రాంఛీ: ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ఏడాది గడిచిన ప్యాన్స్‌లో మాత్రం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ధోని కు అభిమానులు ఉన్నారు. మన దేశంలో అయితే ప్రత్యేకంగా చేప్పే అవసరంలేదు. అతనంటే ప్రాణం ఇచ్చే వీరాభిమానులూ చాలా మందే కనిపిస్తారు. తాజాగా ఓ అభిమాని ధోనీని కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. వివరాలు.. హరియాణకు చెందిన అజయ్ గిల్ ధోనీకు వీరాభిమాని. తన చిన్నతనం నుంచి ధోని అంటే పిచ్చి...జీవితంలో ఒక్కసారైన కలవాలని కలలు కనేవాడు. ఈ తరుణంలో ధోనీని కలిసేందుకు ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు.
హరియాణ లోని హిసార్ జిల్లా జలన్ ఖేడా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అజయ్ జులై 29న తన గ్రామం నుంచి నడక మొదలు పెట్టాడు. జులై 29న పయనమైన అజయ్ 16 రోజుల పాటు నడిచి రాంచీకి చేరుకున్నాడు. చివరకు ధోనీ ఇంటి వద్దకు చేరుకుని నిలబడి ఉన్న అతడిని ఒక జాతీయ మీడియా ప్రతినిధి చూశాడు. ఆ యువకుడుని ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ప్రశ్నించాడు.
తాను ధోనీ అభిమానిని అని..తనను కలిసేందకు వచ్చాను అని తెలిపాడు. ధోనిని కలిసిన తర్వాత మా ఇంటికి వెళ్తాను'అని అజయ్ గిల్ చెప్పాడు. ఎంతో దూరం నుంచి వచ్చిన తనకు అభిమాన క్రికెటరైన మహీతో 10 నిమిషాలు మాట్లాడిస్తే చాలని వేడుకున్నాడు. అయితే ధోని ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ కోసం దుబాయ్ వెళ్లడాని ఆ మీడియా ప్రతినిధి గిల్‌కు తెలిపాడు. మూడు నెలల తర్వాత ధోని భారత్‌కు వస్తాడని చెప్పినా.. తన ఆరాధ్య దైవాన్ని కలవకుండా ఇంటికి వెళ్లే పరిస్థితే లేదని మొండి పట్టాడు.
ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రికెట్ ఆడటం మానేశానని గిల్ తెలిపాడు. మహీ ఆశీర్వాదం తీసుకున్నాక మళ్లీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. గిల్ తన హెయిర్‌కు ఎల్లో, ఆరేంజ్, డార్క్ బ్లూ, కలర్స్ వేసుకున్న అతను ఓ పక్క ధోనీ, మరో పక్క మహీ అని వెంట్రుకలపై రాసుకున్నాడు. కానీ 1400 కిలోమీటర్ల కాలినడకన వచ్చిన అజయ్ కోరిక మాత్రం తీరలేదు.
Comments
Please login to add a commentAdd a comment