షార్జా: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో గెలుపు బాట పట్టిందనుకున్న ముంబై ఇండియన్స్ మళ్లీ పేలవ ప్రదర్శన కనబర్చింది. శనివారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. ఫలితంగా ఫ్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను ముంబై క్లిష్టం చేసుకుంది. తొలుత ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది.
అవేశ్ ఖాన్ (3/15), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేల్ (3/21) ముంబైని కట్టడి చేశారు. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. ఛేదనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు), రవిచంద్రన్ అశి్వన్ (21 బంతుల్లో 20 నాటౌట్; 1 సిక్స్) జట్టుకు విజయాన్ని అందించారు. రిషభ్ పంత్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అయ్యర్ మరోసారి
సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ మరోసారి ఢిల్లీని ఆదుకున్నాడు. ఓపెనర్లు ధావన్ (8), పృథ్వీ షా (6), స్మిత్ (9) నిరాశ పరిచారు. ఈ దశలో అయ్యర్, పంత్ జట్టును ఆదుకున్నారు. ఒక ఎండ్ లో అయ్యర్ ఓపికగా ఆడితే... మరో ఎండ్‌లో పంత్ దూకుడుగా ఆడాడు. అయితే ఐదు ఓవర్ల వ్యవధిలో పంత్, అక్షర్ (9), హెట్‌మైర్ (15)లను అవుట్ చేసిన ముంబై... ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టింది. అయితే అశ్విన్, అయ్యర్‌లు జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. చివరి ఓవర్లో గెలుపునకు నాలుగు పరుగులు అవసరం కాగా... తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అశి్వన్ మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రబడ (బి) అవేశ్ 7; డికాక్ (సి) నోర్జే (బి) అక్షర్ 19; సూర్యకుమార్ (సి) రబడ (బి) అక్షర్ 33; సౌరభ్ తివారీ (సి) పంత్ (బి) అక్షర్ 15; పొలార్డ్ (బి) నోర్జే 6; హార్దిక్ (బి) అవేశ్ 17; కృనాల్ (నాటౌట్) 13; కూల్టర్ నైల్ (బి) అవేశ్ 1; జయంత్ (సి) స్మిత్ (బి) అశ్విన్ 11; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 129.
వికెట్ల పతనం: 1–8, 2–37, 3–68, 4–80, 5–87, 6–109, 7–111, 8–122.
బౌలింగ్: నోర్జే 4–1–19–1, అవేశ్ ఖాన్ 4–0–15–3, అశ్విన్ 4–0–41–1, రబడ 4–0– 33–0, అక్షర్ పటేల్ 4–0–21–3.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (ఎల్బీ) (బి) కృనాల్ 6; ధావన్ (రనౌట్) 8; స్మిత్ (బి) కూల్టర్ నైల్ 9; పంత్ (సి) హార్దిక్ (బి) జయంత్ 26; శ్రేయస్ (నాటౌట్) 33; అక్షర్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 9; హెట్‌మైర్ (సి) రోహిత్ (బి) బుమ్రా 15; అశి్వన్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–14, 2–15, 3–30, 4–57, 5–77, 6–93. బౌలింగ్: బౌల్ట్ 4–0–24–1, జయంత్ 4–0–31–1, కృనాల్ 2.1–0–18–1, బుమ్రా 4–0–29–1, కూల్టర్ నైల్ 4–0–19–1, పొలార్డ్ 1–0–9–0.
Comments
Please login to add a commentAdd a comment