీ వేలంలో ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్-2021 సీజన్‌లో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు.
గత సీజన్‌లో ఆర్సీబీ కేవలం 20 లక్షలకు మాత్రమే కోనుగోలు చేసింది. అయితే అదే ఫ్రాంచైజీ అతడిని 10.75 కోట్లకు కోనుగోలు చేయడం గమనార్హం. ఇక ఈ మెగా వేలంలో భారత స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ భారీ ధర పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అయ్యర్‌కే అత్యధిక ధర. ఇక సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు తొలి ఫేజ్‌లో అమ్ముడు పోలేదు.
చదవండి: IPL 2022 Auction: వేలంలో షాకింగ్ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్
Comments
Please login to add a commentAdd a comment