IPL 2021 Final: ఐపీఎల్‌ చరిత్రలో అద్భుత రికార్డు  | IPL 2021 Final: CSK Opener Ruturaj Gaikwad Became Youngest Orange Cap Holder In League History | Sakshi
Sakshi News home page

IPL 2021 Final: ఐపీఎల్‌ చరిత్రలో అద్భుత రికార్డు 

Published Fri, Oct 15 2021 8:51 PM | Last Updated on Sun, Oct 17 2021 12:56 PM

IPL 2021 Final: CSK Opener Ruturaj Gaikwad Became Youngest Orange Cap Holder In League History - Sakshi

CSK Opener Ruturaj Gaikwad Became Youngest Orange Cap Holder In IPL History: ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 తుది సమరంలో 24 పరుగుల వద్ద పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(626 పరుగులు) నుంచి  ఆరెంజ్‌ క్యాప్‌ను చేజిక్కించుకున్న రుతురాజ్‌(24 ఏళ్లు).. లీగ్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.

గతంలో ఈ రికార్డు పంజాబ్ మాజీ ఓపెనర్ షాన్ మార్ష్ పేరిట ఉండేది. 2008లో 25 సంవత్సరాల వయసులో షాన్ మార్ష్ 616 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 14 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రుతురాజ్‌ 32 పరుగుల వద్ద సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో శివమ్‌ మావికి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కాగా.. రాబిన్‌ ఊతప్ప(31) నరైన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. క్రీజ్‌లో డుప్లెసిస్‌(57), మొయిన్‌ అలీ(1) ఉన్నారు.  
చదవండి: T20 World Cup 2021: టీమిండియాతో మెగా పోరుకు ముందు పాక్‌ జట్టుకు భారీ షాక్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement