యువ క్రికెటర్‌ను సర్‌ప్రైజ్ చేసిన ధోని (PC: Twitter)
MS Dhoni- Bike Riding- Viral Video: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఓ యువ క్రికెటర్‌కు కలలో కూడా ఊహించని బహుమతి ఇచ్చాడు. తన బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి.. సదరు ప్లేయర్‌ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. స్వయంగా బైక్ నడుపుతూ అతడిని రాంచి వీధుల్లో తిప్పాడు.
ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మిస్టర్ కూల్ కెప్టెన్‌గా ఘనత వహించిన ధోని.. తనను అభిమానించే వారిని ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటాడన్న విషయం తెలిసిందే.
నీ బుద్ధి ఏమైంది?
తాజాగా ఓ యువకుడికి ఆ అవకాశం దక్కింది. రాంచిలో ట్రెయినింగ్ సెషన్ పూర్తి చేసుకున్న ధోని.. యంగ్ ఫ్యాన్ కోరిక మేరకు అతడిని తన బైక్ ఎక్కించుకున్నాడు. Yamaha RD350ని ధోని డ్రైవ్ చేస్తుండగా.. వెనక కూర్చున్న ఆ అబ్బాయి సెల్ఫీ వీడియో తీసుకుంటూ మురిసిపోయాడు. అయితే, నెటిజన్లు మాత్రం అతడి చర్యను తప్పుబడుతున్నారు.
ధోని ఎంచక్కా హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా బండి నడుపుతుంటే నువ్వు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు. రహదారి చిన్నదే కావొచ్చు.. కానీ.. సెల్ఫీ వీడియో పిచ్చిలో మునిగిపోయి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చురకలు అంటిస్తున్నారు. కనీసం ధోని అయినా అతడిని వారించాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.
ఐదోసారి చాంపియన్‌గా నిలిపి
కాగా భారత క్రికెట్ జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా అభిమానులకు వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న తలా.. ఈసారి జట్టును చాంపియన్‌గా నిలిపాడు.
తద్వారా ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డు సమం చేశాడు. 41 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించి పలు రికార్డులు సృష్టించిన ధోని.. ప్రస్తుతం స్వస్థలం జార్ఖండ్‌లో ఉన్నాడు. రాంచిలోని నివాసంలో కుటుంబంతో సమయం గడుపుతున్న తలా.. మోకాలి నొప్పి నుంచి కోలుకుని ట్రెయినింగ్ సెషన్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం
Nothing to see here. Just #MSDhoni living his best semi retired life and a very lucky young cricketer who got a lift on his #YAMAHA RD350. 🏍️ #Jharkhand #Dhoni #msd #mahi #ranchi pic.twitter.com/EipYkBptsU
— Jharkhand Jatra (@JharkhandJatraa) September 15, 2023
Comments
Please login to add a commentAdd a comment